పార్టీల తలరాతను మారుస్తున్న మహిళలు

 

`పదవిలో కూర్చోబెట్టేది మహిళలే

`పురుషులకంటే పెరుగుతున్న మహిళా ఓటర్లు

`విస్తరిస్తున్న మహిళల ప్రభావ నియోజకవర్గాలు

`మహిళా సంక్షేమం అమలు చేయకపోతే పార్టీలకు కష్టాలు తప్పవు

`మహిళల ఓటింగ్‌లో వృద్ధి

`మహిళా చైతన్యానికి నిదర్శనం

`మహిళలను విస్మరిస్తే మట్టికరవక తప్పదు

హైదరాబాద్‌,నేటిధాత్రి:

ఎన్నికల్లో ఒక రాజకీయ పార్టీని గెలిపించాలన్నా లేక గద్దె దించాలన్నా మహిళా ఓటర్ల పాత్ర అ త్యంత కీలకమని ఇటీవలి ఎన్నికల ఫలితాలు స్పష్టం చేస్తున్నాయి. ఇది కేవలం ఒక్క ఆంధ్రప్రదేశ్‌కే పరిమితం కాదు, దేశవ్యాప్తంగా 2019నుంచి ఎన్నికల్లో ఓటింగ్‌ సరళిని పరిశీలించినప్పుడు వెల్లడైన నిష్టుర సత్యం. ఆంధ్రప్రదేశ్‌ విషయానికి వస్తే మహిళా ఓటర్ల సంఖ్య పురుష ఓటర్లను దాటిపోవడం తాజా పరిణామం. తాజా గణాంకాల ప్రకారం 732415 మంది మహిళా ఓటర్లు ఎక్కువ వుండటంతో అధికార, విపక్ష పార్టీలు ముఖ్యంగా మహిళలకు ఇచ్చిన హామీల విషయంలో జాగ్రత్తలు తీసుకోకపోతే ఇబ్బందులు ఎదుర్కొనక తప్పదు. ఆంధ్రప్రదేశ్‌లో గత అసెంబ్లీ ఎ న్నికల్లో చంద్రబాబు నాయకత్వంలోని కూటమి ఇచ్చిన ఆరు హామీల్లో అత్యధికం మహిళలకు సంబంధించినవే కావడంతో ఇప్పుడు మహిళా ఓటర్ల ప్రాధ్యాన్యం ఒక్కసారి వెలుగులోకి వచ్చింది. ఏపీ మంత్రి, చంద్రబాబునాయుడు తనయుడు ఇటీవల ఉండి నియోజకవర్గంలో పర్యటించినప్పుడు మహిళలు తమకు ఇచ్చిన హామీల విషయంలో ప్రశ్నించినట్టు వార్తలు వచ్చాయి. మొగ్గలోనే ఈ పరిస్థితిని అధిగమించేందుకు కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు చేయకపోతే మున్ముందు మరిన్ని గడ్డుపరిస్థితులు ఎదురుకావచ్చు. జగన్‌ నేతృత్వంలోని వైఎస్సార్సీపీ నాయ కులు ఈ పరిణామాలను నిశితంగా గమనిస్తున్నట్టుంది. ఈ హామీల అమలుపై ప్రభుత్వంపై ఎ ప్పటికప్పుడు విమర్శనాస్త్రాలు సంధిస్తున్నది ఈ నేపథ్యంలోనే అనుకోవాలా? కూటమి ఇచ్చిన వాగ్దానాల్లో ఉచితబస్సు సదుపాయం ఇంకా అమలు కాలేదు. ఇది తక్షణ ప్రభావం చూపే హామీ. తెలంగాణలో రేవంత్‌ ప్రభుత్వం అధికారంలోకి రాగానే మొట్టమొదట అమలుచేసింది ఈ హామీనే! ఇది జనాల్లోకి బాగా వెళ్లింది! రేవంత్‌ కూడా ఆంధ్రలో మాదిరిగానే ఆరు హామీలతో ముందుకెళ్లి అధికారాన్ని చేపట్టారు. ఏదోవిధంగా వాటిని అమలు చేసే ఉద్దేశంతోనే ముందుకెళుతున్నారు. వీటిల్లో రైతుభరోసా విషయంలో తెలంగాణ కేబినెట్‌ సమావేశం కీలక నిర్ణయం తీసుకొని విపక్షాల విమర్శలకు అడ్డుకట్ట వేసింది. మరి ఆంధ్రలో కూడా రైతుభరోసాకు హామీ ఇచ్చినా ఇంతవరకు అమలు కాలేదు. అదేవిధంగా 19`59 ఏళ్ల మధ్య వయస్కులైన మహిళలకు నెలకు రూ.1500, తల్లికివందనం వంటి పథకాలపై చంద్రబాబు ప్రభుత్వం ఇంతవరకు మౌనం గానే వుంటోంది.
నిజం చెప్పాలంటే ఏపీలో జరిగిన గత అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికలను పరిశీలిస్తే మొత్తం 175 అసెంబ్లీ స్థానాల్లో 140సీట్లలో, 25 లోక్‌సభ సీట్లలో 21 స్థానాల్లో మహిళా ఓటర్లే ఎక్కువగా ఓ టింగ్‌లో పాల్గన్నట్టు తేలింది. అంటే జగన్‌ ఓటమికి మహిళా ఓటర్లే కీలకపాత్ర పోషించారని చెప్పక తప్పదు. దేశంలో మహిళా ఓటర్లు అధికంగా వున్న రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్‌ కూడా ఒకటిరాష్ట్రంలో మొత్తం 4.14 కోట్లమంది ఓటర్లుంటే వీరిలో 2.1కోట్లు మహిళా ఓటర్లే.గత ఏడాది మే 13న జరిగిన ఓటింగ్‌లో 175 అసెంబ్లీ స్థానాలకు, 25 లోక్‌సభ స్థానాలకు 1.69 కోట్ల మంది మహిళా ఓటర్లు ఓటుహక్కును వినియోగించుకోగా, పురుషులు 1.64కోట్లు మాత్రమే! ఇదిలావుండగా ఏపీ చీఫ్‌ ఎలక్టోరల్‌ ఆఫీసర్‌ జనవరి 5న విడుదల చేసిన ఓటర్ల జాబితా ప్రకారంరాష్ట్రంలో మహిళా ఓటర్ల సంఖ్య 20385851 కాగా పురుష ఓటర్లు 19831791. అంటే ఓ టింగ్‌లో ముఖ్యపాత్ర పోషించేది మహిళలే. రాష్ట్రంలో 10.98లక్షల స్వయం సహాయక బృందా లు పనిచేస్తుండగా వీటిలో 1.15కోట్ల మంది మహిళా ఓటర్లున్నారు. అంటే మొత్తం స్త్రీ ఓటర్ల లో వీరు 60%!
మహిళా ఓటర్లు అధికంగా ఓటింగ్‌లో పాల్గన్న నియోజకవర్గాల్లో కేవలం 10 అసెంబ్లీ స్థానాలు,4లోక్‌సభ స్థానాల్లో మాత్రమే వైఎస్‌ఆర్‌సీపీ విజయం సాధించింది. నిజానికి మహిళలకు పెద్దఎత్తున సంక్షేమ పథకాలు అమలు పరుస్తున్నందున తనకు ఢోకాలేదని ధైర్యంగా ఉన్న జగన్‌కు మహిళలు రaళక్‌ ఇచ్చారనే చెప్పాలి. ఈవిధంగా పెద్దమొత్తంలో మహిళా ఓటర్లు కూటమి వైపున కు మొగ్గు చూపడం వల్లనే అది అధికారంలోకి రాగలిగిందనేది తిరుగులేని సత్యం. ఈ మహిళా ఓటర్ల ఓట్ల బదిలీకి ప్రధాన కారణం జగన్‌ అమలు చేస్తున్న సంక్షేమ పథకాల పట్ల ఎక్కువశా తం మంది స్త్రీలు సంతృప్తిగా లేరనేది స్పష్టమైంది. ఫలితంగా అనుకున్నదానికంటే పెద్ద మొత్తంలో ఓట్ల బదిలీ జరిగి వైఎస్సార్సీపీ పడవ మునిగిపోయింది.
గత ఆరున్నర దశాబ్దాల పోలింగ్‌ని సరళిని పరిశీలిస్తే ఆంధ్రప్రదేశ్‌లో మహిళా ఓటర్లలో చైత న్యం పెరుగుతున్నట్టు స్పష్టంగా తెలుస్తుంది. ఉదాహరణకు 1967లో మొత్తం మహిళా ఓటర్లలో 65.6% మంది ఓటింగ్‌లో పాల్గంటే పురుషులు 72.8% ఓటుహక్కు వినియోగించుకున్నారు.1983 నాటికి స్త్రీపురుషుల ఓటింగ్‌ వ్యత్యాసం 3.7%కు పడిపోగా 2014 నాటికి ఏకంగా 0.1కి తగ్గిపోయింది. 2019లో పురుష ఓటర్లతో పోలిస్తే 11.2లక్షలు అధిక మహిళా ఓటర్లు ఓటు హక్కును వినియోగించుకోగా, 2024 ఎన్నికల్లో పురుషులతో పోలిస్తే 8.85లక్షలు అధికంగా ఓటింగ్‌లో పాల్గన్నారు.

దేశవ్యాప్తంగా మహిళల ప్రభావం

గత లోక్‌సభ ఎన్నికల్లో ఉత్తరప్రదేశ్‌లో 17 స్థానాల్లో, పశ్చిమబెంగాల్‌లో 15లోక్‌సభ స్థానాల్లో మహిళా ఓటర్లు అత్యధికంగా ఓటింగ్‌లో పాల్గన్నట్టు తేలింది. అదేవిధంగా ఒడిషాలో 75% మంది మహిళలు ఓటింగ్‌లో పాల్గంటే, 73% మంది పురుషులు ఓటుహక్కును వినియోగించుకున్నారు. పశ్చిమబెంగాల్‌లో తృణమూల్‌ గెలుచుకున్న లోక్‌సభ సీట్లలో 15 సీట్లలో గెలవడానికి ప్రధాన కారణం మహిళా ఓటర్లే! అంతేకాదు వివిధ రాష్ట్రాల్లో మహిళలకోసం ప్రకటించిన ప్ర త్యేక పథకాలు ఆయా పార్టీలను అధికారంలో కూర్చోబెట్టాయి. ఉదాహరణకు 2023 మధ్యప్రదేశ్‌ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ అధికారంలోకి రావడం ఆ పార్టీ ప్రకటించిన ‘లడ్లీ బెహనా’ పథకం. 23`60 సంవత్సరాల మధ్య వయస్కులైన అర్హులైన మహిళలకు నెలకు రూ.1000 ఆర్థిక స హాయం అందించే పథకం ఇది. కర్ణాటకలో కాంగ్రెస్‌ అధికారంలోకి రావడానికి కారణం ‘గృహలక్ష్మి’ పథకం. దీనికింద మహిళలకు రూ.2వేలు చెల్లింపు, ఉచిత బస్సు ప్రయాణ సదుపాయాన్ని కర్ణాటక ప్రభుత్వం అమలు చేస్తోంది. రాజస్థాన్‌లో కూడా కాంగ్రెస్‌ పార్టీ మహిళలకు రూ.10వేలు వార్షికంగా ఆర్థిక సహాయాన్ని ‘గృహలక్ష్మి’ పథకం కింద అందజేస్తామని వాగ్దానం చేసింది. తమిళనాడు ప్రభుత్వం రూ.2.5లక్షలకంటే తక్కువ ఆదాయం కలిగిన కుటుంబాలకు చెందిన మహిళలకు నెలకు రూ.1000 చొప్పున ‘కలైంగార్‌ మగలిర్‌ ఉరిమై’ పథకం కింద చెల్లిస్తోంది.

నిశ్శబ్ద మహిళా విప్లవం

నిజం చెప్పాలంటే 2019 ఎన్నికల్లో మొట్టమొదటిసారి మహిళల ఓటింగ్‌ పురుషులను దాటిపో యింది. పురుష ఓటర్లతో పోలిస్తే 0.16% పాయింట్లు మాత్రమే ఎక్కువైనప్పటికీ దీని ప్రభావం మాత్రం అపారం. అప్పటి ఎన్నికల్లో మొత్తం మహిళా ఓటర్లలో 67.18% మంది ఓటు హక్కు వినియోగించుకోగా పురుషులు 67.02శాతం ఓటింగ్‌లో పాల్గన్నారు. అంతేకాదు క్రమంగా ఓటర్లుగా నమోదవుతున్న మహిళల సంఖ్య పెరగడం వారిలో చైతన్య విస్తృతికి సంకేతం. ఉదాహరణకు 2019లో 438 మిలియన్ల మంది మహిళలు ఓటర్లుగా నమోదు కాగా 2024 నాటికి వీరి సంఖ్య 471 మిలియన్లకు పెరిగింది. వీరిలో 8.5మిలియన్ల మంది మొట్టమొదటిసారి ఓటర్లుగా రిజిస్లరయిన వారు. అంటే ఈ పెరుగుదల 7.5%. అదే పురుషుల్లో ఈ వృద్ధి కేవలం 5%కు మాత్రమే పరిమితం కావడం గమనార్హం. 2019లో ప్రతి వెయ్యిమంది పురుషులకు 926 మంది స్త్రీలు నమోదు కాగా 2024నాటికి వీరి నిష్పత్తి 948కి పెరిగింది. క్రమంగా ప్రజల్లో మహిళలపట్ల సరైన అవగాహన పెరగడం ఈ పెరుగుదలకు కారణం. అంతేకాదు 2019లో మహిళా ఓటర్ల ప్రభావం 8 రాష్ట్రాల్లో కనిపిస్తే, 2024కు ఇది 12 రాష్ట్రాలకు పెరగడం మహిళలో పెరుగుతున్న చైతన్యానికి నిదర్శనం. ఆవిధంగా దేశవ్యాప్తంగా మహిళా విప్లవం నిశ్శబ్దంగా విస్తరిస్తోంది. 2014 మరియు 2019 సంవత్సరాల్లో నరేంద్రమోదీ ప్రభుత్వం అధికారంలోకి రావడానికి ప్రధాన కారకులు మహిళా ఓటర్లే! ఒక సర్వే ప్రకారం 2019లో దేశవ్యాప్తంగా 46% మంది మహిళలు భాజపాకు ఓటు వేస్తే, 44% పురుషులు ఆ పార్టీకి అనుకూలంగా ఓటు వేశారు.

మహిళా సంక్షేమానికే పెద్దపీట

మహిళల ఓట్లు ఇంత ప్రభావశీలకంగా మారడమే జాతీయ, ప్రాంతీయ పార్టీలు మహిళా సంక్షేమానికి, పెద్దపీట వేయడానికి ప్రధాన కారణం. 2023 సెప్టెంబర్‌ నెలలో నరేంద్రమోదీ ప్రభు త్వం, లోక్‌సభ మరియు అసెంబ్లీ ఎన్నికల్లో 1/3వంతు సీట్లను మహిళలకు కేటాయిస్తూ 106వ రాజ్యాంగ సవరణ చట్టాన్ని అమల్లోకి తెచ్చిందంటే మహిళల ప్రభావాన్ని గుర్తించడం వల్ల మాత్రమే! ఇప్పటికే కేంద్ర ప్రభుత్వ పథకాల్లో మహిళలు గుర్తించదగిన వాటాను కలిగివున్నారు. ప్రధాన మంత్రి జీవన్‌ జ్యోతి బీమా యోజన (పీఎంజేజేబీవై) పథకంలో 27%, ప్రధానమంత్రి సురక్షా బీమా యోజన (పీఎంఎస్‌బీవై) పథకంలో 37%, అటల్‌ పెన్షన్‌ యోజన (ఏపీవై)లో 44%, ముద్రా రుణాల్లో 68%, స్టాండప్‌ ఇండియా పథకంలో 81శాతం మహిళలు ప్రయోజనం పొందుతున్నారు.
ఇక రాజకీయాల్లో మహిళల ప్రవేశం కూడా క్రమంగా పెరుగుతూ వస్తోంది. ఇది ఇంకా గణనీయమైన స్థాయిలో లేకపోయినా, అభివృద్ధి మాత్రం ఆశాజనకంగా సాగుతోంది. అందువల్ల రా నున్న కాలంలో ఏ పార్టీ కూడా మహిళలను తక్కువ అంచనా వేసే పరిస్థితి లేదు. ఒకవేళ పురు షాధిక్యత ప్రదర్శిస్తే, పార్టీలు తమ పతనాన్ని తాము కొని తెచ్చుకున్నట్టే!!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!