District Sports School Selections Held Successfully
ఉత్సాహంగా జిల్లా స్తాయి స్పోర్ట్స్ స్కూల్ సెలెక్షన్స్
జిల్లా యువజన క్రీడల శాఖ అధికారి రఘు
భూపాలపల్లి నేటిధాత్రి
తెలంగాణ రాష్ట్ర క్రీడా ప్రాధికార సంస్థ హైదరాబాద్ వారి ఆదేశాలనుసారం, భూపాలపల్లి జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు బాల బాలికలకు స్పోర్ట్స్ స్కూల్ నందు ప్రవేశం కొరకు జిల్లా స్థాయి ఎంపికల ను స్థానిక అంబేద్కర్ స్టేడియం లో ఉత్సాహంగా నిర్వహించడం జరిగినది.
అన్ని మండలాల కి చెందిన బాల బాలికలకు ఎత్తు, బరువు, 800 మీటర్ల పరుగు, 6 x 10 మీటర్ల షటిల్ రన్, స్టాండింగ్ బ్రాడ్ జంప్, 30 మీటర్ల ఫ్లయింగ్ స్టార్ట్, మెడిసిన్ బాల్ పుట్, వర్టికల్ జంప్, ఫ్లెక్సిబిలిటీ అను తొమ్మిది రకముల పోటీలు నిర్వహించీ ఉత్తమ ప్రతిబ కనబర్చిన 10 మంది బాలురను, 10 బాలికలను రాష్ట్ర స్థాయి లో జరిగే ఎంపికలకు పంపబడును అని జిల్లా యువజన క్రీడల అధికారి, జయశంకర్ భూపాలపల్లి జిల్లా చిర్ర రఘు తెలియచేసారు.
