చేర్యాల నేటిధాత్రి….
చేర్యాల మండల పరిధిలోని పోతిరెడ్డిపల్లి గ్రామంలో స్పెషల్ ఆఫీసర్ మోగిళ్ల నరసింహారెడ్డి ఇటీవల పదవీ విరమణ పొందగా పదవీకాలం పూర్తయినందువల్ల గ్రామపంచాయతీ ఆధ్వర్యంలో ఘనంగా వీడ్కోలు పలికారు. అనంతరం పుష్పగుచ్చం అందజేసి, పూలదండ వేసి ఘనంగా శాలువాతో సత్కరించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ఎంపీటీసీల ఫోరం మండల అధ్యక్షులు గూడూరు బాలరాజు హాజరై గత జ్ఞాపకాలను గుర్తుకు తెచ్చారు. ఆయన సేవలను కొనియాడారు. వారు ఆయుర్ ఆరోగ్యంతో జీవించాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమానికి పంచాయతీ కార్యదర్శి పల్లె రజిత, బోకోరి బాల్రెడ్డి, బట్టు మోహన్ రెడ్డి, గ్రామపంచాయతీ సిబ్బంది పాల్గొన్నారు.