Man Dies Due To Heatstroke
వడదెబ్బతో వ్యక్తి మృతి
మొగుళ్లపల్లి, నేటి ధాత్రి
జయశంకర్ భూపాలపల్లి జిల్లా మొగుళ్లపల్లి మండలం లోని పాత ఇస్సిపేట గ్రామానికి చెందిన భోగి సాంబయ్య మే 21 గురువారం రోజున వడదెబ్బతో మృతి చెందాడు. కుటుంబ సభ్యులు తెలిపిన వివరాలు ప్రకారం భోగి సాంబయ్య ఉదయం రోజువారి కూలిగా పంట చేనులోకి వెళ్లి తిరిగి 11:30 సమయంలో ఇంటికి వచ్చాడు అప్పటికే అస్వస్థతకు గురైన సాంబయ్య చేతులు కాళ్లు వణుకుతూ ఇంటికి వచ్చి పడుకోగా వడగాల్పులకు గురైన అతను ఇంట్లో ఉన్న రేకుల షెడ్డు వేడి గాలికి మృతి చెందాడు. 12 సంవత్సరాల క్రితం మృతుడి భార్య చనిపోగా ఇప్పుడు సాంబయ్య మృతి కి ఇంటికి పెద్దదిక్కు లేకుండా పోయింది.మృతుడి కి కుమారుడు, కుమార్తె ఉన్నారు. రెక్కాడితే గాని డొక్కరిని కుటుంబం మాది అంటూ కుటుంబ సభ్యులు అన్నారు. మా కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని వేడుకుంటున్నారు.
