పాలకుల విధానాలే అతి పెద్ద శాపం : తాటి వెంకటేశ్వర్లు

దేశంలో, రాష్ట్రంలో పాలకులు అవలంబిస్తున్న దివాలాకోరు విధానాలు అన్ని వర్గాల ప్రజలకు అతి పెద్ద శాపంగా మారాయని తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం(బికెయంయు) రాష్ట్ర కార్యదర్శి తాటి వెంకటేశ్వర్లు అన్నారు.
ఆదివారం స్థానిక సిపిఐ కార్యాలయంలో ఆ సంఘం జిల్లా 2వ మహాసభ జరిగింది. ఈ సందర్భంగా సంఘ పతాకాన్ని తాటి ఆవిష్కరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ భూమి కోసం, భుక్తి కోసం అలుపెరగని పోరాటం చేసిన చరిత్ర వ్యవసాయ కార్మిక సంఘానికి ఉందన్నారు. దున్నేవాడికే భూమి కావాలని. వెట్టిచాకిరీ నిర్మూలించాలని తొలినాళ్ళనుండి ఉద్యమిస్తూనే ఉందని చెప్పారు . సుదీర్ఘ పోరాటాల ఫలితంగా వచ్చిన అటవీ హక్కుల చట్టం, ఉపాధి హామీ పథకం ఆశించిన స్థాయిలో అమలు కావడం లేదని, ఉపాధి హామీ పథకంలో అవినీతి చోటు చేసుకుంటుందని అనేకసార్లు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తామని చెప్పారు. గ్రామీణ ప్రాంతాల్లోని పేదలందరికీ ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందే పరిస్థితి లేదని, పేదలు మరింత పేదలు గా మారిపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వ సబ్సిడీలు పేదలకు అందడం లేదని, ప్రభుత్వ ఆస్పత్రుల్లో మౌలిక సదుపాయాల కొరత పెద్ద ఎత్తున ఉందని, ప్రభుత్వ వైద్యం పై ఆధారపడి జీవనం సాగిస్తున్న పేదలకు సరైన వైద్యం అందక మృత్యువాత పడుతున్నారని అన్నారు, కరోనా కష్ట కాలంలో ఎన్నో పేద కుటుంబాలు తిండి గింజలు లేక అల్లాడిపోయాయని అని, వైద్యం చేయించుకునే స్తోమత లేక ప్రాణాలు వదిలేశారని, పేదలకు సరైన వైద్య సదుపాయాలు అందించాల్సిన ప్రభుత్వం మొక్కుబడిగా వ్యవహరించిందని అన్నారు, ఎస్సీ ఎస్టీ బీసీల నిధులు డారి మల్లు తున్నాయని, వాటిని కాజేస్తున్నారని , దీంతో అసలైన లబ్ధిదారులకు మోసం జరుగుతుందని చెప్పారు.

గ్రామీణ ప్రజల అభివృద్ధే ధ్యేయంగా పని చేస్తున్నామని ప్రభుత్వం చెబుతున్న మాటలు కేవలం కేవలం మిగిలిపోన్నాయని మండిపడ్డారు. క్షేత్ర స్థాయిలో సమస్యలు తెలుసుకుని పరిష్కరించాల్సిన పాలకులు ఖరీదైన భవంతులు, ఏసీ గదుల్లో కూర్చుని మాట్లాడితే ఒరిగేది ఏముందన్నారు. అనంతరం సిపిఐ జిల్లా కార్యదర్శి ఎస్కే సాబీర్ పాషా మాట్లాడుతూ ఈ దేశ సంపద కొందరి చేతుల్లోనే నిక్షిప్తమై ఉందని, ఆ వర్గానికి అన్ని రకాల ఫలాలు అందుతున్నాయని అన్నారు. రేషన్ షాపుల్లో ఒకప్పుడు తొమ్మిది రకాల నిత్యావసర సరుకులు ఇచ్చేవారని ఇప్పుడు బియ్యం తప్ప మరేమీ ఇవ్వడం లేదన్నారు వాటిని కూడా రేషన్ షాపు డీలర్లు దొడ్డిదారిన అమ్ముకుని సొమ్ము చేసుకుంటున్నారు అని మండిపడ్డారు నిత్యావసరాల ధరలు నానాటికీ ఆకాశాన్నంటుతున్న నేపథ్యంలో నిరుపేదలు కొనలేక తినలేక అంటున్నారని కానీ పాలకులు మాత్రం ప్రజాధనాన్ని లక్షల కోట్లు కాజేసి దోచుకుంటున్నారని ఆరోపించారు అన్ని రకాల వస్తువులతో పాటు డీజిల్ పెట్రోల్ ధరలు పెరిగి పోతున్నప్పటికీ పేదల ఆదాయం మాత్రం కొంచెం కూడా పెరగడం లేదని చెప్పారు.

గిరిజనులు పేదల సాగులో ఉన్న భూమి సమస్యలు పరిష్కరించడంలో పాలకులు నిర్లక్ష్యం వహిస్తున్నారని, పేదల సాగులో ఉన్న ప్రతి ఎకరాకు పట్టాలు ఇవ్వాలని, ప్రభుత్వం విద్యా, వైద్యానికి పెద్దపీట వేసి మౌలిక సదుపాయాలు కల్పించాలని డిమాండ్ చేశారు, వ్యవసాయ కార్మికుల సమస్యల పరిష్కారాన్ని కోరుతూ ఈ నెల 29 30 తేదీల్లో రంగారెడ్డి జిల్లా కేసరి లో తలపెట్టిన వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర 3 వ మహాసభలు జయప్రధానికి పెద్ద ఎత్తున తరలిరావాలని కోరారు. ఈ కార్యక్రమంలో సీపీఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు రావులపల్లి రాంప్రసాద్ రాష్ట్ర సమితి సభ్యులు కల్లూరి వెంకటేశ్వర్లు, ముత్యాల విశ్వనాథం వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి శ్రీనివాస్ రెడ్డి, జిల్లా అధ్యక్షులు తమ్మళ్ళ వెంకటేశ్వరరావు, భాస్కర్, వాసంశెట్టి పూర్ణచంద్ర రావు, పద్మ ,ధనలక్ష్మి తదితరులు పాల్గొన్నారు

Similar Posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *