కుస్తీ కన్నా దోస్తీ మేలు!

`జాతీయ స్థాయిలో కొత్త పొద్దుపొడుపు?

`కేసిఆర్‌ తో సఖ్యతే సరైంది!!

`బిజేపి జాతీయ నాయకత్వంలో కొత్త ఆలోచన!

`తెలంగాణ లో బిఆర్‌ఎస్‌ బలమైన పార్టీ.

`రైతులు, సంక్షేమ ఫలాల లబ్ధి దారులు కేసిఆర్‌ వెంటే.

`దేశ వ్యాప్తంగా ప్రాంతీయ పార్టీలలో బిఆర్‌ఎస్‌ వల్ల చలనం!

`అనేక రాష్ట్రాల నాయకత్వాలు కేసిఆర్‌ కు మద్దతుతో బిజేపిలో సరికొత్త అంతర్మధం.

`త్వరలో మోడీ తో కేసిఆర్‌ భేటీ?

`జాతీయ స్థాయిలో ఎన్నికల వరకు పరిస్థితులు ఎలా వుంటాయో?

`బాబుతో ఒరిగేదేమీ లేదు!

`బాబు బడాయి మాటలు తెలంగాణ ప్రజలు నమ్మరు!

`దేశంలో కేసిఆర్‌ కు వున్న క్రేజ్‌ బాబుకు లేదు.

`ఆంధ్రప్రదేశ్‌ లోనే నిలదొక్కుకోలేని బాబుతో కలిసి వెళ్లడం మొదటికే మోసం!

`బిజేపిని పలుమార్లు బాబు అవసరానికి వాడుకొని వదిలేయడమే కోలుకోకపోవడానికి కారణం.

`నిబద్ధత లేని నాయకుడు చంద్రబాబు.

`ఇదీ బిజేపి జాతీయ స్థాయిలో విసృతంగా జరుగుతున్న చర్చ!

`తెలంగాణ బిజేపి నేతల మాటలు నమ్మితే కష్టం!

`ఇంటలిజెన్స్‌ నివేదికలపైనే బిజేపి ఆధారం.

`రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆహ్వాన సమయంలో కేసిఆర్‌ లో కనిపించిన ఉత్సాహం.

హైదరాబాద్‌,నేటిధాత్రి: 

రాజకీయాలలో శాశ్వత మిత్రులు, శత్రువులు వుండరు. అసలు రాజకీయ నాయకురులలో ఆధిపత్యాలు తప్ప శత్రుత్వం వుండదు. అవసరమైతే నేను నీకు రక్ష లేకుంటే నువ్వు నాకు రక్ష. అంతే…కానీ నాయకుల మధ్య వుండే విభేదాలు కూడా సైద్దాంతిక భేదాభిప్రాయాలు మాత్రమే. అందుకే రాజకీయాలలో ఎప్పుడు ఏ పార్టీ, ఏ పార్టీతో పొత్తు నెరుపుతుందో ఎవరూ చెప్పలేరు. కొన్ని రకాల పొత్తులు, స్నేహాలు ఎన్నికల ముందు వుండొచ్చు. కొన్ని సార్లు ఎన్నికల తర్వాత వుండొచ్చు. మొత్తానికి పొత్తు లేని రాజకీయాలు ప్రజాస్వామ్య వ్యవస్థలో దుర్లభం. అందుకే రాష్ట్ర స్థాయి పొత్తులైనా, జాతీయ స్థాయిలో సర్థుబాటులైనా పార్టీల అవసరాల మేరకు వుంటాయి. తాజాగా జాతీయ స్థాయిలో కొత్త పొద్దుపొడుపు? మాట వినిపిస్తోంది.ఒకింత ఆశ్చర్యకరమైన కలయికే అనిపించినా, ఇంత వరకు సఖ్యతతో సాగిన పార్టీలే…ఈ మధ్య కాలంలో కొంత రెండు పార్టీలు దూరమైనా, మళ్ళీ స్నేహ హస్తాలు చాచుకుంటాయన్న ప్రచారం కూడా బలంగానే సాగుతోంది. కొంత కాలం క్రితం వరకు తెలంగాణ ముఖ్యమంత్రి కేసిఆర్‌ రాజకీయాలను బిజేపి తక్కువగా అంచనా వేసింది. బిఆర్‌ఎస్‌ ను తెలంగాణలోనే బలహీన పర్చుదామని చూసింది. కానీ తెలంగాణ లో క్షేత్ర స్థాయి పరిస్థితులను బిజేపి జాతీయ నాయకత్వం బాగా పరిశీలించింది. అటు కేంద్ర ఇంటలిజెన్స్‌ తో పాటు కొన్ని ప్రైవేటు సంస్థలు అందించిన సమాచారంతో బిజేపిలో కొత్త ఆలోచన మొదలైనట్లు చెప్పుకుంటున్నారు. 

