మహబూబ్ నగర్ జిల్లా ::నేటి ధాత్రి
మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలో మంగళవారం ప్రజా సంఘాల ఐక్యవేదిక ఆధ్వర్యంలో పండుగ సాయన్న చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళి అర్పించడం జరిగింది. తెలంగాణ రాబిన్ ఫుడ్ బడుగు బలహీన వర్గాల ఆశ జ్యోతి పేదల పక్షపాతి భూస్వాముల పెత్తందారులు వర్గాల ద్వారా దోచి అంతా పేదవారికి పంచిపెట్టిన మహనీయుడు.విప్లవ యోధుడు పండుగ సాయన్న అని కొని ఆడారు..ఈ సందర్భంగా ప్రజా సంఘాల ఐక్యవేదిక కన్వీనర్ ఎంపీ ప్రవీణ్ కుమార్, ప్రగతిశీల ప్రజా ఫ్రంట్ నాయకులు రవి కిరణ్, ఎండీ. రియాజుద్దీన్ పాలమూరు పూలే అంబేద్కర్ జాతర అధ్యక్ష కార్యదర్శులు బోయపల్లి నరసింహ మామిడి సామ్యూల్, లేబర్ సంఘం అధ్యక్షులు గడ్డమీద గోపాలకృష్ణ ,బొర్రాసురేష్ కుమార్, బహుజన మహనీయుల శోభాయాత్ర అధ్యక్షుడు పాతూరు రమేష్, దినేష్ కుమార్, విజయ్ కుమార్, వెంకట్ రాములు, శ్రీకాంత్ ముదిరాజ్,సేవలాల్ సంఘ అధ్యక్షుడు ప్రేమ్ కుమార్ నాయక్, తదితరులు పాల్గొని ఘనంగా నివాళులర్పించడం జరిగింది..