Balakrishna’s Hidden Mastermind Revealed
బాలయ్య వెనుక మాస్టర్ ప్లాన్?
స్క్రీన్ ప్లే మార్చింది ఆమెనే!!
సినీ ఇండస్ట్రీలో బాలయ్య అంటే ఒక అన్ స్టాపబుల్ ఫోర్స్. నచ్చితే క్షణాల్లో ఓకే.. లేదంటే మొహం మీదే నో. లెక్కలు చూడరు, రికార్డులు పట్టించుకోరు.. కేవలం మనసు చెప్పిందే వింటారు. కానీ ఇప్పుడు ఆ పంథా పూర్తిగా మారింది. అగ్రెసివ్ బాలయ్య వెనుక ఒక సైలెంట్ మాస్టర్ మైండ్ పనిచేస్తోంది.
బాలకృష్ణ సినిమాల ఎంపికలో ఇప్పుడు ఆయన కుమార్తె తేజస్విని చక్రం తిప్పుతున్నారు. కేవలం కుమార్తెగానే కాకుండా, ఒక పక్కా ప్రొఫెషనల్ మేనేజర్‌గా మారి ప్రాజెక్టులను ఫిల్టర్ చేస్తున్నారు. బాలయ్య వరకు కథ వెళ్లాలన్నా, డేట్స్ లాక్ అవ్వాలన్నా ముందు తేజస్విని ‘డిజిటల్ అప్రూవల్’ ఉండాల్సిందే. అంటే బాలయ్య కాంపౌండ్ లో ఓ ప్రోటో కాల్ ఉందన్న మాట. బాలయ్యకు ఇప్పుడు ఏ కథ నప్పుతుందో, ఏ కాంబోకైతే క్రేజ్ ఉంటుందో.. నిర్ణయాలు తీసుకొని, అలాంటి కథతో, అలాంటి కాంబోతో కూడా సినిమాలు సెట్ చేస్తున్నారామె.
కొరటాల శివ కాంబో బాలయ్యతో సెట్ చేయడం వెనుక కూడా తేజస్విని పాత్ర ఉన్నట్టు ఇన్ సైడ్ వర్గాలు చెబుతున్నాయి. బాలయ్యకు ఈమధ్య చాలామంది దర్శకులు కథలు వినిపించారు. వాటిలో బాలయ్యకు తగిన కథ సెట్ చేసి, కాంబో కుదిర్చింది కూడా తేజస్వినినే. బాలయ్య కు విజయ్ కనకమేడల తో సినిమా చేయాలని ఉంది. అయితే మార్కెట్ పరంగా కొరటాల శివతో జట్టు కడితేనే బాగుంటుందని, కొరటాలని లైన్ లోకి తీసుకొచ్చి, ప్రాజెక్ట్ సెట్ చేశారని టాక్. గోపీచంద్ మలినేని, కొరటాల ఈ రెండు సినిమాల్నీ సమాంతరంగా చేయడంలో వెనుక కూడా తేజస్విని ప్లానింగ్ ఉందని తెలుస్తోంది.