తెలంగాణ ముఖ్యమంత్రి కేసిఆర్‌ పరిపాలన తీరులో తప్పు పట్టే అంశం ఒక్కటి కూడా లేదు.

 పైగా ఎనమిది సంవత్సరాల అతి తక్కువ సమయంలో తెలంగాణను మిగతా రాష్ట్రాల కంటే ముందుంచడం అన్నది గొప్ప విషయం. ఏ రంగంలో చూసినా తెలంగాణ నెంబర్‌వన్‌ గా కనిపిస్తోంది. వ్యవసాయ రంగంలో ఒక రాష్ట్రం ఇంత తక్కువ సమయంలో విప్లవాత్మక ప్రగతి సాధించిన దాఖలాలు గతంలో లేవు. కానీ తెలంగాణ లో ఎనమిదేళ్లలో కరువును జయించడం అన్నది సామాన్యమైన విషయం కాదు. అద్భుతం. ప్రాజెక్టుల నిర్మాణం అమోఘం. భవిష్యత్తు తరాల కోసం ఆలోచించి చేపట్టిన రిజర్వాయర్లు ఆధునిక దేవాలయాలని చెప్పడంలో సందేహం లేదు. కొన్ని శతాబ్థాలుగా సాగులో వెనుకబడిన తెలంగాణ ఎనమిదేళ్లలో అన్ని రాష్ట్రాలను వెనక్కి నెట్టేయడం అంటే ముఖ్యమంత్రి కేసిఆర్‌ చేసిన కృషి అనన్య సామాన్యమైనది. దానికి ఏ కొలమానం సరిపోదు. కేసిఆర్‌ తో కుస్తీ పట్టడం కన్నా సఖ్యతే సరైంది!! అని బిజేపి జాతీయ నాయకత్వం ఆలోచిస్తున్నట్లు సమాచారం. 

తెలంగాణ లో బిఆర్‌ఎస్‌ ఉద్యమ పార్టీ. 

ఉద్యమకారుడు కేసిఆర్‌ నేతృత్వంలో సాగుతున్న పార్టీ. సుదీర్ఘ కాలం పాటు ఉద్యమం, పోరాటంలో క్షేత్ర స్థాయికి చేరుకున్న పార్టీ. బిఆర్‌ఎస్‌ గా మారినా ప్రజలు ఆదరించనున్న పార్టీ. మొత్తంగా బలమైన పార్టీ. మరి అలాంటి పార్టీని డీ కొనాలంటే కేవలం బిజేపి బలం సరిపోదు. క్షేత్ర స్థాయిలో బిజేపికి క్యాడర్‌ లేదు. లీడర్‌ షిప్‌ కూడా అంతంత మాత్రమే. గెలుపు గుర్రాలుగా ఎన్నికల బరిలో కొట్లాడేంత శక్తి యుక్తులు లేవు. ఒక రకంగా చెప్పాలంటే గత స్థానిక సంస్థల ఎన్నికలలో అభ్యర్థులు కూడా దొరకలేదు. ఇటీవల ఓ రెండు ఉప ఎన్నికలలో ఆ పార్టీ నేతలు గెలవడం తప్ప బిజేపి సాధించిన విజయాలు లేవు. ఆ గెలిచిన రెండు సీట్లలో దుబ్బాకలో రఘునందన్‌ రావు కూడా సానుభూతి రాజకీయాలలో వెయ్యి ఓట్లతో బైట పడ్డాడు. ఇక ఈటెల రాజేందర్‌ విషయం వేరు. ఈ ఇద్దరూ గెలిచినా అ గెలుపు వారి వ్యక్తిగత ఖాతాలోకే వెళ్లిపోయాయి. అయితే తెలంగాణలో కొంత వరకు బిజేపి బలడిరదని మాత్రం చెప్పొచ్చు. ఆ బలం గెలుపోటములను ప్రభావితం చేసేంత మాత్రం బలపడలేదు. అందుకే ఓ వైపు దూకుడును కనబర్చుతూనే, మరో వైపు బిఆర్‌ఎస్‌ తో పొత్తు ఎలా వుంటుందన్న దానిపై అభిప్రాయ సేకరణ జరుగుతున్నట్లు చెబుతున్నారు. రైతులు, సంక్షేమ ఫలాల లబ్ధి దారులు కేసిఆర్‌ వెంటేవున్నారు. తాజాగా సిరిసిల్ల జిల్లాలో జరిగిన సెస్‌ ఎన్నికలలో కూడా బిఆర్‌ఎస్‌ అనూహ్య విజయం సొంతం చేసుకున్నది. రైతాంగం మొత్తం బిఆర్‌ఎస్‌ వెంటే వుందని చెప్పడానికి ఈ సాక్ష్యం చాలు అన్నదే బిజేపి జాతీయ నాయకత్వం నమ్ముతున్నట్లు సమాచారం. దేశ వ్యాప్తంగా ప్రాంతీయ పార్టీలలో బిఆర్‌ఎస్‌ వల్ల చలనం! ఏర్పడిరదనేది ఈ మధ్య జరిగిన కొన్ని సంఘటనలే నిదర్శనం. బిఆర్‌ఎస్‌ ను తొలుత బిజేపి కాస్త తక్కువగానే అంచనా వేసింది. దేశ వ్యాప్తంగా వస్తున్న స్పందనతో ఆ అవకాశం ఇతర పార్టీలకు ఇచ్చి మనం కొంప ముంచుకోవడం ఎందుకు అనుకున్నట్లుంది. అనేక రాష్ట్రాల నాయకత్వాలు కేసిఆర్‌ కు మద్దతుతో బిజేపిలో సరికొత్త అంతర్మధనం మొదలైనట్లు కనిపిస్తోంది. 

త్వరలో మోడీ తో కేసిఆర్‌ భేటీ?

 ఓ వైపు బిఆర్‌ఎస్‌, బిజేపి పొత్తు వార్తలు హల్‌ చల్‌ చేస్తున్న సందర్భంలోనే ప్రధాని మోడీ, బిఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌ ల భేటీ అనగానే అందరిలోనూ ఆసక్తి నెలకొన్నది. కేసిఆర్‌ చాణక్యం తెలిసిన వాళ్లెవరైనా, ఒక్కసారి కేసిఆర్‌ తో ఎవరు మాట్లాడినా వారిలో ఒక రకమైన విశ్వాసం ఏర్పడుతుంది. ఏ విషయాన్నైనా సూటిగా, స్పష్టంగా, అవతలి వ్యక్తికి సులువుగా అర్థం చేయించడం లో కేసిఆర్‌ దిట్ట. ఆయన మాటల చాతుర్యం కూడా తెలంగాణ రావడానికి కారణమైంది. ఇప్పుడు ప్రధాని మోడీతో కేసిఆర్‌ భేటీ అనగానే కొత్త సమీకరణాలు ఎలా వుంటాయన్న దానిపై చర్చ సాగుతోంది. ఎలాంటి రాజకీయ పరిస్థితులనైనా తనకు అనుకూలంగా మార్చుకోవడంలో కేసిఆర్‌ ను మించిన నాయకుడు మరొకరు లేరు. జాతీయ స్థాయిలో ఎన్నికల వరకు పరిస్థితులు ఎలా వుంటాయో? అప్పుడు కేసిఆర్‌ ను తోడు రమ్మంటే ఎలా వుంటుందో! అందుకే చంద్రబాబు ను నమ్ముకోవడం కన్నా కేసిఆర్‌ తో కలిసి సాగితే వెయ్యేనుగుల బలం అని ప్రధాని మోడీ కూడా నమ్ముతున్నట్లే వుంది. 

బాబుతో ఒరిగేదేమీ లేదుని బిజేపి ఒక నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. 

ముందు ఉభయ తెలుగు రాష్ట్రాలలో బలడాలంటే, రాజకీయాలను తమ ఆధీనంలోకి తెచ్చుకోవాలంటే టిడిపి తో జతకడితే ఎలా వుంటుందన్నదానిపై కొంత కాలం క్రితం బిజేపి ఆలోచించింది. కానీ టిడిపి పరిస్థితులు ఉభయ తెలుగు రాష్ట్రాలలో అనుకూలంగా లేనట్లు తేలింది. నిజానికి గతంలో కూడా బిజేపి మూలంగానే టిడిపి గెలుస్తూ వచ్చింది. తర్వాత కూరలో కరివేపాకులా బిజేపి ని వాడుకొని టిడిపి వదిలేసింది. ఇప్పుడు కూడా టిడిపి అదే చేస్తుందన్న అనుమానం బిజేపి వుంది. పైగా రెండు సార్లు చంద్రబాబు ప్రత్యక్షంగా బిజేపి పొత్తులో గెలిచి, రెండు సార్లు చారిత్రక తప్పిదం చేశానని చంద్రబాబు ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇప్పడే కాదు, ఎప్పటికైనా టిడిపి తో వెళ్తే మునగడం తప్ప తేలడం వుండదని బిజేపి పెద్దలు తెలుసుకున్నట్లున్నారు. బాబు ఐదేళ్లు పరిపాలించినా, ఆంధ్రప్రదేశ్‌ ప్రజలు 2019 లో జగన్‌ ను గెలిపించుకున్నారు. టిడిపి ని చిత్తు చిత్తుగా ఓడిరచారు. ఇప్పటికీ ఆంధ్రప్రదేశ్‌ లో ప్రజలు చంద్రబాబు ను కోరుకుంటున్న దాఖలాలు లేవు. అలాంటి చంద్రబాబు తో పొత్తుతో మేలు కన్నా నష్టమే ఎక్కువ. ఇక బాబు బడాయి మాటలు తెలంగాణ ప్రజలు నమ్మరు! తెలంగాణ లో చంద్రబాబు రెండు కళ్ల సిద్దాంతం టిడిపి ని ప్రజలకు దూరం చేసింది. మరోవైపు తెలంగాణ వచ్చిన కొద్ది రోజులకే కేసిఆర్‌ ప్రభుత్వాన్ని కూల్చే కుట్ర చేశాడు. తెలంగాణ ముఖ్యమంత్రి కేసిఆర్‌ కన్నెర్ర చేస్తే చంద్రబాబు ఆంద్రప్రదేశ్‌ కు పారిపోయాడు. పదేళ్ళ పాటు ఉమ్మడి రాజధానిగా వున్న హైదరాబాద్‌ ను వదిలిపోవాల్సి వచ్చింది. రాజధాని పేరుతో అమరావతి గ్రాఫిక్స్‌ చూపించాడు. ఆంధ్రప్రదేశ్‌ ను ఎటూ కాకుండా చేశాడు. ఆంధ్రప్రదేశ్‌ లో నిలదొక్కుకునే ధైర్యం లేని చంద్రబాబు తో తెలంగాణలో కలిసి వెళ్తే మొదటికే మోసం వస్తుందని బిజేపి అంచనా వేస్తోంది. పైగా నిబద్ధత లేని నాయకుడు చంద్రబాబు అన్నది బిజేపిలో బలంగా సాగుతున్న చర్చ అన్నది సమాచారం. ఇప్పుడున్న దేశంలో కేసిఆర్‌ కు వున్న క్రేజ్‌ చంద్రబాబు కు లేదు.

