Nutrition Awareness At Women’s Week Celebrations
మహిళా వారోత్సవాలు.
కల్వకుర్తి/ నేటి ధాత్రి:
కల్వకుర్తి పట్టణంలో అంగన్వాడి సెంటర్ లో సోమవారం అందుబాటులో ఉన్న తక్కువ ఖర్చుతో కూడిన పోషక విలువలు ఉన్న ఆహార పదార్థాలు చిరుధాన్యాలు రాగులు,సజ్జలు, సామలు, జొన్నలు రోజు వారి ఆహారంలో తీసుకోవాలి మనకు తక్కువ ఖర్చుతో దొరికే మునగాకు, చింతచిగురు, పాలకూర, తోటకూర లాంటి పోషక ఆకుకూరలను పిల్లలకు పెట్టాలి. అలా అనుగుణంగా వచ్చే పండ్లను పిల్లలకు ఆహారంగా ఇవ్వాలి. మైదా నూనె నూడిల్స్ చక్కెర ఎక్కువ తీసుకోకూడదు. వీటివల్ల పిల్లలు అనారోగ్యానికి గురి కావడం జరుగుతుంది. జింగు ఫుడ్ కు దూరంగా ఉంచాలని అంగన్వాడి శిశు సంక్షేమ శాఖ వారి ఆధ్వర్యంలో అవగాహన సదస్సును నిర్వహించారు. పట్టణంలోని పిల్లల తల్లిదండ్రులను సదస్సును ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్ లలిత శ్రీకాంత్ రెడ్డి, ఎల్లమ్మ, పద్మ, భాగ్య, సుజాత అంగన్వాడీ టీచర్లు పాల్గొన్నారు.
