Madhusudhanachari Alerts Officials Over Fire Accidents
జిల్లా ఉన్నతాధికారులను అప్రమత్తం ఉండాలి
శాసన మండలి ప్రతిపక్షనేత సిరికొండ మధుసూదనాచారి
భూపాలపల్లి నేటిధాత్రి
జయశంకర్ భూపాలపల్లి జిల్లా టేకుమట్ల మండలంలోని ఎంపేడు, కుందన్పల్లి, బండపల్లి తదితర గ్రామాల్లో పంట పొలాల్లో అగ్నిప్రమాదం సంభవించి, మంటలు దావానంలా చుట్టుపక్కల ప్రాంతాలకు వ్యాపిస్తున్న విషయం తెలిసిన వెంటనే శాసన మండలి ప్రతిపక్షనేత సిరికొండ మధుసూదనాచారి జిల్లా ఉన్నతాధికారులను అప్రమత్తం చేశారు.
ఈ ఘటనపై వెంటనే జిల్లా కలెక్టర్ ఎస్పీ సింగరేణి జీఎం కి, జిల్లా ఫైర్ అధికారులకు ఫోన్ చేసి, అన్ని శాఖలు సమన్వయంతో పనిచేసి తక్షణమే ఫైర్ ఇంజన్లను ఘటన స్థలానికి పంపించాలని సూచించారు. అవసరమైతే సింగరేణి సహాయాన్ని కూడా వినియోగించాలని సూచించారు.
వేసవి తీవ్రత కారణంగా అగ్ని మరింత విస్తరించి సమీప గ్రామాలకు నష్టం కలిగించే అవకాశం ఉన్నందున అధికారులు అత్యవసర చర్యలు చేపట్టాలని సూచించారు.a
