
తంగళ్ళపల్లి నేటి ధాత్రి…
తంగళ్ళపల్లి మండలం మోడల్ స్కూల్ ప్రిన్సిపల్ విట్టల్ ఆధ్వర్యంలో టీఎస్ యుటిఎఫ్ జిల్లా నాయకులతో కలిసి పోస్టర్ ఆవిష్కరించారు ఈ సందర్భంగా మాట్లాడుతూ వైద్య వైజ్ఞానిక మహాసభలు విజయవంతం చేయాలని కోరుతూ అనంతరం టీఎస్ యుటిఎఫ్ తంగళ్ళపల్లి మండల అధ్యక్షుడు ప్రధాన కార్యదర్శి మాట్లాడుతూ ప్రతి రెండు సంవత్సరాలకు ఒకసారి టీఎస్ యుటిఎఫ్ రాష్ట్ర మహాసభలను రాష్ట్రంలో వివిధ ప్రాంతాలలో జరుగుతున్నాయనిఈ సంవత్సరం నల్గొండ జిల్లా కేంద్రంలో 28 29 30 తేదీల్లో మూడు రోజులపాటు మహాసభలు నిర్వహించడం జరుగుతుందని మహాసభల్లో ప్రభుత్వ విద్యా రంగంపై మేధావుల ఆధ్వర్యంలో లోతైన చర్చ జరుగుతుందని రాబోయే కాలానికి విద్యారంగం ఉపాధ్యాయుల అభ్యున్నత కొరకు తగిన సూచనలు సలహాలు ఇవ్వడం జరుగుతుందని ఈ మహాసభలకు ముఖ్య అతిథులుగా తెలంగాణ రాష్ట్ర శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి రోడ్డు భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఉపాధ్యాయ ఎమ్మెల్సీ అలుగుబెల్లి నర్సిరెడ్డి రాష్ట్ర అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు జంగయ్య రవి హాజరవుతారని భారత ఆర్థిక వ్యవస్థలో మధ్యతరగతి ప్రజలకు ఏం జరుగుతుంది అనే అంశంపై ప్రొఫెసర్ నాగేశ్వరరావు ప్రసంగం ఉంటుందని విద్యా రాజ్యాంగ విలువ అనే అంశంపై ఆంధ్రజ్యోతి పూర్వ సంపాదకులు కే శ్రీనివాస్ ప్రసంగం ఉంటుందని జాతీయ విద్యా విధానం ప్రభుత్వ విద్య పై ప్రభావం అనే అంశంపై ఎస్ఎఫ్ఐ జాయింట్ సెక్రెటరీ కుమారి ఆయి సి గౌస్ ప్రసంగం ఉంటుందని సినీ గేయరచయిత సుద్దాల అశోక్ తేజ ఆధ్వర్యంలో సాంస్కృత ప్రదర్శనలు కార్యక్రమాలు ఉంటాయని జిల్లాలోని ఉపాధ్యాయులు పెద్ద ఎత్తున పాల్గొని మహాసభలను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు ఇట్టి కార్యక్రమంలో టిఎస్ ఎమ్మెస్ టిఎస్ జిల్లా అధ్యక్షులు బెజగం సురేష్ ప్రధాన కార్యదర్శి గొల్లపల్లి శ్రీనివాస్ టీఎస్ యుటిఎఫ్ తంగళ్ళపల్లి మండల అధ్యక్ష ప్రధాన కార్యదర్శి చింతకింది నాగరాజు కొప్పుల నాగరాజు ఉపాధ్యాయులు మురళి రమేష్ అరవింద్ స్వామి రజిత శ్రీనివాస్ శైలజ అని సాయి నవ్య మరియు తదితరులు పాల్గొన్నారు