Farmer Awareness Seminar Held in Gudibanda
గుడిబండ రైతు వేదికలో రైతు వారోత్సవాల-అవగాహన సదస్సు.
కోదాడ, నేటి ధాత్రి :
ప్రజా పాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా సోమవారం కోదాడ మండల పరిధిలోని గుడిబండ గ్రామ రైతు వేదిక నందు రైతు వారోత్సవాలను గ్రామ సర్పంచ్ మందుల నాగయ్య అధ్యక్షతన నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ.ప్రభుత్వం రైతులకుకల్పిస్తున్నటువంటి భూసార పరీక్షలు పామాయిల్ తోటల పెంపకం ప్రభుత్వ సబ్సిడీలు గురించి తెలియజేయడం జరిగింది. కాబట్టి ప్రతి ఒక్క రైతు వ్యవసాయ అధికారుల సలహా సూచనలతో ఏ మందు పిచికారి చేయాలి. ఏ పంట ఏస్తే దిగుబడి వస్తుందో తెలుసుకుని ప్రతి ఒక్క రైతులు సలహా సూచనలు పాటించాలన్నారు.ఈ కార్యక్రమంలో ఏఈఓ సల్మా, ఉప సర్పంచ్ జయసింహారెడ్డి, ఎర్రవరం గ్రామ సర్పంచ్ రావుల భవాని వెంకటేశ్వర్లు, మరియు వార్డ్ మెంబర్ వంశీ గ్రామ శాఖ అధ్యక్షుడు రఫీ, రైతులు, గ్రామ పెద్దలు తదితరులు పాల్గొన్నారు.
