మహబూబ్ నగర్ జిల్లా ::నేటి ధాత్రి
బీజేపీ పాలమూరు పార్లమెంట్ అభ్యర్థి డీ కే అరుణమ్మ గెలుపు కోసం బిజెపి ఇంటింట ప్రచార కార్యక్రమంలో 140,141,142 పోలింగ్ బూత్లలో నరసింహులు చిన్న అంజి శ్రీనివాస్ ఆధ్వర్యంలో ఇంటింటి ప్రచారం నిర్వహించడం జరిగింది. ముఖ్యఅతిథిగా ఎస్సీ మోర్చా జిల్లా అధ్యక్షులు డాక్టర్ కొంగళి శ్రీకాంత్ పాల్గొని, నరేంద్ర మోడీ దేశానికి చేసిన సేవలు వివరిస్తూ ఎంపీ అభ్యర్థి డీకే అరుణమ్మను గెలిపించాలని కోరారు.ఈ కార్యక్రమంలో బిజెపి నాయకులు రాము చిన్న అన్న ఎస్సీ మోర్చా టౌన్ ప్రధాన కార్యదర్శి శివకుమార్ యువ నాయకులు మొగలిహ్య రాము చిన్న దీపల్లి శ్రీనివాసులు రాజు సురేష్, ముఖ్య నాయకులు అండాలు శోభా పాల్గొన్నారు