మునుగోడు కారుదే!

`అనూహ్యమైన మెజారిటీతో టిఆర్‌ఎస్‌ గెలుపు!

`20 వేల నుంచి 25 వేల మెజారిటీ అవకాశం.

`నేటిధాత్రి ఎగ్జిట్‌ పోల్‌ రిజల్ట్‌.

`ప్రభుత్వ పథకాలపై ప్రజలు సంతృప్తి.

`విద్యుత్‌ మోటార్లకు మీటర్లు ఒక అంశమైంది.

`రాజగోపాల్‌ రెడ్డిపై టిఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌ చేసిన కాంట్రాక్టు విమర్శలు ప్రజల్లోకి బాగా వెళ్లాయి.

`ఫ్లోరైడ్‌ బాధ తీర్చిన పార్టీగా టిఆర్‌ఎస్‌ వైపు నిలిచిన జనం.

`ఈ ఎన్నికలలో సురక్షితమైన మంచి నీటి ప్రభావం కూడా రాజకీయంలో భాగమైంది.

`ఫ్లోరైడ్‌ రహిత మునుగోడులో టిఆర్‌ఎస్‌ పాత్రపై మొదటి సారి నేటిధాత్రి ప్రస్తావన.

`అదే ప్రతిపక్ష పార్టీల చిత్తశుద్ధిని ప్రశ్నించే దాకా వెళ్లింది.

`ఒక దశలో ఫ్లోరైడ్‌ సమస్యపైనే ప్రచారమంతా కేంద్రీకృతమైంది.

`ఆ క్రెడిట్‌ అంతా టిఆర్‌ఎస్‌ కే వెళ్లింది.

`కాంగ్రెస్‌ కు డిపాజిట్‌ దక్కే అవకాశం లేకపోలేదు.

`రాజగోపాల్‌ రెడ్డిపై అసలైన బిజేపి శ్రేణుల అసంతృప్తి.

`రాజగోపాల్‌ రెడ్డి నాన్‌ లోకల్‌… కూసుకుంట్ల లోకల్‌ అనేది కూడా ప్రజలను ఆలోచింపజేసింది.

`ఎన్నికలైపోగానే రాజగోపాల్‌ రెడ్డి ఆస్ట్రేలియా ప్రయాణం అన్న అంశం కూడా తోడైంది.

`చండూరులో సిఎం సభ ప్రభావం కూడా కనిపించింది.

హైదరాబాద్‌,నేటిధాత్రి: 

