BRS party councilor candidate Tirupati should be made to win
బీఆర్ఎస్ పార్టీ కౌన్సిలర్ అభ్యర్థి తిరుపతిని గెలిపించాలి
మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి
భూపాలపల్లి నేటిధాత్రి
స్థానిక మున్సిపల్ ఎన్నికలలో భాగంగా భూపాలపల్లి మున్సిపల్ పరిధిలోని 18 వ వార్డులో బీఆర్ఎస్ పార్టీ మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి కార్నర్ మీటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ 18వ వార్డు బిఆర్ఎస్ పార్టీ బలపరిచిన కౌన్సిలర్ అభ్యర్థి గ్యాదoగి
తిరుపతిని గెలిపించాలి అలాగే 18 వార్డు లో ఉన్న సమస్యలన్నిటిని పరిష్కరిస్తాను కాలనీలో సిసి రోడ్లు సైడ్ డ్రైనేజీలు తాగునీరు సమస్యలు తలెత్తకుండా పరిష్కరిస్తానని వారు ప్రజలకు హామీ ఇచ్చారు కావున 18వ వార్డు ప్రజలు అందరూ గ్యాదoగి తిరుపతి కారు గుర్తుపై ఓటు వేసి ఆశీర్వదించగలరని మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను ఈ కార్యక్రమంలో నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు
