Bhagya Reddy Varma Jayanti Celebrated
దళిత ఉద్యమ సంస్కర్త భాగ్యరెడ్డి వర్మ జయంతి
భూపాలపల్లి నేటిధాత్రి
జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రంలోని ఐడీఓసీ సమావేశ మందిరంలో ఎస్సీ కులాల అభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో దళిత ఉద్యమ సంస్కర్త భాగ్యరెడ్డి వర్మ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమానికి భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు ముఖ్య అతిథిగా హాజరై భాగ్యరెడ్డి వర్మ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ భాగ్యరెడ్డి వర్మ సమాజంలో అణగారిన వర్గాల అభ్యున్నతికి విశేష కృషి చేశారని, దళితుల హక్కుల కోసం నిరంతరం పోరాడిన మహనీయుడని కొనియాడారు. విద్య, సమానత్వం, సామాజిక న్యాయం కోసం ఆయన చేసిన సేవలు నేటి తరానికి స్ఫూర్తిదాయకమని పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం దళితుల సంక్షేమం, అభివృద్ధికి అనేక సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తోందని తెలిపారు.
ఈ కార్యక్రమంలో జిల్లా అడిషనల్ కలెక్టర్ అశోక్ కుమార్ ఎస్సీ కులాల అభివృద్ధి సంస్థ జిల్లా అధికారి ఇందిరా మున్సిపల్ వైస్ చైర్మన్ అంబాల శ్రీనివాస్ ఆర్టిఏ మెంబర్ సుంకరి రామచంద్రయ్యా ఉద్యోగులు,ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.