మునుగోడులో కారు జోరు కొనసాగింది. ప్రతిపక్ష పార్టీలైన బిజేపి, కాంగ్రెస్‌ ల పరిస్థితి ప్రచారం జరిగినంతగా పోలింగ్‌ రోజు కనిపించలేదు. పోలింగ్‌ సరళిని బట్టి చూసినా బిజేపి, కాంగ్రెస్‌ లకు ఆశనిపాతమే ఎదురైంది. రాజగోపాల్‌ రెడ్డి తనకు తానుగా ఊహించుకున్నంత ఓటు బ్యాంకు ఆయనకు కనిపించలేదు. మునుగోడు ఉప ఎన్నిక కు ముందు నెల రోజుల పాటు నేటిధాత్రి సర్వే నిర్వహించింది. దాదాపు అన్ని గ్రామాల ప్రజలను నేటిధాత్రి బృందం కలిసింది. ఆ గ్రామాలలో ప్రజల ఆలోచనా సరళి తెలుసుకునే ప్రయత్నం చేసింది. ప్రతి గ్రామంలోనూ కొంతమందిని నేరుగా ప్రశ్నించడంతో పాటు, ఆయా గ్రామాలలో ప్రజల చర్చలను కూడా ఆసక్తిగా నేటిధాత్రి బృందం వినడం జరిగింది. ఏ ఉప ఎన్నికైనా ఏదొ ఒక బలమైన కారణం అంటూ వుంటుంది. ఈ మధ్య గత మూడేళ్ల కాలంలో తెలంగాణలో వచ్చిన ఉప ఎన్నికల విషయానికి వస్తే ముందుగా హుజూర్‌నగర్‌ ఉప ఎన్నిక జరిగింది. మాజీ పిసిసి అధ్యక్షుడు ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారు. ఎంపిగా ఆయన పోటీ చేసి గెలిచారు. దాంతో హుజూర్‌నగర్‌ ఉప ఎన్నిక వచ్చింది. ఆ ఎన్నికలో టిఆర్‌ఎస్‌ పార్టీ గెలిచింది. ఆ తర్వాత దుబ్బాక ఉప ఎన్నిక జరిగింది. దుబ్బాక ఎమ్మెల్యే సోలిపేట రామలింగారెడ్డి మరణించడంతో ఉప ఎన్నిక అనివార్యమైంది. అయితే అక్కడ బిజేపి గెలిచింది. దుబ్బాక నుంచి బిజేపి అభ్యర్థిగా బరిలోకి దిగిన రఘునందన్‌ రావు ఆచరణ సాధ్యం కాని హామీలు ఇవ్వడంతో పాటు గతంలో రెండు సార్లు ఓటమి సానుభూతి ఆయనకు కలిసివచ్చింది. అయినా ఆయన గెలిచింది కేవలం పదకొండు వందల ఓట్ల మెజారిటీ మాత్రమే. అయినా అది రఘునందన్‌ రావు వ్యక్తి గత గెలుపు ఖాతానే. తర్వాత నాగార్జున సాగర్‌ ఉప ఎన్నిక లో టిఆర్‌ఎస్‌ ఘన విజయం సాధించింది. దుబ్బాక గెలుపుతో బిజేపి నాగార్జున సాగర్‌ ఉప ఎన్నికపై బోలెడు ఆశలు పెట్టుకున్నది. కానీ బొక్కబోర్లా పడిరది. తర్వాత హుజూరాబాద్‌ ఉప ఎన్నిక. అది బలమైన రాజకీయ కారణం వల్ల వచ్చింది. అది కూడా ఈటెల వ్యక్తి గత గెలుపు ఖాతాలోనే పడిరది. ఈ ఉప ఎన్నికలన్నీ సహజ సిద్ధంగా వచ్చినవి. మునుగోడు అలా కాదు. రాజగోపాల్‌ రెడ్డి స్వార్థంతో వచ్చిందనేది ప్రజలు కూడా బలంగా నమ్మారు. రాజగోపాల్‌ రెడ్డి స్వార్థ పూరిత రాజకీయాన్ని ఎండ గట్టడంలోనూ, ప్రజల్లోకి తీసుకెళ్లడంలోనూ టిఆర్‌ఎస్‌ సక్సెస్‌ అయ్యింది.మునుగోడు మొదటి నుంచి బిజేపి హైప్‌ క్రియేట్‌ చేసి, దానిని వాడుకుందామని చూసింది. 

