Annual Credit Plan Meeting Held
లీడ్ బ్యాంకు అధికారులతో సమావేశం
జిల్లాలో 2026-27 ఆర్థిక వార్షిక క్రెడిట్ ప్రణాళిక
3210.51 కోట్లుగా నిర్దేశించినట్లు అధికారులు తెలిపారు
జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ
మంగళవారం ఐడిఓసి కార్యాలయంలో జిల్లా లీడ్ బ్యాంక్ ఆధ్వర్యంలో డిసిసి, డీఎల్ఆర్సీ 2026-27వార్షిక రుణ ప్రణాళిక కార్యక్రమాలపై బ్యాంక్ కంట్రోలర్లు, డిఆర్డీఓ, ఎస్సి, ఎస్టీ, బిసి, మెప్మా తదితర శాఖల అధికారులతో సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ వ్యవసాయం అనుబంధ రంగాల అభివృద్ధికి బ్యాంకుల ద్వారా విస్తృత స్థాయిలో రుణాలు అందించేందుకు ప్రణాళిక సిద్ధం చేసినట్లు తెలిపారు. ఫార్మ్ క్రెడిట్ కింద పంట ఉత్పత్తి, నిర్వహణ, మార్కెటింగ్ కోసం రూ. 1273.51 కోట్లు, వ్యవసాయ అనుబంధ కార్యకలాపాలకు టర్మ్ లోన్ల రూపంలో రూ. 762.61 కోట్లు కేటాయించగా, మొత్తం వ్యవసాయ రుణ సామర్థ్యం రూ. 2341.31 కోట్లుగా నిర్ణయించబడినట్లు పేర్కొన్నారు.
అదేవిధంగా, సూక్ష్మ, చిన్న మరియు మధ్య తరహా పరిశ్రమలకు రూ. 112.89 కోట్లు, విద్యకు రూ. 19.77 కోట్లు, గృహ నిర్మాణానికి రూ. 82.00 కోట్లు, పునరుత్పాదక శక్తి రంగానికి రూ. 1.44 కోట్లు, ఇతర రంగాలకు రూ. 19.80 కోట్లు, సామాజిక మౌలిక వసతులకు రూ. 22.28 కోట్లు కేటాయించినట్లు తెలిపారు.
మొత్తం ప్రాధాన్య రంగాలకు రూ. 2599.49 కోట్లు, ప్రాధాన్యేతర రంగాలకు రూ. 611.02 కోట్లు కేటాయించబడగా, మొత్తం వార్షిక క్రెడిట్ ప్రణాళిక పరిమాణం రూ. 3210.51 కోట్లుగా నిర్ణయించబడినట్లు కలెక్టర్ వివరించారు.
జిల్లా అభివృద్ధికి బ్యాంకులు, అధికారులు సమన్వయంతో పని చేసి ఈ లక్ష్యాలను సాధించాలని కలెక్టర్ పిలుపునిచ్చారు.
ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు మాట్లాడుతూ ప్రభుత్వం అందిస్తున్న రైతు భరోసా, రైతు భీమా, ఉపాధి హామీ పథకం తదితర నిధులు నిలుపుదల చేస్తున్నారని ప్రభుత్వం ఇచ్చే చేయొద్దని సూచించారు. స్వయం ఉపాధికి అందించే యూనిట్లులో పాడి పరిశ్రమకు సంబంధించి స్థానికంగా కినుగోలు చేసేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. ఇతర ప్రాంతాల నుండి తీస్తున్న యూనిట్లు ఇక్కడి వాతావరణాన్ని తట్టుకోలేక తక్కువ పాలు ఇస్తున్నాయని, కొన్ని చనిపోతున్నాయని మార్చేలా చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు. పంట రుణాలు బాకి ఉన్న రైతుల జాభితా ఇస్తే అవగహన కల్పించి రికవరీ అయ్యేలా చర్యలు తీసుకుంటామని సూచించారు. విద్యా, వైద్య రంగాలకు ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తుందని బ్యాంకర్లు, విద్యా, వైద్య రంగాలకు సహకరించాలని తెలిపారు. అజాం నగర్, చల్లగరిగే, కొడవటంచ, గన్ పూర్ లలో బ్యాంక్ బ్రాంచ్ లు ఏర్పాటు చేయాలని సూచించారు.
అనంతరం 2026-27 వార్షిక రుణ ప్రణాళిక పుస్తకాన్ని ఆవిష్కరించారు.
ఈ సమావేశంలో
లీడ్ డిస్ట్రిక్ట్ మేనేజర్ తిరుపతి, ఆర్బిఐ ఎల్డిఓ యశ్వంత్ సాయి, నాబార్డ్ డీడీఎం టిసి రవి మున్సిపల్ చైర్ పర్సన్ బుర్ర కొమురయ్య, వైస్ చైర్మన్ అంబాల శ్రీనివాస్, డిఆర్డిఓ బాల కృష్ణ, బీసీ సంక్షేమ అధికారి ఇందిర, డి టి డబ్ల్యూ ఓ నాగ సాగర్, మెప్మా పిడి రాజేశ్వరి, అన్ని బ్యాంకుల కంట్రోలర్లు తదితరులు పాల్గొన్నారు.
