Siliveru Raju Appointed as Dharmakarta of Kashi Vishweshwara Temple
శ్రీ కాశీవిశ్వేశర దేవాలయ ధర్మకర్తగా సిలివేరు రాజు నియామకం
నేటిధాత్రి, కాశీబుగ్గ, వరంగల్:
వరంగల్ తూర్పు కాశీబుగ్గ లోని ప్రసిద్ధ శ్రీ కాశీవిశ్వేశర దేవాలయంలో రానున్న మహాశివరాత్రి పండుగను పురస్కరించుకొని నూతన ఆలయ కమిటీని ఏర్పాటు చేశారు. ఈ కమిటీలో ఆలయ ధర్మకర్తగా సిలివేరు రాజును నియమించారు. ఈ సందర్భంగా సిలివేరు రాజుకు భక్తులు, స్థానికులు, స్నేహితులు హృదయపూర్వక అభినందనలు తెలిపారు. ఆలయ అభివృద్ధి, భక్తులకు మెరుగైన సౌకర్యాల కల్పనతో పాటు మహాశివరాత్రి ఉత్సవాలను భక్తిశ్రద్ధలతో, సమర్థవంతంగా నిర్వహించేందుకు కృషి చేస్తానని సిలివేరు రాజు తెలిపారు. తనకు ఈ బాధ్యత అప్పగించినందుకు దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ మేడంకు, మాజీ ఎమ్మెల్సీ కొండా మురళీధర్ రావు సార్ కు, కాంగ్రెస్ పార్టీ యువనాయకుడు గోపాల నవీన్ రాజ్ అన్నకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. సిలివేరు రాజు నియామకంతో ఈ ఏడాది మహాశివరాత్రి కార్యక్రమాలు మరింత ఘనంగా, సమర్థవంతంగా నిర్వహించబడతాయని భక్తులు, సన్నిహితులు ఆశాభావం వ్యక్తం చేశారు.
