ఏ.ఐ.ఎస్.బి జిల్లా అధ్యక్షులు పుల్లని వేణు
చేర్యాలలో ఏ.ఐ.ఎస్.బి కళాశాల కమిటీ ఎన్నిక
చేర్యాల నేటిధాత్రి…
చేర్యాల మండలంలోని పలు ప్రైవేట్ కళాశాలలలో బుధవారం నాడు నూతన కమిటీలను ఎన్నిక చేపట్టడం జరిగిందని ఏ.ఐ.ఎస్.బి సిద్దిపేట జిల్లా అధ్యక్షులు పుల్లని వేణు అన్నారు. ఈ సందర్బంగా పుల్లని వేణు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వాలు పూర్తిగా విద్యారంగాన్ని విస్మరిస్తున్నాయని,కేంద్రంలో బీజేపీ,రాష్ట్రంలో తెరాస ప్రభుత్వాలు పూర్తిగా విద్యార్ధి వ్యతిరేక విధానాలను అవలంభిస్తున్నారని ఏఐఎస్బిగా ఎండగడుతామని విద్యారంగ సమస్యల పరిస్కారమే ఏఐఎస్బి ధ్యేయమని విద్యార్థులకు పిలుపునిచ్చారు. దేశంలో స్వాతంత్ర ఉద్యమంతో పాటు స్వాతంత్య్ర అనంతరం విద్య, వైద్యం, ఉపాధి హక్కుల సాధన కోసం అఖిల భారత విద్యార్థి సమాఖ్య గత 8 దశాబ్దాల నుండి పోరాటం చేస్తుందని 1936లో ఆవిర్భవించిన ఏ.ఐ.ఎస్.బి శాంతి, సోషలిజం, అభ్యుదయం, విద్యా విధానం లక్ష్యంగా పని చేస్తున్నదని అన్నారు. నేడు కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు విద్యను నిర్వీర్యం చేస్తున్నారని,కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ విద్యను కాషాయ కరణ దిశగా మార్చడానికి ప్రయత్నాలు చేస్తుందని,విద్యను మత ప్రతిపాతిపధికాన రూపుదిద్దుతోందని,అదే విధంగా రాష్ట్ర ప్రభుత్వం కూడ అనేక హామీలు ఇచ్చి మాట తప్పిందనని అన్నారు. ఇందులో శ్రీవింధ్య ఒకేషనల్ జూనియర్ కళాశాల కమిటీ మహిళా విభాగం నుంచి స్మైలీ,నవ్యశ్రీ, హాసిని, అంజలి,సమ్రీన్, భూష్రా మరియు పురుషుల విభాగం నుంచి నంద కిషోర్, ప్రశాంత్ , సాయికుమర్, ప్రదీప్, లను ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగిందన్నారు. తదనంతరం నూతన విద్యార్ధి నాయకులు మాట్లాడుతూ సుధీర్ఘ ఘన చరిత్ర కలిగిన సంఘంలో పనిచెయ్యడం సంతోషంగా ఉందని కళాశాలలో జరిగే సమస్యలను ఏ.ఐ.ఎస్.బి గా పరిష్కారిస్తామని అన్నారు.
ఈ కార్యక్రమంలో జిల్లా నాయకులు నంగి తిరుపతి, హరికృష్ణ తదితర విద్యార్థులు పాల్గొన్నారు.