“చలో కరీంనగర్ విజయవంతం చేయాలని” భద్రాద్రి కొత్తగూడెం జిల్లా నేతకాని సంఘం విద్యార్థి విభాగం జిల్లా అధ్యక్షులు దుర్గం ప్రేమ్ కుమార్ అన్నారు
భద్రాద్రికొత్తగూడెం జిల్లా),నేటిధాత్రి: కరకగూడెం మండల పరిధిలోని విలేకర్ల సమావేశంలో ఈనెల 19/12/2021 కరీంనగర్ లోని సాయి మహాలక్ష్మి ఫంక్షన్ హాల్ లో జరిగే రాష్ట్ర విద్యార్థి సమస్యలపై జరిగే సదస్సును విజయవంతం చేయాలి నేతకాని విద్యార్థి విభాగం జిల్లా అధ్యక్షులు దుర్గం ప్రేమ్ కుమార్ అన్నారు.
గత కొన్ని ఏళ్లుగా నేతకానీలు ఎదుర్కొంటున్న సమస్యల పైన మరియు ఏజెన్సీ గోదావరి పరివాహక ప్రాంతాల నేతకాని లు ఆదివాసీల ప్రజలతోనే మమేకమై నివసిస్తున్నప్పటికీ అభివృద్ధికి ఆమడ దూరంలో ఎలాంటి హక్కులు,చట్టాలు వర్తించక పోవడం వలన అభివృద్ధికి గత 50 సంవత్సరాల వెనకబాటు తనం లో ఉన్నారు. నేతకాని లు విద్య వైద్యం రాజకీయంగా సామాజికంగా ఆర్థికంగా వెనుకబడ్డారు. ఇప్పటికైనా నేతకాని కులస్తులు అందరూ ఏకంగా పోరాడాలని కోరుకుంటున్నాను. కాబట్టి నేతకాని కుల బంధువులందరూ మన యొక్క హక్కులను సంపాదించుకో గలము. మన కులస్తులు అందరూ రాష్ట్ర సదస్సును విద్యార్థులు యువకులు పెద్ద సంఖ్యలో హాజరై సదస్సును విజయవంతం చేయగలరు.
దేశానికి స్వతంత్రం వచ్చినప్పటి నుండి ఇప్పటి వరకు ఆర్థికంగా రాజకీయంగా ఉపాధి పరంగా విద్య పరంగా ఉద్యోగపరంగా మనకు తీవ్ర అన్యాయం జరుగుతుంది. మనకు జరుగుతున్న అన్యాయాలపై తెలంగాణలోని నేతకాని విద్యార్థి కులస్తుల అందరం ఏకమై ప్రభుత్వంపై మన హక్కుల సాధన కోసం మనకు జరుగుతున్న అన్యాయం గురించి బహిరంగంగా ఉధ్యామాలకు సిద్ధం అవుదాం. ఈ కార్యక్రమంలో రాష్ట్ర నాయకులు జాడి నాగరాజు, రామటేంకి మోహన్ రావు, చప్పిడి వెంకటేశ్వర్లు, జాడి సంజీవ, జిల్లా నాయకులు దుర్గం సందీప్, ప్రకాష్, గాందర్ల సతీష్,గాందర్ల ధనంజయ, కొండ గొర్ల కోటేశ్వరరావు, బాడిస సమ్మయ్య, బాడిస సుభాష్, జనగం సుమన్, జాడి దినేష్, దుర్గం శరత్ బాబు, దుర్గ ప్రసాద్, జాడి రవి కుమార్,జిమ్మిడి విజయ్,గోగు విజయ్,జాడి విజయ్,దుర్గం ప్రవీణ్, రామటేంకి వంశీ, జాడి అర్జున్, జాడి వంశీ,గాందార్ల లోకేష్,దుర్గం కిరణ్,జిమ్మిడి మనోరంజన్,దుర్గం సురేందర్, తదితరులు పాల్గొన్నారు.