కానీ బిజేపి అనుకున్నంతగా ప్రజలు నమ్మలేదు. అంతే కాకుండా మునుగోడు ఉప ఎన్నిక హుజూరాబాద్‌ ను మించి కాస్ట్లీ అనుకున్నారు. అందుకు తగ్గట్టుగానే రాజకీయ పార్టీలన్నీ ప్రచారం చేశాయి. రాజగోపాల్‌ రెడ్డి రాజీనామా చేసిన మరుసటి రోజు నుంచే అన్ని పార్టీల ప్రచారం మొదలైంది. అభ్యర్థుల ప్రకటనతో ప్రచారం మరింత ఊపందుకున్నది. ఈ దశలో టిఆర్‌ఎస్‌ పార్టీ పూర్తిగా గ్రౌండ్‌ ప్రచారం విసృతంగా చేపట్టింది. టిఆర్‌ఎస్‌ కు చెందిన మంత్రులు రోడ్‌ షోలు నిర్వహించారు. ఎమ్మెల్యేలు గ్రామ స్థాయి దాకా వెళ్ళి ప్రచారం చేశారు. ప్రజలను విసృతంగా కలిసి, ప్రభుత్వ పథకాల అమలు తీరు ప్రచారం చేశారు. ధరల పెరుగుదల, విద్యుత్‌ మోటర్లకు మీటర్లు వంటి అంశాలను ప్రజలకు మరింతగా వివరించారు. ప్రజల్లో వున్న కొన్ని అపోహలను టిఆర్‌ఎస్‌ నాయకులు నివృత్తి చేశారు. గతంలో పడిన గోసను గుర్తు చేశారు. ఇప్పటి పరిస్థితులకు, అప్పటి పరిస్థితులను ప్రజలు బేరీజు వేసుకునేలా చేశారు. కుల సంఘాల ప్రత్యేక సమావేశాలు టిఆర్‌ఎస్‌ విసృతంగా నిర్వహించింది. బిజేపి తెలంగాణ కు చేస్తున్న అన్యాయం బాగానే వివరించే ప్రయత్నం చేశారు. ముఖ్యంగా మునుగోడు ఫ్లోరైడ్‌ సమస్య తీరడంలో టిఆర్‌ఎస్‌ పార్టీ పాత్ర, ముఖ్యమంత్రి కేసిఆర్‌ చొరవ, ప్రభుత్వ పనితీరు, మిషన్‌ భగీరథ విజయం వంటి అంశాలపై నేటిధాత్రి కొన్ని రోజుల పాటు ప్రస్తావిస్తూ వచ్చింది. అది మునుగోడులో అనేక చర్చలకు దారి తీసింది. చర్చా వేదికలలో ప్రధాన అంశమైంది. టిఆర్‌ఎస్‌ ఆ విషయాన్ని బాగా ఓన్‌ చేసుకున్నది. ప్రజలను కదిలించింది. ఫ్లోరైడ్‌ పై పోరాటం చేసిన స్వామి చేత ప్రజలను నిజాలు చెప్పించే ప్రయత్నం టిఆర్‌ఎస్‌ చేసింది. మంత్రి కేటిఆర్‌ కూడా ఈ విషయాన్ని బలంగా ప్రజల్లోకి తీసుకెళ్లారు. మీడియా కూడా ఫ్లోరైడ్‌ పై రకరకాల చర్చలు చేపట్డింది. ప్రతిపక్షాలు కూడా ఫ్లోరైడ్‌ రహిత మునుగోడులో తమ పాత్ర చూపించుకోలేకపోయారు. బిజేపికి చెప్పుకోవడానికి ఏమీ లేకుండా పోయింది. అయినా అబద్దాలు ప్రచారం చేయడానికి ప్రయత్నం చేసింది. కానీ వికటించింది. కాంగ్రెస్‌ ఫ్లోరైడ్‌ జోలికి వెళ్లే ధైర్యం చేయలేదు. అప్పటికే విమర్శల జడివాన కాంగ్రెస్‌ ను అతలా కుతలం చేసింది. రాజగోపాల్‌ రెడ్డి ని ఉక్కిరిబిక్కిరి చేసింది. ఇక ఏం చేయాలో తోచని స్థితిలో రాజగోపాల్‌ రెడ్డి ప్రకటించిన మునుగోడు మ్యానిఫెస్టో మొదటికే మోసం చేసింది. ప్రజలు ఆ మ్యానిఫెస్టోను చూసి నవ్వుకున్నారు. ప్రతిపక్ష ఎమ్మెల్యే గా మునుగోడును అభివృద్ధి చేయలేననే చేతులెత్తేసిన రాజగోపాల్‌ రెడ్డి మళ్ళీ గెలిచినా చేసేదేమీ వుండదని ప్రజలు నిర్ణయించుకున్నారు. టిఆర్‌ఎస్‌ కు ఓటేశారు. సార్వత్రిక ఎన్నికలు దగ్గర్లోనే వున్నందున ఈ ఏడాది కాలంలో అధికారంలో వున్న టిఆర్‌ఎస్‌ ప్రభుత్వం మునుగోడును తీర్చిదిద్దుతుందని నిర్ణయానికి వచ్చారు. ఓట్లేశారు. సంక్షేమ పథకాలే టిఆర్‌ఎస్‌ పార్టీకి శ్రీరామ రక్ష. ఎవరు ఎన్ని చెప్పినా, ప్రజలకు వాస్తవాలు తెలుసు. వారిని మోసం చేయడం ఎవరి వల్ల కాదు. ప్రతిపక్షాలు చెప్పే ప్రతి మాటను ప్రజలు గమనిస్తూనే వచ్చారు. రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలు ఏ రాష్ట్రంలో లేవు. వున్నా తెలంగాణలో అమలవుతున్న పెన్షన్లు ఇతర రాష్ట్రాలలో అందడం లేదు. ఇక కరంటు కష్టాలు చూసిన తెలంగాణలో నిరంతర విద్యుత్‌ అందుతోంది. రైతులకు అవసరమైన విద్యుత్‌ ఉచితంగా అందుతోంది. దేశంలో ఎక్కడా లేని రైతు బంధు తెలంగాణలో అమలౌతోంది. ఇక ఆసరా పింఛన్లు వయసు మళ్ళిన వారి జీవితాలను నిలబెడుతున్నాయి.

దివ్యాంగుల పింఛన్లు ఏ రాష్ట్రంలో లేనంతగా ఇస్తున్నారు. ఇలా అన్ని వర్గాల ప్రజలు ఎంతో సంతృప్తికరంగా వున్నారు. వీటికి తోడు మంచినీరు. గత ఎన్నికలలో రాజగోపాల్‌ రెడ్డిని నమ్మి గెలిపించినందుకు ఆయన పార్టీ మారడం ప్రజలకు నచ్చలేదు. రాజగోపాల్‌ రెడ్డి తన స్వార్థం కోసం మునుగోడు ఉప ఎన్నిక తెచ్చాడని ప్రజల బలంగా నమ్మారు. మళ్ళీ రాజగోపాల్‌ రెడ్డి ని గెలిపించినా, రాజకీయం తప్ప, అభివృద్ధి చేసేదేమీ వుండదని ప్రజలు గ్రహించారు. ప్రభుత్వంతో కొట్లాడి నిధులు తెచ్చి పనులన్నీ పూర్తి చేస్తానని చెప్పిన రాజగోపాల్‌ రెడ్డి చేతులెత్తేశాడు. పోరాటం చేయాల్సిన సమయంలో మరో పార్టీలొకి వెళ్లాడు. మళ్ళీ ఎన్నిక తెచ్చినా, ఆయన గెలిచినా మళ్ళీ ప్రభుత్వం పనులు ఇవ్వడం లేదని చేతులెత్తేస్తాడు. తన చేతగాని తనాన్ని ప్రభుత్వం మీద నెట్టేస్తాడు. అందువల్ల వున్న ఈ ఏడాదైనా అభివృద్ధి జరగాలంటే టిఆర్‌ఎస్‌ నే గెలిపించాలని ప్రజలు నిర్ణయించుకున్నారు. ఇక రాజగోపాల్‌ రెడ్డి ముందు పార్టీ శ్రేణులను నమ్మించి, చివరికి చేతులెత్తేశాడు. వచ్చే ఎన్నికలలో చూసుకుందామని చెప్పి కార్యకర్తలను నారాజ్‌ చేశాడు. బిజేపి లో కూడా రాజగోపాల్‌ రెడ్డి అంటే అసంతృప్తి పెరిగిపోయింది. ఇక కాంగ్రెస్‌ పార్టీ సరిగ్గా ఎన్నిక దగ్గరకు రాగానే రాహుల్‌ గాంధీ జోడో యాత్ర తెలంగాణ లోకి ప్రవేశించింది. నాయకులంతా మునుగోడును వదిలేశారు. పాల్వాయి స్రవంతిని ఒంటరిని చేశారు. అయితే ఆ పార్టీ నాయకులు, అభిమానులు మాత్రం కాంగ్రెస్‌ కే ఓటు వేశారు. ఇక బిఎస్పి కూడా డబ్బు పంపకం అంతొ ఇంతో చేసినట్లు తెలుస్తోంది. ఆ పార్టీ కూడా ఓట్లు చీలుస్తోంది. మొత్తం టిఆర్‌ఎస్‌ పార్టీ సంస్థాగత ఓటు బ్యాంకు, ఆసరా, ఇతర పించన్‌ దారులు, రైతులు మొత్తంగా టిఆర్‌ఎస్‌ వైపే నిలిచారు. కారుకు ఓటేశారు. కేసిఆర్‌ నాయకత్వానికి మరో సారి మునుగోడు ద్వారా మద్దతుగా నిలిచారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *