Chakali Shivakumar Appointed TPCC Social Media Coordinator
పీసీసీ డాక్టర్ సెల్ సోషల్ మీడియా స్టేట్ కో ఆర్డినేటర్ గా చాకలి శివకుమార్ నియామకం..
జహీరాబాద్ నేటి ధాత్రి:
తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (టీపీసీసీ) డాక్టర్స్ సెల్, మెడికల్ & హెల్త్ విభాగం సోషల్ మీడియా స్టేట్ కోఆర్డినేటర్ గా ఝరసంగం కేంద్రానికి చెందిన చాకలి శివకుమార్ ను నియమిస్తూ నియమిస్తూ రాష్ట్ర చైర్మన్ డాక్టర్ ఎం. రాజీవ్ ఉత్తర్వులు జారీ చేశారు. వెంటనే అమలులోకి వచ్చే విధంగా ఈ నియామకాన్ని ప్రకటించారు. పార్టీ బలోపేతం కోసం నిరంతరం శ్రమించాలని, టీపీసీసీ అధ్యక్షుడు బి. మహేశ్ కుమార్ గౌడ్ నాయకత్వాన్ని మరింతగా నిలబెట్టాలని ఈ సందర్భంగా డా. రాజీవ్ పేర్కొన్నారు. రాష్ట్రంలో ప్రజా ఆరోగ్య వ్యవస్థను బలపర్చడంలో మరియు అట్టి కార్యక్రమాలు ప్రజల్లోకి తీసుకెళ్లడం లో సోషల్ మీడియా పాత్ర ముఖ్యమైంది అని అన్నారు. రాష్ట్ర పీసీసీ వైద్య విభాగం వైస్ చైర్మన్ గా నియమించ డానికి సహకరించిన సీఎం రేవెంత్ రెడ్డి, తెలంగాణ కాంగ్రేస్ వ్యవహారాల ఇంచార్జి మీనాక్షి నటరాజన్ రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖమంత్రి దామోదర్ రాజనరసింహా, పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, టీపీసీసీ డాక్టర్ సెల్ మెడికల్ హెల్త్ ఛైర్మెన్ డాక్టర్ రాజీవ్ లకు చాకలి శివకుమార్ ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.
