బలమైన శక్తిగా బిఆర్‌ఎస్‌

 

`దేశవ్యాప్తంగా మారుతున్న ప్రజల ఆలోచనా సరళి

`భరించలేని పన్నుల భారం నుంచి బిఆర్‌ఎస్‌ తోనే విముక్తి

` రైతుకు పరిహారం పదివేలతో కేసిఆర్‌ నిర్ణయం అపూర్వం.

`దేశ వ్యాప్తంగా కొనియాడుతున్న రైతాంగం.

` కేంద్ర సాయం కోసం ఎదురుచూడకుండా రైతులను ఆదుకుంటున్న వైనం.

`రాజకీయ కక్ష సాధింపులపై ఎత్తిన పిడికిలి బిఆర్‌ఎస్‌.

`ప్రభుత్వ రంగ సంస్థల దుర్వినియోగంపై గళం కవిత.

`బిజేపిని ఎదుర్కొని నిలబడిన నాయకుడు కేసిఆర్‌.

`కేంద్రాన్ని నిలదీయగల శక్తి కేసిఆర్‌ 

`మార్పు మొదలైంది… దేశం బిఆర్‌ఎస్‌ కోసం చూస్తోంది. 

` నిస్పక్ష రాజకీయాలు మళ్ళీ చిగురించాలి.

` అందుకు నడుంబిగించిన బిఆర్‌ఎస్‌. 

` రైతు సంక్షేమ రాజ్య స్థాపన.

` పేద ప్రజల ఆలంబన.

`దేశ స్వావలంబన.

` దేశానికి కేసిఆర్‌ నాయకత్వంలోనే వికాసం.

` రానున్న రోజుల్లో బిఆర్‌ఎస్‌ ప్రభంజనం.

హైదరాబాద్‌,నేటిధాత్రి: 

ప్రజాస్వామ్యమైనా, రాజరికమైనా ప్రజల మీద ఒత్తిడి ఎప్పుడూ పనికి రాదు. రాజకీయాలలో ఆధిపత్య రాజకీయాలు వేరు. ఇతర పార్టీల మీద ద్వేషం వేరు. మేం మాత్రమే రాజకీయాలు చేయాలనుకునే దురుద్దేశ్యం రాజకీయ పార్టీలకు అసలే మంచిది కాదు. ఇప్పుడు బిజిపి చేస్తున్నది అదే…అందులో భాగంగా బిజేపి రాజకీయాల్లో ప్రజలు కూడా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. పాలించమని ప్రజలు అధికారం అప్పగిస్తే, ప్రజాసేవ పక్కన పెట్టి రాజకీయాలు మాత్రమే చేస్తున్నారనర్న భావన బలంగా ప్రజల్లోకి వెళ్తోంది. ప్రజలకిచ్చే సంక్షేమ పథకాల్లో కోతలు పెడుతూ, ధరల మోతలు, పన్నుల వాతలు సామాన్యుడి బతకు దినదిన గండంగా మారే దశకు చేరుకుంటున్నాయి. పారిశ్రామిక వేత్తలకు ప్రోత్సాహకాలు, బ్యాంకులు రుణాలు మాఫీలు, అదే సామాన్యులకు వేధింపులు బిజేపిని పతనం అంచుకు తీసుకుపోతున్నాయని చెప్పడంలో సందేహం లేదు. కరోనా సమయంలో వ్యాక్సినేషన్‌ ఉచితం వేశామని, ఎనభై కోట్ల మందికి ఉచితంగా రేషన్‌ ఇస్తున్నామని గొప్పలు చెప్పుకుంటే సరిపోదు. స్వాతంత్య్రం వచ్చిన నుంచి వచ్చిన అనేక రుగ్మతలకు అవససరమైన వ్యాక్సినేషన్‌ అప్పటి ప్రభుత్వాలు ఉచితంగానే అందిస్తున్నాయి. కాని బిజేపి శ్రేణులు గొప్పగా ప్రచారం చేసుకుంటున్నాయి. అంతే కాని ప్రజల ఆరోగ్యంగా వుంటేనే రాజకీయాలు చేయగమలమన్న సోయి వుంటే బిజేపి ఇలాంటి ప్రకటనలు చేయదు. కాని నిత్యం ప్రజలకు మేం చేసిన మేలు ఎవరూ చేయలేదని, పేదలకు ఉచితంగా రేషన్‌ ఇస్తున్నామంటూ గొప్పలు తమకు తామే చెప్పుకుంటే సరిపోతుందా? ప్రజలు చెప్పాలి. ప్రజలు మెచ్చుకోవాలి. ఏడాదికి నాలుగు సిలిండర్లు సరిపోవా…నెలకో సిలిండర్‌ ఎందుకు? వాడకం తగ్గిస్తే సరిపోదా? ఇదా ప్రభుత్వాలు చెప్పాల్సిన మాటలు. ఒకనాడు సిలిండర్‌ ధరల పెంపును రాజకీయం చేసిన బిజేపి పార్టీయే నేడు దాన్ని మూడొందల శాతం పెంచి, దేశం కోసం, ధర్మం కోసం పెంచామని చెప్పడాన్ని ఏమంటారు? ఉల్లి దర పెరిగితే రాజీకయం చేసిన బిజేపి, అదే ఉల్ల గడ్డను మేం తినమని ఆర్ధిక శాఖ మంత్రి ప్రకటించడాన్ని ఏమని సమర్ధించుకుంటారు? ఉల్లిగడ్డను తినడం ఆపేస్తే వాటి ధర అదే దిగిస్తుందన్న సూచనలు చేయడాన్ని ప్రజలు ఎలా స్వాగతిస్తారు? బాధ్యతాయుతమైన మంత్రి పదవుల్లో వుంటూ ఇలాంటి మాటలు చెప్పడాన్ని ప్రజలు జీర్ణించుకోవడం లేదు. చెప్పే మాటలకు, చేసే చేతలుకు ఎక్కడ పొంతన లేని బిజేపి, రాజకీయలు తప్ప, వేధింపులు తప్ప మరేం చేయలేదని ప్రజలకు అర్ధమైందని ప్రతి పక్షాలు చరకలు అంటిస్తున్నాయి. ఓ వైపు దేశంలో అదానీ లాంటి వారికి ప్రభుత్వ రంగ సంస్ధలు కట్టబెడుతూ, బ్యాంకులను దోచి పెడుతూ, కంపనీలు దివాళా తీస్తే రుణాలు మాఫీ చేయడాన్ని ఏమంటారు? పైగా ప్రభుత్వం వ్యాపారం చేయదంటూ సాక్ష్యాత్తు ప్రధాని మోడీయే వ్యాఖ్యానించడాన్ని ఏమని సమర్ధించుకుంటారు. గతంలో పాలన చేసిన వారికి తెలియకుండానే, పాలన తెలియకుండానే, ప్రజా సంక్షేమం గురించి ఆలోచించకుండానే అనేక ప్రభుత్వ రంగ సంస్ధలు ఏర్పాటు చేశారా? వాటి ద్వారా ప్రజలు సేవలందించారా? ఇలాంటి మాటలు చెబుతూ, ప్రైవేటు వ్యక్తులకు దేశ సంపద దోచి పెట్టేలా చేయడం కూడా దేశం కోసం..ధర్మం కోసమేనా? అని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. ఒక్క వ్యక్తి కోసం దేశ సంపదను దారాధత్తం చేసేలా కేంద్రం సాగడంపై వస్తున్న విమర్శలకు ఎవరు సమాధానం చెబుతారు? అంతే కాకుండా దేశంలో వేధింపు రాజకీయాలు ఎక్కువయ్యాయి. లేని కేసుల పేరుతో,వేధింపులే రాజకీయాలు అనే దిశగా సాగుతూ, లిక్కర్‌ స్కామ్‌ అంటూ కవిత లాంటి మహిళా నాయకురాలను పదేపదే కేంద్ర ప్రభుత్వ రంగ సంస్దలతో విచారణ జరపడాన్ని ప్రజలు ఆహ్వానించడం లేదు. 

దేశ రాజకీయాల్లో విప్లవాత్మక మార్పులు రానున్నాయి.

భవిష్యత్తు రాజకీయాల్లో బిఆర్‌ఎస్‌ సంచలనం నమోదు చేయబోతోంది. దేశంలో బిజేపికి ప్రజలకు రెండుసార్లు అవకాశం కల్పించారు. ఏదో అధ్భుతాలుచేస్తారని ప్రజలు కలలు గన్నారు. అయోధ్య రామాలయం నిర్మాణం అన్న ఒకే ఒక్క లక్ష్యం తప్ప మరే లక్ష్యం లేని రాజకీయాలు చేసిన బిజేపిని నమ్మిన ప్రజలకు ఇప్పుడిప్పుడే బిజేపి అసలు స్వరూపం అర్ధమౌతోంది. దేశంలో మరే రాజకీయా పార్టీలు, ప్రాంతీయపార్టీలు లేకుండా చేసి, బహురాజకీయ పార్టీల ప్రజాస్వామ్య వ్యవస్ధలో ఏకఛ్చత్రాధిపత్యం కోసం బిజేపి ఆరాటపడడం అత్యాశే అవుతుంది. ఇతర పార్టీలు దేశంలో మనుగడ సాగించకుండా చేయడం ప్రజాస్వామ్య స్పూర్తికి విరుద్దం. గత ప్రభుత్వాలు ఇలాగే వ్యవహరిస్తే, ఇప్పుడు బిజేపి కేంద్రలో అధికారంలోకి వచ్చేది కాదు. అనేక రాష్ట్రాలలో దాని పాలన సాగేది కాదు. ప్రతిసారి 1975 ఎమర్జెన్సీ బూచిని చూపి, రాజకీయం చేసిన బిజేపి, ఇప్పుడు అప్రకటిత ఎమర్జెన్సీ రాజకీయం చేస్తుందన్న విమర్శలకు మాత్రం ఎక్కడా సమాధానం లేదు. అందుకే ప్రజల్లో మార్పు వస్తోంది. ప్రత్యామ్నాయ రాజకీయాల వైపు చూస్తున్నారు. అందులో ఆశాజనకంగా,ప్రజారంజకంగా పాలన చేస్తున్న పార్టీలను ప్రజలు గమనిస్తున్నారు. తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న అనేక సంక్షేమ పధకాలపై చర్చించుకుంటున్నారు. తెలంగా ణలో అన్ని వర్గాల ప్రజల సుఖశాంతులు తెలుసుకుంటున్నారు. ఒకనాడు వెనక్కునెట్టేయబడిన, అభివృద్ధికి దూరం చేసిన తెలంగాణలో ఇప్పుడు ప్రగతి విప్లవం సాధ్యమైందన్న దానిపై అధ్యయనాలు సాగుతున్నాయి. దేశంలోని వివిధ రాష్ట్రాలను నుంచి ఎంతో మంది నిపుణులు వస్తున్నారు. అనేక రాజకీయ పార్టీలకు చెందిన నేతలు వస్తున్నారు. కొన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులు కూడా తెలంగాణ వచ్చి ఇక్కడ జరుగుతున్న అభివృద్ధిని చూశారు. కొనియాడుతున్నారు. ముఖ్యమంత్రి కేసిఆర్‌ సాధించిన విజయాలను ప్రశంసిస్తున్నారు. ఆయన నాయకత్వాన్ని కీర్తిస్తున్నారు. కేసిఆర్‌ నాయకత్వం దేశానికి అవసరమని ఆహ్వానిస్తున్నారు. 

 దేశంలోనే రానున్న రోజుల్లో బిఆర్‌ఎస్‌ బలమైన రాజకీయ శక్తిగా అవతరించనున్నది.

