అంబాల ప్రభాకర్ కు జాతీయ కళారత్న అవార్డు

జమ్మికుంట నేటిధాత్రి 

ఢిల్లీలో జరిగిన జాతీయ బహుజన సాహిత్య అకాడమీ అవార్డు ప్రదానోత్సవం లో జమ్మికుంట మండలం , మడిపల్లి గ్రామానికి చెందిన అంబాల ప్రభాకర్ (ప్రభు) గత కొన్ని సంవత్సరాలుగా కళాలపై ఉన్న మక్కువతో ఆర్ట్ మరియు డప్పు కళారంగంలో అత్యుత్తమ ప్రతిభ కనబరుస్తూ ఈ ప్రాంత ప్రజల మన్ననలు పొందిన సందర్భంగా వహుజన సాహిత్య అకాడమీ గుర్తించి జాతీయ కళారత్న అవార్డును అందజేయడం నిజంగా మన దళిత జాతికే గర్వకారణం, 

జాతీయ కళారత్న అవార్డును అందుకున్నందుకు హృదయపూర్వకంగా శుభాకాంక్షలు, హర్షం వ్యక్తం చేశారు,

అంబాల ప్రభాకర్ (ప్రభు) ప్రముఖ ఆర్టిస్టుగా కొన్ని వేలాది అద్భుతమైన అందమైన చిత్రాలను గీసి అందరి హృదయాల్లో సుస్థిరమైన స్థానాన్ని ఏర్పరచుకున్నారు, అదేవిధంగా అథ్లెటిక్స్ లో అనేక బహుమతులు గెలుచుకొని అనేక మెడల్స్ ని సాధించి జమ్మికుంట కరీంనగర్ జిల్లాకే వన్నె తీసుకు వచ్చినటువంటి అంబాల ప్రభు ఒక గాయకుడిగా డప్పు వాయిద్య కారుడుగా రాణిస్తూ గతంలో హుజరాబాద్ లో వెయ్యి డబ్బులతో ప్రపంచ గిన్నిస్ బుక్కు రికార్డు సాధించడం నిజంగా ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాలకు గర్వకారణంగా ఉందని తెలియజేస్తూ వారు ఇంకా అనేక విజయాలు సాధించాలని కోరుతూ అంబాల ప్రభాకర్ కు ద్రావిడ సాహిత్య సాంస్కృతిక కళామండలి వ్యవస్థాపక అధ్యక్షులు రామంచ భారత్, ఎస్ 90 మరియు అన్వేషణ పత్రిక ఛైర్మెన్ ప్రతాప్ తరపున హృదయపూర్వక అభినందనలు తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *