చివరి శ్వాస వరకు పేదల సేవకే అంకితం

పేదలకు నిత్యావసర సరుకుల పంపిణీ

తూర్పు ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్

వరంగల్ సిటి నేటిధాత్రి

వరంగల్ తూర్పు నియోజకవర్గానికి చెందిన 25 వేల మంది పేదలకు నిత్యావసర సరుకుల పంపిణీ కార్యక్రమంలో బాగంగా సీకేఎం కళాశాల మైదానంలో ప్రారంభమైంది ఈ సందర్భంగా 1,12,29 డివిజన్లకు చెందిన 2200 మంది పేదలకు ప్రముఖుల చేతుల మీదుగా నిత్యావసర సరుకుల పంపిణీ చేశారు
ఈ సందర్బంగా ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్ మాట్లాడుతూ ముఖ్యమంత్రి కేసీఆర్,మంత్రి కేటీఆర్ ఆశీర్వాదంతో ప్రజలకు సేవ చేసే అవకాశం దక్కిందన్నారు
కరోనా ప్రపంచాన్ని వణికిస్తున్న సమయంలో రాష్ట్రాన్ని ముఖ్యమంత్రి కాపాడుతున్నారని పేదవాడు ఆకతలితో అలమటించద్దని,12 కిలోల బియ్యం,1500 రూపాయల సాయం అందజేసారన్నారు వలస కార్మికులకు సైతం సహాయం చేసి అండగా నిలిచారు ప్రభుత్వ ఖర్చులతో వలస కూలీలను స్వగ్రామాలకు తరలించారని తూర్పు లో వచ్చిన పాజిటివ్ కేసులన్నీ కోలుకున్నారని మానవీయ కోణంలో అందరూ సేవలు చేస్తున్నారన్నారు కరోనా నివారణకు కృషిచేస్తున్న వైద్య,పారిశుద్య,మీడియా,ఇతర సిబ్బందికి, ప్రతీ ఒక్కరికి కృతజ్ఞతలు తెలిపారు నిత్యావసర సరుకుల పంపిణీ కొరకు చాలా మంది దాతలు ముందుకు వచ్చారన దాతలతో కలిసి 25 వేల కుటుంబాలకు సహాయం అందిస్తున్నామన్నారు కేసీఆర్,మంత్రి కేటీఆర్ ల స్పూర్తితో ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది ఎన్నికలు ఇప్పట్లో లేవు కానీ మీరు నన్ను ఆశీర్వదించినందుకు మీకు సేవచేయాలని ఉద్దేశ్యంతో ముందుకు వచ్చానన్నారు నెలకు సరిపడా నిత్యావసర సరుకులు అందజేస్తున్నాం ప్రత్యక్షంగా,పరోక్షంగా ఇన్ని రోజులు సేవలు అందించిన ప్రతీ ఒక్కరికి కృతజ్ఞతలు తెలిపారు నియోజకవర్గంలో పేదలు ఎక్కువ అని అందరిని ఆదుకుంటామన్నారు మంత్రి సత్యవతి రాథోడ్ ఫోన్ ద్వారా అభినందించారని తెలిపారు
నగర అభివృద్దికై వినయ్ బాస్కర్ తో కలిసి పనిచేస్తాం నియోజకవర్గ అభివృద్ది నా ద్యేయం అందుకు అందరి సహాకారం తీసుకుంటూ ముందుకెలతనని నా ప్రాణమున్నంత వరకూ గులాబీ జెండా వెంటే ఉంటా పేదల కోసమే పనిచేస్తానన్నారు నాకు వ్యక్తి గత ఎజెండాలు లేవు ప్రజల సేవే నా ఎజెండా అని అన్నారు

చీఫ్ విప్ దాస్యం వినయ్ బాస్కర్ మాట్లాడుతూ

వరంగల్ అర్బన్ లో పాజిటివ్ కేసులు వస్తే వారి ప్రాణాలను పణంగా పెట్టి కాపాడిన వైద్యులు,పారిశుద్య కార్మికులు,మీడియా,పోలీసులు,ఇతర సిబ్బందికి కృతజ్ఞతలు తెలిపారు
వార్డు మెంబర్ నుండి పార్లమెంట్ సభ్యుల వరకు ప్రజాప్రతినిదులంతా ప్రజల వద్దకు వెల్లి సేవ చేసాం జాగ్రత్తగా ఉంటూనే కరోనాను కట్టడి చేసాం ప్రతీ పేదవాడు ఆకలితో అలమటించద్దని పేదలకు బియ్యం,1500 రూపాయలు అందించిన ఘనత రాష్ట్ర మఖ్యమంత్రి కేసీఆర్ పాలనలోనూ ఉద్యమస్పూర్తిని చాటుతున్నారు
కరోనా కట్టడిలో కేసీఆర్ కృషి గొప్పదని నరేందర్ చేస్తున్న కార్యక్రమాన్ని ఆశీర్వదించడానికి ఈ కార్యక్రమానికి వచ్చానని అన్నారు ఇంత మంచి కార్యక్రమం చేపట్టిన ఎమ్మెల్యే నరేందర్ ,దాతలు,ప్రజా ప్రతినిదులు,టీఆర్ఎస్ పార్టీ నాయకులకు,కార్యకర్తలకు అభినందనలు తెలిపారు
భవిష్యత్ లో నగరాభివృద్దికి నా వంతు సహాకారం తప్పకుండా ఉంటుందని అందరం కలిసి నగర ఆభివృద్ది చేసుకుందామని తెలిపారు ఈ కార్యక్రమంలో మేయర్ గుండా ప్రకాశ్ రావు,ఎంపీ పసునూరి దయాకర్ కుడా చైర్మన్ మర్రి యాదవరెడ్డి, రాష్ట్ర మహిళ కో-ఆపరేటివ్ చైర్ పర్సన్ గుండు సుధారాణి, వరంగల్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షులు దిడ్డి కుమారస్వామి, కార్పొరేటర్లు , కావేటి కవిత రాజు యాదవ్, తూర్పాటి సులోచన సారయ్య,వీర బిక్షపతి, కూడా డైరెక్టర్లు మోడెం ప్రవీణ్,యెలగం శ్రీనివాస్, శివ శంకర్, గుండేటి నరేందర్,నీలం రాజ్ కిషోర్, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ రమేష్ బాబు, డా.హరి రమాదేవి,ఇతర ప్రజా ప్రతినిదులు,ముఖ్య నాయకులు,డివిజన్ నాయకులు,యూత్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *