Speed Up Grain Procurement
కొనుగోలు కేంద్రాల్లో ప్రక్రియ వేగవంతం చేయాలి
*టీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు డాక్టర్ బోడ అనిల్ కుమార్ నాయక్ *
నర్సంపేట, నేటిధాత్రి:
తెలంగాణ ప్రభుత్వం మొక్కజొన్న, ధాన్యం కొనుగోలు ప్రక్రియను తక్షణమే వేగవంతం చేయాలని తెలంగాణ రక్షణ సేన పార్టీ రాష్ట్ర నాయకుడు మహబూబాబాద్ పార్లమెంట్ స్వతంత్ర కాంటెస్టెడ్ అభ్యర్థి డాక్టర్ బోడ అనిల్ కుమార్ నాయక్ డిమాండ్ చేశారు. నర్సంపేట వ్యవసాయ మార్కెట్లోని కొనుగోలు కేంద్రాన్ని ఆయన సందర్శించారు. కొనుగోళ్లు మందకోడిగా సాగడం వల్ల రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో వెంటనే కొనుగోలు ప్రక్రియను వేగవంతం చేసి రైతులకు మేలు చేయాలని అధికారులను రైతులతో కలిసి నిలదీశారు.ఈ కార్యక్రమంలో రైతులు చందు ఓంకార్, నరసయ్య, వెంకన్న మొగిలి, సుందర్, టీఆర్ఎస్ నాయకులు వంశీ ఆనంద్, వెంకటేష్, సురేష్, తన్వేష్, రాజేష్, వినోద్ తదితరులు పాల్గొన్నారు.
