
ఓదెల(పెద్దపల్లి జిల్లా)నేటిధాత్రి:
ఓదెల మండలం లో తెలంగాణ సచివాలయం ఎదుట రాజీవ్ గాంధీ విగ్రహాన్ని ఏర్పాటు చేయడానికి నిరసిస్తూ బిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆదేశాల మేరకు తెలంగాణ తల్లి చిత్ర పటానికి బిఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో పాలాభిషేకం నిర్వహించారు.ఈ సందర్భంగా మ్యాడగోని శ్రీకాంత్ గౌడ్,పోలోజు రమేష్ మాట్లాడుతూ
తెలంగాణ తల్లిని అవమానించేలా కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయాన్ని బీఆర్ఎస్ తో పాటు తెలంగాణ వాదులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారనీ పేర్కొన్నారు.తెలంగాణ సిద్ధాంత కర్త ప్రొఫెసర్ జయశంకర్ విగ్రహంతో పాటు తెలంగాణలో ఎంతోమంది మేధావుల విగ్రహాలు పెట్టకుండా రాజీవ్ గాంధీ విగ్రహం పెట్టడం ఏమిటని ప్రశ్నించారు.ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ పార్టీ గ్రామ అధ్యక్షుడు పోలోజు రమేష్, బిఆర్ఎస్ యూత్ మండల అధ్యక్షులు మ్యాడగోని శ్రీకాంత్ గౌడ్,బోడకుంట నరేష్,పల్కల నరసింహ రెడ్డి, చింతం మొగిలి,చింతం వెంకటస్వామి,బోయ సదానందం,భీరం రవి,డాక్టర్ బిక్షపతి,గడ్డం శ్యామ్ కుమార్,సూత్రాల శ్రవణ్,అమడగోని కుమార్, కొండ్ర రవి తదితరులు పాల్గొన్నారు.