Kodandaram MLC Appointment Welcomed
కోదండరాం ఎమ్మెల్సీ నియామకం పట్ల ఉద్యమ నేత మoడ్ల దేవన్నా హర్షం
వనపర్తి నేటిదాత్రి .
తెలంగాణ ఉద్యమకారుడు రాష్ట్రం కోసం పోరాడి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన టీ జే ఎస్ రాష్ట్ర అధ్యక్షులు ప్రొఫెసర్ కోదండరాం ను ఏమ్మెల్సీగా
నియమించినందుకు శాలువా పూల బొకేతో తెలంగాణ ఉద్యమకారుల ఫోరం వనపర్తి జిల్లా ప్రధాన కార్యదర్శికాంగ్రెస్ పార్టీ నాయకులు 1 వ వార్డు మండ్ల దేవన్న నాయుడు సన్మానిం చేసి కృతజ్ఞతలు తెలిపారు ఈసందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వనపర్తి ఎమ్మెల్యే మేఘ రెడ్డి తెలంగాణ రాష్ట్ర గవర్నర్ కు శుభాకాంక్షలు తెలిపారు ఎమ్మెల్సీల నియామకం పెండింగ్లో ఉండడంతో రాష్ట్ర గవర్నర్ శివ ప్రతాప్ చావ్లా ఎమ్మెల్యే ల నియామకంపై ఆమోదం తెలిపారని దేవన్న నాయుడు తెలిపారు
బీ ఆర్ ఎస్ ప్రభుత్వం లో 10 సంవత్సరాలు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఉద్యమకారులను గుర్తించకుండా గౌరవించకుండా అణచివేత ధోరణి అవలంబించడం జరిగినదని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత తెలంగాణ ఉద్యమకారులను గుర్తిస్తూ సముచిత స్థానం కల్పిస్తున్నందుకు హర్షం వ్యక్తం చేశారు రాష్ట్ర మంత్రులకు ఎమ్మెల్యే లకు దేవన్నా ఒక ప్రకటన లో కృతజ్ఞతలు తెలిపారు
