Eesha Manvitha Wins Essay Prize
వ్యాసరచన పోటీలో ఈషా మన్వితకు ప్రథమ బహుమతి
పరకాల,నేటిధాత్రి
పరకాల పట్టణంలోని పశువుల సంత మైదానంలో హిందూ ధర్మ సమ్మేళనం వైభవంగా నిర్వహించారు.ఈ కార్యక్రమానికి సద్గురు మహనంద స్వామిజీ ముఖ్య అతిథిగా దక్షిణ మధ్య క్షేత్ర సంఘటన మంత్రి విద్యాభారతి,నీలం నిర్మల విశ్వ హిందూ పరిషత్ మాతృశక్తి జిల్లా సహ సంయోగికలు,ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి హాజరై ప్రసంగించారు.సమ్మేళనం సందర్భంగా వక్తలు సనాతన ధర్మం,హిందూ సంస్కృతి ప్రాముఖ్యతను వివరించారు. విద్యార్థుల్లో భారతీయ జీవన విధానంపై అవగాహన పెంపొందించేందుకు హిందూ సంస్కృతి భారతీయ జీవన విధానం అంశంపై వ్యాసరచన పోటీలు నిర్వహించారు.ఈ పోటీల్లో ఎస్ఆర్ పాఠశాలకు చెందిన 9వ తరగతి విద్యార్థిని శ్రీరామోజు ఈషా మన్విత ప్రతిభ కనబరిచి ప్రథమ బహుమతిని సాధించింది. ముఖ్య అతిథులు ఆమెకు శీల్డ్అందజేశారు.నిర్వాహకులు ఆమెను అభినందిస్తూ భవిష్యత్తులో మరింత ఉన్నత శిఖరాలు అధిరోహించాలని ఆకాంక్షించారు.ఈ కార్యక్రమంలో స్థానిక ప్రముఖులు,విద్యార్థులు, భక్తులు పాల్గొని సమ్మేళనాన్ని విజయవంతం చేశారు.
