Temporary Relief to Drainage Problem with Sarpanch Initiative
మురుగునీటి సమస్యకు సర్పంచ్ చొరవతో తాత్కాలిక పరిష్కారం
జహీరాబాద్ నేటి ధాత్రి:
సంగారెడ్డి జిల్లా న్యాల్కల్ మండలం హద్నూర్ గ్రామంలో మురుగునీటి ప్రవాహంతో రైతులు ఎదుర్కొంటున్న ఇబ్బందులను గ్రామ సర్పంచ్ ముత్తం శెట్టి ప్రవీణ్ పరిష్కరించారు. అల్లాదుర్గ్ మెటల్ కుంట రోడ్డు మార్గం సమీప కాలనీ నుంచి పొలాల దారి గుండా ప్రవహిస్తున్న మురుగునీటితో రహదారిలో రాకపోకలు, పంటల తరలింపు కష్టతరంగా మారింది. రాత్రిపూట ప్రమాదకర పరిస్థితులు నెలకొన్నాయని రైతులు ఆందోళన వ్యక్తం చేయగా, సర్పంచ్ జేసీబీతో కాల్వ తవ్వించి నీటిని మళ్లించారు. దీంతో రైతుల సమస్య తాత్కాలికంగా పరిష్కారమైంది.
