Petro Car & Blue Colt Key Role in Crime Control
నేరాల నియంత్రణలో పెట్రోకార్,బ్లూ కోల్ట్ వాహనాల పాత్ర కీలకం
నూతనంగా నిర్మించిన షెడ్ ప్రారంభించిన జిల్లా ఎస్పీ మహేష్ బి గితే
సిరిసిల్ల(నేటి ధాత్రి):
మంగళవారం రోజున జిల్లా పోలీస్ కార్యాలయ ఆవరణలో పోలీస్ వాహనాల పార్కింగ్ మరియు సంరక్షణ కోసం నూతనంగా నిర్మించిన షెడ్‌ను జిల్లా ఎస్పీ అధికారులతో కలిసి ప్రారంభించరు.
అనంతరం జిల్లాలోని పోలీస్ స్టేషన్ల కు కేటాయించిన పెట్రోకార్ వాహనాలను తనిఖీ చేసి వాహనాల నిర్వహణపై ఆరా తీసారు.
ఈ సందర్బంగా ఎస్పి మాట్లాడుతు ….జిల్లాలో ఏ ప్రాంతంలోనైనా నేర సమాచారం అందిన వెంటనే పోలీస్ బృందాలు బ్లూ కోల్ట్ మరియు పెట్రోకారు ద్వారా చేరుకొని క్షేత్ర స్థాయిలో అవాంఛనీయ సంఘటనలు జరగకుండా,ప్రజలకు రక్షణ కల్పిస్తున్నాయన్నారు. ప్రజలకు తలెత్తుతున్న సమస్యలకు తక్షణమే స్పందించి సత్వర సేవలు అందించేందుకు రాష్ట్ర పోలీస్ శాక నుండి కేటాయించబడిన పెట్రోకార్ ,బ్లూ కోల్ట్ వాహనాల నిర్వహణపై అధికారులు ప్రత్యెక జాగ్రతలు తీసుకోవాలన్నారు.వాహనల డ్రైవర్లు వాహనాలను ఎప్పటికప్పుడు కండిషన్ లో ఉండేలా చూసుకోవాలని అప్పుడే ఘటన స్థలానికి సకాలంలో చేరే అవకాశం ఉంటుందన్నారు.
అనంతరం అధికరులతో ఎస్పీ కలసి వాహనాల షెడ్ ఆవరణలో మొక్కలు నాటారు.
కార్యక్రమంలో అదనపు ఎస్పీ చంద్రయ్య, డిఎస్పీ లు నాగేంద్రచారి, శ్రీనివాసులు,సి.ఐ లు ఆర్.ఐ లు వాహనాల డ్రైవర్లు, సిబ్బంది పాల్గొన్నారు.
