Employment Relief for Akeru Workers
ఆకేరువాగు కార్మికులకు ఆశాకిరణం – వర్ధన్నపేట ఎమ్మెల్యే చొరవ
వేలాది కుటుంబాల జీవనాధారం ఆకేరువాగు
వ్యక్తుల కోసం వ్యవస్థ ఎప్పుడూ నిర్వీర్యం కావొద్దు.
నాయకులు అధికారులు మధ్య వైరుధ్యం కార్మికులకు శాపం
నేటిధాత్రి ఐనవోలు :-
వర్ధన్నపేట నియోజకవర్గంలోని ఐనవోలు, వర్ధన్నపేట, పర్వతగిరి మండలాల మీదుగా ప్రవహించే ఆకేరువాగు పరిసర ప్రాంతాల్లో సుమారు 5,000 కుటుంబాలు జీవనోపాధి సాగిస్తున్నాయి. వర్షాకాలంలో పొలాల్లో పేరుకుపోయే మట్టి, ఇసుకను ఫిల్టర్ చేసి అమ్మడం వీరి ప్రధాన ఉపాధిగా ఉంది.
ఫిల్టర్ ఇసుకకు ప్రత్యేక ఉపయోగాలు
ఈ ఫిల్టర్ చేసిన ఇసుకను ఇళ్ల నిర్మాణానికి కాకుండా, టైల్స్ కింద వేయడం, బాత్రూంల నిర్మాణం వంటి పనులకు ఉపయోగిస్తున్నారు. ఒక ట్రాక్టర్ ఇసుక అమ్మితే సుమారు వెయ్యి రూపాయల వరకు ఆదాయం వస్తోంది.
బీసీ, ఎస్సీ, ఎస్టీ వర్గాలపై ప్రభావం
ఈ వృత్తిపై ఆధారపడిన వారిలో ఎక్కువగా దళితులు, ఎస్టీలు, బీసీ వర్గాలకు చెందిన వారు ఉన్నారు. ఫైనాన్స్ ద్వారా ట్రాక్టర్లు కొనుగోలు చేసి ఇసుక వ్యాపారం చేస్తూ జీవనం సాగిస్తున్నారు. ప్రస్తుతం పాలసీ కారణంగా ఉపాధి నిలిచిపోవడంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
ఇసుక పాలసీతో దొంగలపై కట్టడి
ప్రభుత్వం తీసుకువచ్చిన ఇసుక పాలసీ వల్ల అక్రమ రవాణా తగ్గినప్పటికీ, ఫిల్టర్ ఇసుకపై ఆధారపడిన కార్మికుల సమస్యలు ముందుకు వచ్చాయి.
ప్రత్యేక అనుమతులకు ప్రతిపాదన
గ్రామపంచాయతీ స్థాయిలో రాయల్టీ చెల్లించే విధంగా అనుమతులు ఇవ్వాలని సూచించారు. అలా చేస్తే గ్రామపంచాయతీలకు ఆదాయం పెరగడంతో పాటు ప్రజలు తమ భూముల్లోనే ఫిల్టర్ ఇసుక సేకరించి అమ్ముకునే అవకాశం ఉంటుంది.
కార్మికులకు మళ్లీ ఉపాధి కల్పించే దిశగా చర్యలు
ప్రస్తుతం ఉపాధి కోల్పోయి ఆందోళనలు చేస్తున్న కార్మికులకు త్వరలోనే ఉపశమనం కలిగేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని ఆశాభావం వ్యక్తమవుతోంది. ఎమ్మెల్యే చొరవతో ఈ సమస్యకు పరిష్కారం దొరికి వేలాది కుటుంబాలు మళ్లీ తమ జీవనోపాధిని కొనసాగించే అవకాశం ఉందని స్థానికులు భావిస్తున్నారు.
