కోట్లాది రూపాయలతో అభివృద్ధి పనులు. . కారు గుర్తుకే ఓటేద్దాం అభివృద్ధి సంక్షేమ పాలన కొనసాగిద్దాం
శాయంపేట నేటి ధాత్రి: హనుమకొండ జిల్లా శాయంపేట మండలం ప్రగతి పరుగులు పెడుతుంది. తెలంగాణ సమగ్ర అభివృద్ధికి కేసీఆర్ భరోసా అయితే విభిన్న వర్గాల సంక్షేమానికి కేసీఆర్ భరోసా అని బిఆర్ఎస్ పార్టీ భూపాలపల్లి నియోజకవర్గ గండ్ర వెంకటరమణారెడ్డి రాష్ట్ర ప్రభుత్వం మంజూరు చేసిన కోట్లాది రూపాయల నిధులతో అభివృద్ధిలో దూసుకపోతుంది. శాయంపేట ఆత్మకూరు రోడ్డును వేసి మండలంలో గ్రామీణ రహదారుల మరమ్మత్తుల పథకం కింద మాందారి పేట నుండి హుస్సేన్ పల్లె వయా శాయంపేట మీదుగా రోడ్డు పనులు చేపట్టడం జరిగింది.ప్రగతి సింగారం వరకు తారు రోడ్డు వేశారు అంతేకాకుండా సెంటర్ లైటింగ్ సుందరీకరణ మండల కేంద్రంలో ప్రజలకు మెరుగైన అందానికి మౌలిక వసతులు పనులు పూర్తి చెయ్యడం వల్ల ఆనంద ఉత్సవాల మధ్య సంతోషంగా గ్రామ ప్రజలు జీవిస్తున్నారు. ముఖ్యమంత్రి కెసిఆర్ అన్ని వర్గాల ప్రజలకు అమలుకు ఆమోదయోగ్యమైన ఉండాలని మేనిఫెస్టో తెచ్చారని తెలిపారు. మండల కేంద్రంలో గతంలో కంటే నేడు గణనీయమైన అభివృద్ధి జరిగిందని ఈ అభివృద్ధిని చూసి భారీ మెజారిటీతో గెలిపిస్తే అభివృద్ధి జరుగుతుందని తెలంగాణ ప్రభుత్వం అమలు చేసిన పథకాలను ప్రజలకు వివరిస్తూ ఇంటింటికి తిరుగుతూ బీ ఆర్ఎస్ ప్రభుత్వానికి సార్వత్రిక ఎన్నికల్లో అధికార పార్టీకి గెలుపు కోసం మరోసారి అవకాశం కల్పించి మీకు సేవ చేసే భాగ్యం కల్పించాలి.