తెలంగాణ బిజేపి నేతలు కొందరు ఎన్నికలలో ఒంటరి ప్రయాణం కోరుకుంటున్నారు.

 వారి మాటలు బిజేపి జాతీయ నాయకత్వం నమ్మితే కష్టం! అందులో ప్రత్యేకంగా ముఖ్యమంత్రి కేసిఆర్‌ మీద కోపం వున్న కొద్ది మంది నాయకులు మాత్రమే తాము ఒంటరిగా ఎన్నికలు ఎదుర్కొంటామని ప్రకటనలు చేస్తున్నారు. కానీ తెలంగాణలో మరింత బలడేదాక ఏదొ ఒక పార్టీతో కలిసి సాగడమే మేలన్నది అసలైన బిజేపి నేతలు చెబుతున్న మాట. సహజంగా కాంగ్రెస్‌ ముక్త భారత్‌ అన్నదే బిజేపి నినాదం. అంతే కానీ ఇతర ప్రాంతీయ పార్టీలపై ఆ వైరం లేదు. ఇక తెలంగాణ విషయానికి వస్తే, టిఆర్‌ఎస్‌ తో బిజేపి ఎలాంటి కుస్తీ లేదు. ఈ రెండు పార్టీలు దోస్తీ కడితే ఎదురులేదు. తెలంగాణ తిరుగులేని శక్తిగా వున్న బిఆర్‌ఎస్‌ తో బిజేపి జత కడితే భవిష్యత్తులో మరింత బలపడే అవకాశం వుంటుంది. కానీ ఈ మధ్య కొందరు బిజేపి నేతలు పని గట్టుకొని చేస్తున్న అసత్య ప్రచారాన్ని నమ్మి బిజేపి జాతీయ నాయకత్వం తెలంగాణలో కేసిఆర్‌ కు దూరమైనట్లు అధిష్టానం గమనించింది. తెలంగాణ బిజేపి నాయకులు చెబుతున్న దానికి, ప్రజా క్షేత్రంలో వున్న వాస్తవ పరిస్థితులకు చాలా తేడా వుందనేది బిజేపి జాతీయ నాయకత్వం గమనించింది. తెలంగాణలో బిఆర్‌ఎస్‌ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలే ఆ ప్రభుత్వానికి అండగా నిలుస్తాయని చెప్పడంలో సందేహం లేదు. అంతటి అద్భుతమైన పథకాల అమలు దేశంలో ఎక్కడా లేదు. ప్రజలు కూడా తెలంగాణలో సంతృప్తిగా వున్నారు. రాష్ట్ర బిజేపి నేతలు చెప్పే విషయాలకు, తెలంగాణ లో పరిస్థితులకు పొంతన లేదని తేలిపోయింది. ఇంటలిజెన్స్‌ నివేదికలపైనే బిజేపి జాతీయ నాయకత్వం ఆధార పడాలని నిర్ణయించింది. ఎలాగైనా జాతీయ బిజేపి నాయకత్వం ఏది చెబితే అది రాష్ట్ర బిజేపి నాయకత్వం వినాల్సిందే. ఆచరించాల్సిందే! రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆహ్వాన సమయంలో కేసిఆర్‌ లో కనిపించిన ఉత్సాహం కూడా ఇందులో భాగమే అని అనుకుంటున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *