నేనేంటో చూపిస్త!

`బిజేపి చేత చుక్కలు లెక్కబెట్టిస్త!

`ప్రభుత్వాలను పడగొట్టుడు గొప్పదనమా?

`బిజేపి దురాగతాలు దేశమంతా వివరిస్తా!

`ప్రజాస్వామ్యాన్ని పరిహాసం చేస్తున్న బిజేపిని ఎండగడత.

`ప్రజలను అప్రమత్తం చేస్తా!

`రాష్ట్రాల నాయకత్వాలను ఐక్యం చేస్తా!

`ప్రజాస్వామ్య బద్దంగా ఎన్నికైన ప్రభుత్వాలను కూలదోస్తుంటే చూస్తూ ఊరుకోవాలా?

`ప్రపంచం ముందు దేశం పరువుతీస్తున్న వారిని ఉపేక్షించాలా.

`దేశ ఔన్నత్యాన్ని కాపాడుకోవాలి. 

`ఇప్పటికే ఎనిమిది రాష్ట్రాలలో ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేశారు.

`ఇప్పుడు మిగిలిన రాష్ట్రాల మీద పడాలని చూస్తున్నారు.

` ఈ దుర్మార్గులను ప్రజల ముందు దోషులుగా నిలబెట్టాలి.

`రాజకీయాలలో అహంకారానికి తావులేదు.

`ప్రజలను కోసం పని చేయని పార్టీలకు మనుగడ వుండదు.

`అబద్ధాలు పదే పదే చెప్పి ప్రతి సారీ నమ్మించలేరు..

` ప్రజలను వంచించే పాలన ఎల్లకాలం సాగదు.

`ఇప్పటి దాకా ఒక లెక్క…ఇప్పటి నుంచి కేసిఆర్‌ లెక్క..

`రాసిపెట్టుకోండి…మీ గడియలు లెక్కబెట్టుకోండి.

                            తెలంగాణతో గోక్కున్నోళ్లు ఎవరూ ముందట పడలే! తెలంగాణను ఇబ్బందులకు గురిచేసినవాళ్లేవరూ చరిత్రలో గొప్ప స్ధానం పొందలే…అందులోనూ చరిత్రకే భాష్యం చెప్పిన ముఖ్యమంత్రి కేసిఆర్‌ను నిందించిన వాళ్లు తమ రాజకీయ సన్యాసాన్ని వాళ్లే కొని తెచ్చుకున్నారు. ఇలా చెప్పుకుంటూ పోతే తెలంగాణ ఉద్యమకాలంలో కేసిఆర్‌తో కలిసొచ్చిన వాళ్లు తప్ప,కేసిఆర్‌ను తూలనాడిన వాళ్లేవరూ తెలంగాణ రాజకీయాల్లో స్ధానం లేకుండా చేసుకున్నారు. ఇప్పుడు కూడా అంతే…భవిష్యత్తులో జరగేదదే! అరవై ఏళ్ల గోస తీర్చడం కోసం, పద్నాలుగేళ్ల పాటు నిరంతర ఉద్యమం చేపట్టిన నాయకుడు కేసిఆర్‌. చరిత్రలో దేశ స్వాతంత్య్ర పోరాటం తప్ప, మరో పోరాటం ఇంత సుధీర్ఘమైనది ప్రపంచంలోనే లేదు. అంతటి విశిష్టమైనది మలితరం, కేసిఆర్‌ నేతృత్వ తెలంగాణ ఉద్యమం. ఒక రకంగా పవిత్రమైనది. ఉన్నతమైనది. తెలంగాణ వస్తే ఎలా వుండాలో అన్నదానిపై కూడా బ్లూ ప్రింట్‌ తయారు చేసుకొని మరీ తెలంగాణను తీర్చిదిద్దుతున్న నాయకుడు కేసిఆర్‌. అలాంటి తెలంగాణలో రాజకీయాలను అస్ధిర పర్చాలని చూస్తే ప్రజలే క్షమించరు. కేసిఆర్‌ కూడా ఉపేంక్షించరు. పండిరచిన వాడికి తెలుసు పంట విలువ. వండినవారికి తెలుసు వంట విలువ. కుప్ప మీద కూర్చొని తింటా అనేవాడికి ఈ రెండూ తెలియదు. ఇప్పుడు బిజేపి చేస్తున్నది, చేయాలని చూస్తున్నది అదే…అసలు తెలంగాణ ఉద్యమ సమయంలో కలిసి రాని బిజేపి నేతలకు తెలంగాణలో రాజకీయాలు చేసే నైతిక హక్కే లేదు. అయినా ప్రజాస్వామ్య వ్యవస్ధలో రాజకీయం అన్నది అందరి హక్కు. దానిని నైతికంగా నిర్వహించాలి. ప్రజల మన్ననలు పొందాలి. ప్రజల ఆశీస్సులు కావాలి. అంతే గాని ఎన్నికైన ప్రభుత్వాలను కూల్చేందుకు కోట్లు ఖర్చు చేస్తాం…రాజకీయాలను అస్థిరపర్చుదామని చూస్తే తెలంగాణలో వున్నది కేసిఆర్‌. ఆయన చూపు ఎంత చల్లనిదో..కోపం నిప్పులు కురిపిస్తది.  

                         తెలంగాణ ఎమ్మెల్యేలను కొనగోలు చేయాలని చూసిన వ్యవహరాన్ని కేసిఆర్‌ ప్రపంచం ముందు వుంచారు. ఇలా జరుగుతుందని బిజేపి కూడా ఊహించలేదు. పైగా నలుగురు ఎమ్మెల్యేల విషయంలో జరిగిన దాన్ని టిఆర్‌ఎస్‌ బైట పెట్టిన నాడు బిజేపి మాట్లాడిన మాటలకు ఏమైనా అర్ధముందా? అంతే కాదు పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు ఓ అడుగు ముందుకేసి యాదాద్రి వెళ్లి మరీ తడిబట్టలతో ప్రమాణం చేశారు. ఇంత దిగజారుడు తనం రాజకీయాలు ఎక్కడా లేవు. దేశంలో ఇప్పటికే 8 రాష్ట్రాల ప్రభుత్వాలను కూల్చేశాం. ఇక కూల్చాల్సినవి మూడు అంటూ ఎమ్మెల్యేలను పిలిచుకొని మరీ చర్చలు జరిపడం అంటే రాజకీయాల్లో బరితెగింపు తనం తప్ప మరొకటి కాదు. ఇప్పుడున్న దేశ రాజకీయాల్లో కేసిఆర్‌ లాంటి విజ్ఞత,విజ్ఞానం, రాజనీతి వున్న నాయకుడు మరొకరు లేదు. ఆసేతు హిమాచలం వరకు ఏ ప్రాంతం ఏమిటి? అక్కడి ప్రజల పరిస్ధితి ఏమిటి? భౌగోళిక పరిస్దితులు ఎలాంటివి? ప్రజల జీవన విధానం ఎలాంటింది? వంటి అనేక అంశాల మీద అవగాహన వున్న నాయకుడు కేసిఆర్‌. అలాంటి నాయకుడు కొట్లాడి సాధించిన తెలంగాణను ప్రగతి వైపు నడుపుతుంటే సహకారం విస్మరించారు. తెలంగాణకు న్యాయంగా విభజన సమయంలో ఇచ్చిన హమీల మేరకు నిధులు రాలేదు. ఆస్ధుల పంపకాలు పూర్తి కాలేదు. తర్వాత తెలంగాణకు ఇవ్వాల్సిన నిధులు ఇవ్వలేదు. నీతి ఆయోగ్‌ చెప్పిన మిషన్‌ భగీరధకు నిధులు కేటాయించడం లేదు. ఇలా చెప్పుకుంటూ పోతే బిజేపి తెలంగాణకు చేస్తున్న అన్యాయం అంతా ఇంతా కాదు. వీటికి తోడు తెలంగాణకు గతంలోనే ఇచ్చిన అనేక ప్రాజెక్టులు కూడా గుజరాత్‌కు తరలించుకుపోయారు. ఖాజీపేటలో కోచ్‌ ఫ్యాక్టరీ వెళ్లిపోయింది. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఏర్పాటు చేయాల్సిన ఉక్కుఫ్యాక్టరీ కుదరదన్నారు. ఇలా అడుగడుగునా తెలంగాణకు అన్యాయం చేస్తూనే వున్నారు. ఇప్పుడు తెలంగాణలో రాజకీయ అస్ధితరను సృష్టించి చలి కాచుకోవాలనుకుంటున్నారు. ఇది ఎంత దుర్మార్గమో దేశం మొత్తం తెలిసేలా చేస్తానని ముఖ్యమంత్రి కేసిఆర్‌ ఇప్పటికే ప్రకటించారు. 

                          దేశమంతా తిరుగుతా! దేశంలోని అన్ని రాష్ట్రాలను చైతన్యం చేస్తా అని ముఖ్యమంత్రి చెబుతున్నారు. అయినా ప్రజలు ఎన్నుకున్న ప్రజా ప్రభుత్వాలను కూల్చడం అన్నది నైతికత కాదు. గతంలో ఎన్టీఆర్‌ ముఖ్యమంత్రిగా వున్నప్పుడు అప్పటి ప్రధాని ఇందిరాగాంధీ అదే పని చేసింది. కాని ఏమైంది. ప్రజలు తిరగబడ్డారు. మళ్లీ ప్రజాస్వామ్యాన్ని పునరుద్దరించుకున్నారు. ఎన్టీఆర్‌ను అంతకు మించి మెజార్టీతో ముఖ్యమంత్రిని చేశారు. ప్రపంచమంతా కీర్తించిన ఇందిరాగాంధీ ఇక తనకు తిరగులేదని, ఎదురులేదనే ఆలోచనకు వచ్చాక చేసిన ఎమర్జెన్సీ, ఎన్టీఆర్‌ను గద్దెదించడం వంటి పనులు మూలంగా ఆమె కీర్తి మసకబారింది. ఇప్పుడు అదే దారిలో బిజేపి కేంద్ర ప్రభుత్వం నడుస్తోందనేది కేసిఆర్‌ చేస్తున్న ప్రధాన ఆరోపణం. మహారాష్ట్ర, గోవా, మధ్య ప్రదేశ్‌, కర్నాటక రాష్ట్రాలలో ఏం జరిగిందో తెలిసిందే. అక్కడ ఎలాగైతే ప్రభుత్వాలను కూలదోసి, బిజేపి ప్రభుత్వాలను ఏర్పాటు చేశారో…తెలంగాణ,డిల్లీ,రాజస్ధాన్‌లలో కూడా అమలు చేసేందుకు బిజేపి కుయుక్తులు పన్నుతున్నారన్నదానిని ముఖ్యమంత్రి కేసిఆర్‌ బైటపెట్టారు. బిజేపి కటప బుద్దిని చీల్చి చెండాడాడు. 

