ఎమ్మెల్సీ తాతా మధుకు అభినందనలు తెలిపిన భాస్కర్ రావు, సిద్దార్ధ

మిర్యాలగూడ, నేటిధాత్రి:ఉమ్మడి ఖమ్మం జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలుపొందిన టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి తాతా మధు శాసనమండలి సభ్యులుగా గురువారం ప్రమాణం చేశారు. ఈ సందర్భంగా రాజ్యసభ సభ్యులు బడుగుల లింగయ్య యాదవ్ తో కలిసి మిర్యాలగూడ శాసనసభ్యులు నల్లమోతు భాస్కర్ రావు, తనయుడు,యువనేత నల్లమోతు సిద్దార్ధ తాతా మధుకు శాసనమండలిలోని ఛాంబర్ లో మర్యాదపూర్వకంగా కలిసి పుష్ప గుచ్ఛం అందజేసి అభినందనలు తెలిపారు. అనంతరం ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్ రావు మాట్లాడారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రజా సంక్షేమం కోసం పాటుపడుతోందన్నారు. అభివృద్ధి, సంక్షేమ పథకాల అమలులో దేశానికే దిక్సూచిగా మారిందన్నారు. టీఆర్ఎస్ ఎదురులేని రాజకీయ శక్తిగా ఎదిగిందన్నారు. నూరేండ్ల పాటు చెక్కుచెదరని పార్టీ సంస్థాగత నిర్మాణాన్ని టీఆర్ఎస్ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి కేసీఆర్ చేపట్టారని కితాబిచ్చారు. టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ సారథ్యంలో గులాబీ పార్టీ రోజురోజుకు మరింత బలోపేతం అవుతోందన్నారు. ఎన్నిక ఏదైనా టీఆర్ఎస్ పార్టీ జయకేతనం ఎగురవేస్తోందన్నారు. ఉమ్మడి ఖమ్మం జిల్లా అభివృద్ధి కోసం మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ శక్తివంచన లేకుండా కృషి చేస్తున్నారని కితాబిచ్చారు. టీఆర్ఎస్ పార్టీపై, నాయకత్వంపై ఉన్న ప్రగాఢ విశ్వాసం, నమ్మకంతో ఉమ్మడి ఖమ్మం జిల్లా స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు తాతా రావును గెలిపించారని అన్నారు. మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ సారథ్యంలో ఖమ్మం జిల్లా అభివృద్ధి లో తాతా రావు కీలక పాత్ర పోషిస్తారని భాస్కర్ రావు ఆకాంక్షించారు. కాగా, గతనెల 14న విడుదలైన స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాల్లో టీఆర్ఎస్ అభ్యర్థులంతా గెలుపొందారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో టీఆర్ఎస్ అభ్యర్థి తాతా మధు తన సమీప ప్రత్యర్థిపై 238 ఓట్ల మెజార్టీతో గెలుపాందారు. టీఆర్ఎస్ అభ్యర్థి తాతా మధుకి 480 ఓట్లు రాగా.. కాంగ్రెస్ అభ్యర్థి రాయల నాగేశ్వరరావుకి 242, కొండపల్లి శ్రీనివాసరావుకి 4, కోండ్రు సుధారాణికి ఒక్కటి కూడా పడలేదు. 12 ఓట్లు చెల్లుబాటు కాలేదు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *