Humanity Fading in Modern Society
మంట కలుస్తున్న మానవత్వం
డబ్బు,మత్తు మధ్య మాయమవుతున్న మనసులు
పరకాల,నేటిధాత్రి
ఈ కాలంలో మానవత్వం మంటలలో కరిగిపోతున్నట్లు అనిపిస్తోంది.మనుషుల మధ్య ప్రేమ,పరస్పర గౌరవం క్రమంగా తగ్గిపోతున్నాయి.
డబ్బు కోసం బంధాలు కూడా దూరమవుతున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి.ఇప్పుడు మనిషి విలువ కంటే డబ్బు విలువ ఎక్కువైంది.సంబంధాలు కూడా లాభనష్టాల ఆధారంగా మారుతున్నాయి.తల్లిదండ్రులు పిల్లల మధ్య ప్రేమకన్నా ఆశలుపెరిగాయి.అన్నదమ్ములు మధ్య ఆస్తి గొడవలు సాధారణమయ్యాయి.స్నేహితులు కూడా అవసరాల మేరకే దగ్గరవుతున్నారు.
మానవ సంబంధాలు క్రమంగా వ్యాపార సంబంధాలుగా మారుతున్నాయి.మత్తు పదార్థాల ప్రభావం యువతపై తీవ్రంగా పడి స్నేహాలు కూడా మత్తు కోసం చిత్తవుతున్నాయి.చెడు అలవాట్ల వల్ల మంచి బంధాలు విరిగిపోయి వినోదం పేరుతో వ్యసనాలకు బానిసలవుతున్నారు.మత్తు వల్ల ఆలోచనా శక్తి తగ్గిపోయి
చెడు నిర్ణయాలు తీసుకునే పరిస్థితి ఏర్పడుతుంది.
కుటుంబాలు కూడా ఇబ్బందులు పడుతున్నాయి.

పిల్లల భవిష్యత్తు అంధకారంలోకి వెళ్ళి డబ్బు కోసం మనుషులు విలువలను మరిచిపోయి నిజాయితీతో జీవించడం కష్టం అవుతోంది.స్వార్థం సమాజాన్ని క్రమంగా కరిగిస్తోంది.మనిషి మనిషిని నమ్మలేని స్థితి ఏర్పడి
స్నేహం కూడా నకిలీగా మారుతోంది.సామాజిక విలువలు క్షీణించడంతో పాటు మానవత్వం తగ్గిపోవడం ఆందోళన కలిగిస్తోంది.ఇలాంటి పరిస్థితుల్లో మార్పు చాలా అవసరం కాబట్టి మొదట మనం మనలో మారాలి,డబ్బు కంటే బంధాలకు విలువ ఇవ్వాలి.స్నేహాలను కాపాడుకోవాలి.మానవత్వాన్ని తిరిగి నిలబెట్టుకోవాలి.
ప్రేమ,సహనం,పరస్పర గౌరవం పెంపొందించాలి.
మనుషుల మధ్య అనుబంధాలను బలపరచాలి.అప్పుడే సమాజం సంతోషంగా ఉంటుందని ఉండాలని కోరుకుందాం..
డాక్టర్.సంజీవ బొల్లారం
సైకాలజి కౌన్సిలర్