                  ఇలా ప్రజాస్వామ్యాన్ని పరిహాసం చేస్తున్న బిజేపిని ప్రజల్లోనే ఎండగట్టేందుకు ముఖ్యమంత్రి కేసిఆర్‌ దేశ పర్యటన కూడా చేపట్టే అవకాశం వుంది. ఎందుకంటే దేశ ప్రధాని ఎంతో హుందాగా వ్యవహారించాల్సి వుంది. కాని బెంగాల్‌ రాష్ట్రంలో అక్కడి అధికార పార్టీ ఎమ్మెల్యేలు తమతో టచ్‌లో వున్నారని చెప్పడం ఏమిటని ముఖ్యమంత్రి కేసిఆర్‌ ప్రశ్నించారు. ఎంత సేపు రాజకీయాలేనా? ప్రగతి గురించి ఆలోచించేందేమైనా వుందా? అని నిలదీశారు. ఈ ఎనమిదేళ్ల కాలంలో ప్రభుత్వాలను కూల్చడం తప్ప, ఏ ఒక్క ప్రాజెక్టైనా నిర్మాణం చేశారా? అని అన్నారు. ప్రభుత్వ ఆస్ధులు అమ్మకాలకు పెట్టడమే పనిగా బిజేపి పెట్టుకున్నదని ఆరోపించారు. ఇందుకోసమే స్వాముల అవతారంలో వున్న బ్రోకర్లు పనిచేయడం ఏమిటన్నారు. ఎక్కడైనా చూశామా? ఇలాంటి దురాగాతాలు అని ప్రశ్నించారు. అందుకే ప్రజలు అప్రమత్తం చేయాల్సిన అవసరం వుంది. గతంలో ఇలాగే చంద్రబాబు తెలంగాణ అస్ధిరతకు పాల్పడే కుట్ర చేశారు. కాని జరగలేదు. ఇప్పుడు బిజేపి తెలంగాణ రాజకీయాలను కలుషితం చేయాలని చూస్తోంది. అసలు తెలంగాణ రావడాన్ని ప్రధాని నరేంద్ర మోడీ ఏనాడు జీర్ణించుకోలేదు. అవకాశం వచ్చిన ప్రతీసారి దేశంలో ఏ సమస్య లేనట్లు తెలంగాణ మీద మాట్లాడడం ప్రధానికి అలవాటైపోయింది. తల్లిని చంపి బిడ్డను వేరు చేశారని ఆంద్రప్రదేశ్‌ ఎన్నికల సమయంలో అన్నాడు. తాజాగా పార్లమెంటు తలుపులు మూసి, తెలంగాణ ఇచ్చారని అన్నాడు. అంటే ఆయనకు తెలంగాణ రాష్ట్రం ఏర్పడడం సుతారం ఇష్టం లేదని చెప్పకనే పలు మార్లు ప్రస్తావించారన్నది ఎప్పుడో తెలిపోయింది. 

                        తెలంగాణలోని సాగు విషయంలో ప్రతీసారి కేంద్ర ప్రభుత్వం కిరికిరి పెడుతూనే వుంది. బియ్యం కొనుగోలులోనూ ఇదే తంతు. ప్రతి సారి ఏదో రకమైన ఇబ్బందులకు గురిచేయడం పరిపాటిగా మారింది. తెలంగాణలోని రైతులు వినియోగిస్తున్న కరంటు ఉచితంగా రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వడం బిజేపికి ఇష్టం లేదు. సాగు మోటార్లకు విద్యుత్‌ మీటర్లు పెట్టాలన్నది బిజేపి నిర్ణయం. దాన్ని ముఖ్యమంత్రి కేసిఆర్‌ వ్యతిరేకిస్తున్నాడు. అందువల్ల తెలంగాణలో రాజకీయాలు అస్ధిరం చేయాలి. ప్రజల మద్దతుతో గెలిచే అవకాశం రాదు. కేంద్ర అధికారాలను అడ్డం పెట్టుకొని ప్రభుత్వాన్ని కూలదోస్తే తమ ఇస్టానుసారం వ్యవహరించొచ్చన్నది బిజేపి వ్యూహం. కాని ఇక్కడ వున్నది కేసిఆర్‌…ఆయన ఒక్కసారి కమిటైతే… మిగతాది మీ అందరికీ తెలిసిందే!!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *