కూకట్పల్లి, నేటి దాత్రి ప్రతినిధి
శేరిలింగంపల్లి లో భారీ మెజారిటీతో గెలిచి గులాబీ జెండా ఎగరవేస్తాం: శేరిలింగంపల్లి నియోజక వర్గం పరిధిలోని తొమ్మిదిన్నర సంవత్సరాల లో ఇప్పటివరకు అనేక అభివృద్ధి పనులు చేసినప్పటికీ కొందరికి మాత్రమే డబుల్ బెడ్ రూమ్ లో ఇవ్వలేకపోయామని మళ్లీ మా పార్టీని గెలిపించి ఎమ్మెల్యే గాంధీ గారిని మంచి మెజారిటీతో ప్రతి ఒక్క నాయకుడు గెలిపించుకుం టామని సీనియర్ నాయకులు మాజీ వార్డ్ సభ్యులు చాంద్ పాషా పేర్కొన్నారు. ఇంకా ప్రధానమైన సమస్యలలో శేరిలింగంపల్లి రైల్వే బ్రిడ్జి వద్ద నిల్వ ఉంటున్న వర్షపు నీటిని మళ్లీంచేందుకు నిధులు మంజూరు అయ్యాయని వాటిని గెలిచిన తర్వాత తప్పకుండా ఆ సమస్యను పూర్తి చేసేందుకు హామీ తీసుకుంటామని చాంద్ పాషా భయ్యా మీడియా ప్రతినిధులతో ఆయన మనసులోని మాటను తెలియజేశారు. స్థానిక ప్రజలకు ఇంకా ఎంతో మందికి వారి డివిజన్లలో మిగిలిపోయిన పనులు తొమ్మిదిన్నర సంవత్సరాలు పూర్తి కాకపోయినాప్పటికీ, మళ్లీ తమకు ఈసారి గెలిపించినట్లు ఉంటే తప్పనిసరిగా పెండింగ్లో ఉన్న పనులు పూర్తి చేసేందుకు శేర్లింగంపల్లి స్థానిక శాసనసభ్యులు గాంధీ అన్నను వెంట తీసుకొని ఆ సమస్యను పూర్తయ్యే వరకు విశ్రాంతి తీసుకోమని ఈ సందర్భంగా శ్రీరామ్ నగర్ వార్డ్ సభ్యులు టిఆర్ఎస్ సీనియర్ నాయకులు శనివారం ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో ఆయన వివరాలను వెల్లడించారు. రానున్న నవంబర్ 30 వ తేదీ సార్వ త్రిక ఎన్నికలలో నియోజకవ ర్గంలో ని స్థానిక ఓటర్లందరూ ఈసారి మంచి మెజార్టీతో గెలిపించి నట్లయితే మేము కూడా మీకు భవిష్యత్తులో మంచి ఎదగడానికి ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం.
ఫోటో నెంబర్ 2 లో….