Kids Clean Road, Win Hearts
ముగ్గురు చిన్నారుల పెద్ద మనసు ఆటలో భాగంగానే రోడ్డు శుభ్రత!
నస్పూర్,నేటి ధాత్రి:
మంచిర్యాల జిల్లా నస్పూర్ మండలం 34వ డివిజన్లో ముగ్గురు చిన్నారి స్నేహితులు కాంక్షిత,కృతినిధి,అక్షర తమ సామాజిక బాధ్యతను చాటుకొని అందరి ప్రశంసలు అందుకున్నారు.స్థానిక పోశమ్మ ఆలయ నిర్మాణం కోసం రోడ్డు పక్కన పోసిన కంకర రాళ్లు వాహనాల రాకపోకల వల్ల రోడ్డుపైకి చేరి ప్రమాదకరంగా మారడాన్ని గమనించిన ఈ చిన్నారులు,తమ ఆటలో భాగంగానే రోడ్డును శుభ్రం చేయాలని నిర్ణయించుకున్నారు.సుమారు అరగంట పాటు శ్రమించి రోడ్డుపై ఉన్న కంకరను చేతులతో తొలగించి శుభ్రం చేశారు.చిన్న వయసులోనే ప్రమాదాలను నివారించాలనే గొప్ప ఆలోచనతో రోడ్డును శుభ్రం చేసిన ఈ చిన్నారుల సేవా దృక్పథాన్ని చూసి కాలనీవాసులు ఆశ్చర్యపోతూ అభినందనలు తెలిపారు.