 ఎందుకంటే ఇటీవల తెలంగాణలో కురిసిన అకాల వర్షాలకు ద్వంసమైన పంటలకు ప్రభుత్వం ప్రకటించిన పరిహారంపై దేశమంతా ఆసక్తిగా చూస్తోంది. ముఖ్యమంత్రి కేసిఆర్‌ నిర్ణయాన్ని దేశ ప్రజలంతా కొనియాడుతున్నారు. ఇప్పటి వరకు ఏ రాష్ట్రంలో ఏ ముఖ్యమంత్రి ఇలాంటి నిర్ణయం తీసుకోలేదు. ప్రజలకు పరిహారం అందించలేదు. ముఖ్యమంత్రి ప్రకటించిన గంటలోపే జీవో జారీ కావడం, నిధులు విడుదల జరగడం అన్నది గతలో ఎన్నడూ చూడలేదు. దేశంలో ఎక్కడైనా ఇలాంటి పరిస్ధితులు ఎదురైతే ముందు కంటి తుడుపు చర్యలు చేపట్టడం, కేంద్రానికి ఉత్తరాలు రాశామని ప్రకటించి, ప్రజల్ని నమ్మించి చేతులు దులుపుకోవడం ఆనవాయితీగా వస్తోంది. రైతుల పక్షాన ఏ ప్రభుత్వాలు నిలిచేవి కాదు. కాని నేడు తెలంగాణలో వున్న రైతు ప్రభుత్వం రైతుల కోసం అనేక కార్యక్రమాలు అమలు చేస్తోంది. రైతులు మేలు కోరి పనిచేస్తోంది. ఇదే ఇప్పుడు దేశమంతా ఎదురుచూస్తోంది. తెలంగాణ ముఖ్యమంత్రి కేసిఆర్‌ నాయకత్వంలో దేశమంతా రైతు సంక్షేమం వెల్లివిరియాలని కోరుకుంటున్నారు. ఇప్పటి వరకు ఏ రాష్ట్ర ముఖ్యమంత్రి కూడా ఇలాంటి విపత్కరమైన పరస్ధితుల్లో కేంద్రాన్ని సాయం అడమని ప్రకటన చేయలేదు. మా రైతులను మేం కాపాడుకుంటామని ప్రకటించలేదు. నేనున్నాని..భరోసా ఇచ్చింది లేదు. కాని మొట్టమొదటి సారి ముఖ్యమంత్రి కేసిఆర్‌ మాత్రమే అంత ధైర్యంగా ప్రకటన చేశారు. రైతులను ఆదుకుంటున్నారు. ఇప్పటికైనా బిజేపి నేతలు గ్రహించాలి. తెలంగాణ ప్రభుత్వం పరిహారాన్ని మరింత పెంచాలని డిమాండ్‌ చేస్తుందే గాని, కేంద్రం దృష్టికి తెచ్చి, తెలంగాణ రైతులకు పరిహారం అందిస్తామని ఏ ఒక్క బిజేపి ఎంపి మాట్లాడడం లేదు. అంటే వారికి రైతులపై ఎంత ప్రేమ వుందో ఇక్కడే అర్ధమౌతోందని బిఆర్‌ఎస్‌ నాయకులు ఎద్దేవా చేస్తున్నారు. తెలంగాణ అంటే మమకారం లేని బిజేపి నాయకులు రాష్ట్ర్రంలో వున్నారు. తెలంగాణ అంటేనే గిట్టని నాయకులు కేంద్రంలో వున్నారు. ఇలాంటి వారంతా కలిసి తెలంగాణకు న్యాయం చేస్తారని ఎదురుచూడడం కూడా ఆతిశయోక్తే అవుతుంది. అందుకే ముఖ్యమంత్రి కేసిఆర్‌ హుటాహుటిన రంగంలోకి దిగి రైతులను ఆదుకున్నాడు. రైతులనుకాపాడుకున్నాడు. తానున్నానని భరోసా కల్పించాడు. దేశానికి రైతు ఎంత ముఖ్యమో ప్రపంచానికి చాటాడు. అదీ కేసిఆర్‌ అంటే దేశమంతా కొనియాడలేలా చేసుకున్నాడు. ఆయన నాయకత్వం కోసం దేశమంతా ఎదరుచూసేలా చేసుకుంటున్నాడు. నాయకుడంటే కేసిఆర్‌లా వుండాలని వేనోళ్ల పొగిడేలా చేసుకున్నాడు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *