
తంగళ్ళపల్లి నేటి ధాత్రి
తంగళ్ళపల్లి మండలం మండపల్లి రాజా ప్రపూల్లారెడ్డి ఫంక్షన్ హాల్ లో ప్రభుత్వాధికారులచే అర్హులైన వారందరికీ కళ్యాణ లక్ష్మి షాది ముబారక్ చెక్కులు పంపిణీ చేయడం జరిగింది. ఈ సందర్భంగా ఏఎంసీ చైర్మన్ వెలుముల స్వరూప తిరుపతిరెడ్డి మాట్లాడుతూ తంగళ్ళపల్లి మండలంలో పలు గ్రామాలకు చెందిన అర్హులైన అందరికీ కల్యాణ లక్ష్మి షాది ముబారక్ చెక్కులు పంపిణీ చేయడం జరిగిందని ప్రభుత్వం చేపట్టిన ప్రత్యేకంగా కళ్యాణ్ లక్ష్మి షాది ముబారక్ నిరుపేదలకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని ప్రభుత్వం తన ఇంట్లో ఆడపిల్లకు పెళ్లి చేసే విధంగా చెక్కులు పంపిణీ చేయడం చాలా గర్వదగ్గ విషయమని అలాగే రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రజలప్రయోజనాల కోసం రాష్ట్ర ముఖ్యమంత్రి సీఎం రేవంత్ రెడ్డి అనేక సంక్షేమ పథకాలు తీసుకువస్తున్నారని మన రాష్ట్ర అభివృద్ధిలో ఎంతో కీలకంగా పోషిస్తున్నారని ఈ సందర్భంగా తెలియజేస్తూ చెక్కులు పొందిన లబ్ధిదారులు అధికారులకు నాయకులకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు ఇట్టి కార్యక్రమంలో ప్రభుత్వ అధికారులు తంగళ్ళపల్లి మండలఎమ్మార్వో జయంత్ కుమార్ .సెస్ చైర్మన్ చిక్కాల రామారావు మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు జలగం ప్రవీణ్.ఏఎంసి వైస్ చైర్మన్ నేరెళ్ల నర్సింగం గౌడ్ ఏఎంసి డైరెక్టర్లు ప్రజా ప్రతినిధులు ప్రభుత్వ అధికారులు తంగళ్ళపల్లి మాజీ ఉపసర్పంచ్ పెద్దూరి తిరుపతి నాయకులు లబ్ధిదారులు తదితరులు పాల్గొన్నారు