గ్రామపంచాయతీ ఆధ్వర్యంలో ఘనంగా స్పెషలాఫీసర్ నరసింహారెడ్డి కి ఘనంగా వీడ్కోలు.

చేర్యాల నేటిధాత్రి….

చేర్యాల మండల పరిధిలోని పోతిరెడ్డిపల్లి గ్రామంలో స్పెషల్ ఆఫీసర్ మోగిళ్ల నరసింహారెడ్డి ఇటీవల పదవీ విరమణ పొందగా పదవీకాలం పూర్తయినందువల్ల గ్రామపంచాయతీ ఆధ్వర్యంలో ఘనంగా వీడ్కోలు పలికారు. అనంతరం పుష్పగుచ్చం అందజేసి, పూలదండ వేసి ఘనంగా శాలువాతో సత్కరించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ఎంపీటీసీల ఫోరం మండల అధ్యక్షులు గూడూరు బాలరాజు హాజరై గత జ్ఞాపకాలను గుర్తుకు తెచ్చారు. ఆయన సేవలను కొనియాడారు. వారు ఆయుర్ ఆరోగ్యంతో జీవించాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమానికి పంచాయతీ కార్యదర్శి పల్లె రజిత, బోకోరి బాల్రెడ్డి, బట్టు మోహన్ రెడ్డి, గ్రామపంచాయతీ సిబ్బంది పాల్గొన్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version