4va anthasthu nunchi duki vidhyarthini atmahatya, 4వ అంతస్తు నుంచి దూకి విద్యార్థిని ఆత్మహత్య

4వ అంతస్తు నుంచి దూకి విద్యార్థిని ఆత్మహత్య

రాయదుర్గం, నేటిధాత్రి : హైదరాబాద్‌ మణికొండ చిత్రపురికాలనీలో ఇంటర్‌ విద్యార్థిని భవనం నాలుగో అంతస్తు పైనుంచి కిందకి దూకి ఆత్మహత్యకు పాల్పడిన ఘటన కలకలం రేపింది. చిత్రపురికాలనీలో నివసించే ఇందుశ్రీ (18) ఓ ప్రైవేటు కళాశాలలో ఇంటర్‌ ప్రథమ సంవత్సరం చదువుతోంది. ఇటీవల తన ఇందుశ్రీ బాబాయి కుమార్తె ఇంట్లోంచి బయటకు వెళ్లిపోయింది. ఈ విషయాన్ని ఇందుశ్రీ తన తల్లిదండ్రులతో కానీ, కుటుంబ సభ్యులతోగానీ చెప్పలేదు. శనివారం ఈ విషయం తెలుసుకున్న ఇందుశ్రీ తండ్రి తమకెందుకు చెప్పలేదంటూ మందలించాడు. దీంతో తీవ్ర మనస్తాపానికి గురైన ఇందుశ్రీ ఎల్‌ఐజీ బ్లాక్‌-18లో నాలుగో అంతస్తు పైనుంచి కిందకి దూకింది. తల్లిదండ్రులు ఆమెను హుటాహుటిన ఆస్పత్రికి తరలించగా అప్పటికే ఆమె మతిచెందినట్లు వైద్యులు వెల్లడించారు. ఈ ఘటనపై రాయదుర్గం పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *