కౌన్సిలర్ అభ్యర్థి సోతుకు.ప్రవీణ్ కంకి కొడవలి గుర్తుకు ఓటు వేసి గెలిపించండి
భూపాలపల్లి నేటిధాత్రి
కాంగ్రెస్ పార్టీ, సిపిఎం సిపిఐ పార్టీలు ఏఐటియుసి ఐఎన్ టియుసి కార్మిక సంఘాలు బలపరిచిన 28 వ వార్డు సిపిఐ కౌన్సిలర్ అభ్యర్థి సోతుకు.ప్రవీణ్ కుమార్ కంకి కొడవలి గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని వారు అన్నారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ
తెలంగాణ ఉద్యమంలో, విద్యారంగ సమస్యల పై అలుపెరుగని పోరాటం,నిరుపేదల కోసం భూ పోరాటం,ప్రజా ఉద్యమాలు, సామాజిక సేవలు, ప్రతి సంవత్సరం 50 మంది పేద విద్యార్థులకు ఉచిత విద్య ను అందిస్తూ మీ ముందుకు వస్తున్న ప్రవీణ్ అన్నను గెలిపించి 28వ వార్డు అభివృద్ధి కోసం, 28వ వార్డు ప్రజల సమస్యలు పరిష్కరించడానికి, సింగరేణి కార్మికుల హక్కులను కాపాడడానికి,మీ అందరి కోసం పోరాటాలు చేయడానికి సరైన నాయకుడు నిరుద్యోగి నిత్యం పోరాటాలు తప్ప ఏమీ తెలియని యువ నాయకుడు ఎర్రజెండ ముద్దుబిడ్డ ప్రవీణ్ అన్నను గెలిపించండి. అని వారు అన్నారు
