సేవాలాల్ మహారాజ్ పండుగ ప్రారంభోత్సవం
భక్తి శ్రద్ధలతో పాల్గొన్న టి సి సభ్యులు సొంటి రెడ్డి రంజిత్ రెడ్డి, సర్పంచ్
#నెక్కొండ, నేటి ధాత్రి:
మండలంలోని ఉమ్మడి గొట్లకొండ గ్రామంలో సంత్ సేవాలాల్ మహారాజ్ పండుగ ప్రారంభోత్సవం, దేవాలయ ప్రారంభ కార్యక్రమం భక్తి భావంతో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో టిపిసిసి సభ్యులు సొంటి రెడ్డి రంజిత్ రెడ్డి కొబ్బరికాయ కొట్టి కార్యక్రమాన్ని ప్రారంభించారు, గ్రామ సర్పంచ్ భుక్యా జనార్ధన్ నాయక్ పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు.ఈ సందర్భంగా రంజిత్ రెడ్డి మాట్లాడుతూ, “ సంత్ సేవాలాల్ మహారాజ్ ఆశీస్సులతో గ్రామ ప్రజలు సుఖశాంతులతో ఉండాలని, గ్రామం అన్ని రంగాల్లో మరింత అభివృద్ధి చెందాలని కోరుకుంటున్నాను” అని తెలిపారు. గ్రామ ప్రజలందరికీ పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు.
ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు, యువకులు, మహిళలు, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని భక్తి శ్రద్ధలతో సేవాలాల్ మహారాజ్‌ను ప్రార్థించారు.
