
నడికూడ,నేటిధాత్రి:
మండల కేంద్రంలో గణపతి నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా హనుమాన్ యూత్ ఆధ్వర్యంలోని మండపంలో కొలువుదీరిన గణపతి దేవుడికి సర్పంచ్ ఊర రవీందర్ రావు ప్రత్యేక పూజలు నిర్వహించడం జరిగింది. అనంతరం సర్పంచ్ మాట్లాడుతూ,బిఅర్ఎస్ మళ్లీ అధికారంలోకి రావాలని, తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని,తెలంగాణ రాష్ట్రంలో మళ్ళీ మన ప్రియతమ నేత కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు మళ్ళీ ముఖ్యమంత్రి కావాలని,మన పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి ముచ్చటగా మూడోసారి ఎమ్మెల్యే గా గెలిసి మంత్రి పదవి పొందాలని, నడికూడ ప్రజలందరూ ఎలాంటి కష్టాలను ఎదురుకోకుండా ఉండాలని ఆ చల్లని దేవుడు గణపతిని కోరుకోవడం జరిగిందని అన్నారు.ఈ కార్యక్రమంలో రైతు సమన్వయ కమిటీ మెంబెర్ కొక్కిరాల శ్రీధర్ రావు,ఊర తిరుపతి రావు,నాయినేని సంపత్ రావు,కొక్కిరాల ప్రకాష్ రావు,ఊర సుమన్ రావు,తదితరులు పాల్గొన్నారు.