సెల్ఫ్‌ గోల్‌ రాజగోపాల్‌!

మునుగోడును మెడకు చుట్టుకుంటున్నాడు…

తనను తాను అతిగా ఊహించుకుంటున్నాడు…

తమది బ్రాండ్‌ అన్న భ్రమలోనే వున్నాడు

కాంగ్రెస్‌ వల్ల తాను గెలవలేదన్నంత దాకా వెళ్తున్నాడు…

సొంత పార్టీ మీద ఎప్పటికప్పుడు బురద జల్లుతూనే వున్నాడు…

కాంగ్రెస్‌ కు రాష్ట్రంలో సీన్‌ లేదంటున్నాడు….

వీలు చిక్కినపుడుల్లా బిజెపికి కన్ను గీటుతున్నాడు…

కమలంలో చేరిపోవాలని చెప్పకనే చెబుతున్నాడు….

గతం వెలుగులు భవిష్యత్తులో అని కలలు గంటున్నాడు…

ఎన్నుకున్న ప్రజలకు సేవ చేయలేక ప్రభుత్వంపై నిందలేస్తున్నాడు…

గోడమీద పిల్లి వాటం రాజకీయం చేస్తున్నాడు…

గెంటేస్తే పోదామనుకుంటున్నాడు…

మునుగోడును కారువశం చేయనున్నాడు…

గెలుపు నల్లేరు మీద నడకైనప్పుడు ఎల్లకాలం రాజకీయాలు ఇలాగే వుంటాయని కొందరు భ్రమపడుతుంటారు. దాని పర్యవసానమే తెలంగాణ రాగానే తమ్ముడు ఓడిపోయాడు…అన్న గెలిచాడు…తర్వాత జరిగిన ఎన్నికల్లో అన్న ఓడిపోయాడు…తమ్ముడు గెలిచాడు…కాని వారిలో మార్పు రాలేదు…అతి విశ్వాసంలో తేడా రాలేదు…ఏలాగైనా…ఏదో రకంగా మేమే గెలుస్తున్నాం…మాకే ప్రజల మద్దతు వుందన్న ఆలోచనతో గోడమీది పిల్లి వాటం రాజకీయాలు చేయడం అలవాటు చేసుకుంటున్నన్నారు. దాంతో మునుగోడు ఎమ్మెల్యే రాజగోపాల్‌రెడ్డి సెల్ప్‌ గోల్‌ చేసుకుంటున్నాడు. అతి విశ్వాసం ఎప్పుడో అప్పుడు నిండా ముంచేస్తాయన్నది తెలుసుకోలేకపోతున్నాడు…సరిగ్గా ఇప్పుడు ఆయన అదే పరిస్ధితుల్లో చిక్కుకున్నాడు. అసలు ఆయన ఏం మాట్లాడుతున్నాడో కూడా తెలియనంతగా వ్యాఖ్యలు చేస్తున్నాడు. నియోజకవర్గం అభివృద్ధి మాత్రమే కోరుకుంటున్నానంటాడు? అందుకోసం రాజీనామాకైనా వెనుకాడనంటాడు? తెలంగాణ ప్రభుత్వం తన నియోజకవర్గానికి నిధులు ఇవ్వడం లేదంటాడు? అనేక సార్లు అసెంబ్లీలో పోరాటం చేశానంటాడు…? బిజేపికి వెళ్తున్నట్లు ఓ వైపు సంకేతాలిస్తాడు? నేను వెళ్తానని మీకేమైనా చెప్పానా? అంటాడు. రాష్ట్రంలో టిఆర్‌ఎస్‌ ప్రభుత్వం మీద యుద్దం చేసే శక్తి బిజేపికే వుందంటాడు…బిజేపే గెలుస్తుంటాడు…? బిజేపికి ఎప్పుడు వెళ్తున్నారంటే…నేనెప్పుడు చెప్పానంటాడు…? అప్పుడే తాను రాజీనామా చేయాలనుకుంటే మీడియాకు చెప్పే చేస్తానంటాడు… తన రాజీనామా ఒక చారిత్రక సత్యంగా నిలిచిపోవాలంటాడు? ఇలా పరి పరి విధాలుగా మాట్లాడి ముందు చూస్తే నుయ్యి, వెనక చూస్తే గొయ్యి చేసుకుంటున్నాడు. పూర్తిగా ఊబిలో దిగిపోయే పరిస్ధితి తెచ్చుకుంటున్నాడు…తన రాజకీయ జీవితాన్ని తానే చేజేతులా చెడగొట్టుకుంటున్నాడు…ఎప్పటికప్పుడు మీన మేషాలు లెక్కబెడుతూ, రాజకీయాన్ని గందరగోళం చేసుకుంటున్నాడు. 

