10 Applications Received In Prajavani
ప్రజావాణికి 10 దరఖాస్తులు
చేవెళ్ల, నేటిధాత్రి :
ప్రజావాణి కార్యక్రమానికి 10 దరఖాస్తులు వచ్చినట్లు చేవెళ్ల రెవెన్యూ డివిజనల్ అధికారి తెలిపారు. సోమవారం చేవెళ్ల రెవెన్యూ డివిజనల్ కార్యాలయంలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమానికి 10 దరఖాస్తులు రాగా అందులో విద్యుత్ శాఖ 1, ఆర్ అండ్ బి 1, రెవెన్యూ శాఖ 6, పెన్షన్ కు సంబంధించి 2 దరఖాస్తులు వచ్చాయి. దరఖాస్తులను స్వీకరించిన రెవెన్యూ డివిజనల్ అధికారి సంబంధిత శాఖల అధికారులకు ప్రజావాణి దరఖాస్తులను పెండింగ్లో పెట్టకుండా వెంటనే పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో వివిధ శాఖలకు చెందిన డివిజన్ స్థాయి అధికారులు పాల్గొన్నారు.
