Road Block Over Devotee Insult
ఘనంగా బీజేపీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు*
నర్సంపేట,నేటిధాత్రి:
నర్సంపేట పట్టణంలోని 152వ బూత్‌లో భారతీయ జనతా పార్టీ 47వ ఆవిర్భావ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా బూత్ అధ్యక్షులు రమేష్ పాండ్య, మడ్లపెల్లి క్రాంతి ఆధ్వర్యంలో పార్టీ జెండాను ఆవిష్కరించి స్వీట్లు పంపిణీ చేశారు.ఈ కార్యక్రమానికి నర్సంపేట నియోజకవర్గ కాంటెస్టెడ్ ఎమ్మెల్యే అభ్యర్థి డాక్టర్ కంబంపాటి పుల్లారావు, జిల్లా ప్రచార కార్యదర్శి బాల్నే జగన్ హాజరై జెండా ఆవిష్కరణ చేశారు. ఈ సందర్భంగా డాక్టర్ పుల్లారావు మాట్లాడుతూ శ్యామాప్రసాద్ ముఖర్జీ వేసిన పునాదులపై నిర్మితమైన భారతీయ జనతా పార్టీ, దీన్ దయాళ్ ఉపాధ్యాయ ప్రవచించిన ఏకాత్మ మానవతావాదానికి కట్టుబడి పనిచేస్తోందన్నారు.పంక్తిలో చివరి వ్యక్తికి తొలి ప్రయోజనం చేకూరాలన్న అంత్యోదయ సిద్ధాంతాన్ని ఆచరిస్తూ, అటల్ బీహారి వాజపేయి, ఎల్.కే.అద్వానీ వంటి అగ్రనేతల మార్గదర్శకత్వంలో పార్టీ బలోపేతం అయిందన్నారు. ప్రస్తుతం అమిత్ షా, జేపీ నడ్డా నాయకత్వంలో ప్రపంచంలోనే అతిపెద్ద రాజకీయ పార్టీగా అవతరించిందని, ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలో భారతదేశాన్ని విశ్వగురువుగా నిలిపే దిశగా పార్టీ పనిచేస్తోందన్నారు.ఈ కార్యక్రమంలో కూనమళ్ళ పృథ్విరాజ్, పంజాల శ్రీరామ్, ఠాగూర్ శివంజన్ సింగ్, దామెర ఆకాష్, కనుక గణేష్ తదితరులు పాల్గొన్నారు.
