KYC & Cyber Fraud Awareness Program Held at Malyala
మల్యాల గ్రామపంచాయతిలో కేవైసీ అప్డేట్స్ మరియు సైబర్ మోసాలపై ప్రత్యేక అవగాహన సదస్సు.
చందుర్తి, నేటిధాత్రి:
యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, మల్యాల బ్రాంచ్ మరియు స్థానిక అధికారుల సమన్వయంతో మల్యాల గ్రామపంచాయతిలో ప్రత్యేక గ్రామసభ నిర్వహించబడింది.
ఈ కార్యక్రమానికి గౌరవనీయులైన యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఏ జి ఎం సురేష్, మల్యాల బ్యాంక్ మేనేజర్ తిరుపతి, చందుర్తి ఎంపీడీవో రాధా,చందుర్తి ఎంపీఓ ప్రదీప్ కుమార్, అలాగే సర్పంచ్ శ్రీ శారద, మరియు ఉపసర్పంచ్ అనపర్తి నరేష్, వార్డ్ సభ్యులు, మాజీ వైస్ ఎంపీపీ మందాల ఆబ్రహం, మాజీ సర్పంచ్ గట్టు లక్ష్మీనారాయణ, సెక్రటరీ నరేందర్ హాజరై గ్రామస్థులతో కలిసి పాల్గొన్నారు.
ఈ కార్యక్రమంలో కేవైసీ అప్డేషన్, మ్యూల్ అకౌంట్ల నివారణ, సైబర్ మోసాలపై అవగాహన, సురక్షిత బ్యాంకింగ్ పద్ధతులు వంటి ముఖ్యమైన అంశాలపై ప్రజలకు అవగాహన కల్పించడం జరిగింది.