అసలు రాజగోపాల్‌రెడ్డి ఏం చేయాలనుకున్నాడు? అన్నదానిపై ఆయనకే స్పష్టత లేనట్లుంది అన్నది మాత్రం అందరికీ అర్ధమౌతోంది. కాని ఆయనకే అర్ధం కాకుండాపోతున్నట్లుంది. అయినా అది ప్రజలకు చెప్పడంలో మాత్రం పూర్తిగా విఫలమౌతున్నట్లే లెక్క. హుజూరాబాద్‌ ఎన్నికల సమయానికి ముందే ఆయన బిజేపిలోకి వెళ్తున్నట్లు, బిజేపికి తానే ప్రత్నాయ్నామన్నంత ప్రచారం చేసుకున్నాడు. తాను బిజేపిలోకి వెళ్తే ముఖ్యమంత్రి అభ్యర్ధిని నేనే అంటూ ఆయన చెప్పినట్లు కూడా అనేక ఆడియోలు బైటకు వచ్చాయి. కాకపోతే వాటిని గురించి ఎవరూ పెద్దగా పట్టించుకోలేదు. అప్పుడు బిజేపిలో ఈ పరిస్ధితి లేదు. బండి సంజయ్‌ నాయకత్వం రాలేదు. ఈటెల రాజేందర్‌ పార్టీలో చేరలేదు. దుబ్బాక రఘునందన్‌ ఇంకా అప్పటికి ఎమ్మెల్యే కాలేదు…ఆ సమయంలో తనకు తానుగా బాగానే ఊహించుకున్నాడు. కాని ఇప్పుడు రాజగోపాల్‌కు అక్కడ అంత సీన్‌లేదు. దాంతో బిజేపిలో చేరిక కోరికను ఆపుకోలేక, కాంగ్రెస్‌ లో ఇమడలేక పోతున్నట్లున్నాడు. . ఓ దశలో రాజగోపాల్‌రెడ్డి టిఆర్‌ఎస్‌లో కూడా చేరిపోతారన్నంత ప్రచారం కూడా జరిగింది. కాని ఎప్పటికప్పుడు రాజగోపాల్‌ తిప్పుతున్న వంకలు, ఇక్కడే కొనసాగుతున్నాయి. అడుగులు ముందుకు పడలేకపోతున్నాయి. ఆఖరుకు ఎవరూ నమ్మని పరిస్ధితిని తెచ్చుకుంటున్నారు. 

అన్న కోసం త్యాగమా? లేక తనకు తాను కొత్త రాజకీయమా? అన్నది కూడా తెలాల్సివుంది. కోమటి రెడ్డి వెంకటరెడ్డిది పిపిసి పదవి చేపట్టాలన్నది బలమైన కోరిక. కాని ఆ కోరిక కాంగ్రెస్‌లో రేవంత్‌రెడ్డి చేరికతో తీరలేదు. ఇప్పట్లో తీరే అవకాశం కనిపించడంలేదు. కాకపోతే రేవంత్‌ను అడుగడుగునా ఇబ్బందులకు గురిచేసే ఎత్తుగడలు మాత్రం వేయడం మానుకోవడంలేదు. మొన్నది దాకా అన్న వెంకటరెడ్డి . రేవంత్‌రెడ్డికి వ్యతిరేక పాత్ర పోషిస్తూ వచ్చాడు. ఆ పాత్రనుంచి వెంకటరెడ్డి ఈ మధ్య తప్పుకున్నాడు. అది పాత్రను తమ్ముడి పోషిస్తున్నాడు. సొంత పార్టీని ఏకేస్తున్నాడు. ఏకంగా రేవంత్‌రెడ్డిని క్రిమినల్‌ రాజకీయాల చేసేవాడంటూ తీవ్ర పదజాలం వాడాడు. దాంతో కాంగ్రెస్‌లో ప్రకంపనలు రేగినట్లే అన్నంద దూరం వెళ్లిపోయాడు. ఇంతకీ రాజగోపాల్‌ చెబుతున్న మాటల్లో , చేస్తున్న చేతల్లో ఎక్కడా పొంతన లేదు.

తనకు తన నియోజకవర్గ ప్రజల అభివృద్దే తనకు ముఖ్యమంటాడు. ప్రభుత్వం మునుగోడుపై శ్రద్ద పెట్టడం లేదంటాడు. తాజాగా మునుగోడు అభివృద్ధిపై ప్రభుత్వం స్పందిస్తుంటే తట్టుకోలేకపోతున్నాడు. ముఖ్యమంత్రి కేసిఆర్‌ తనను రాజకీయంగా ఎదుర్కొలేక ఎత్తుగడలు వేస్తున్నారని కొత్త కథలు అల్లేస్తున్నాడు. సరే ఒక వేళ తప్పని పరిస్ధితుల్లో రాజగోపాల్‌ రెడ్డి రాజీనామా చేసి, బిజేపిలో చేరితే ఉప ఎన్నిక వస్తే పరిస్ధితి ఏమిటన్నది కూడా ప్రజల ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. రాష్ట్రంలో బిజేపి దూకుడుగా వుందన్న భ్రమలో రాజగోపాల్‌ వున్నాడు. ఒక వేళ పార్టీ మారి, మళ్లీ మునుగోడులో రాజగోపాల్‌ గెలిచి చేసేదేముంటుంది? రాష్ట్రంలో అధికారంలో వున్న టిఆర్‌ఎస్‌ పార్టీ అదే పంధాను కొనసాగిస్తుంది. బిజేపి నుంచి రాజగోపాల్‌ పోటీచేస్తే ఈటెల రాజేందర్‌ సహకరిస్తాడా? అన్నది కూడా ఇక్కడ ప్రధానంగా చర్చించుకోవాల్సిన అంశం….ఎందుకంటే రేవంత్‌ రెడ్డికి, ఈటెల రాజేందర్‌కు వున్న సాన్నిహిత్యం తెలిసిందే…హుజారాబాద్‌లో పార్టీని ఓడిపోయినా ఫరవాలేదు..ఈటెల గెలిస్తే చాలు అన్నంతగా…! రేవంత్‌ సహకరించాడన్నది అందరూ చెప్పుకునే మాటే…ఇలాంటి సమయంలో బిజేపిలో రాజగోపాల్‌ చేరినా ఈటెల రాజేందర్‌ సహాకారం అన్నది రిక్తహస్తమే అవుతుంది. పరోక్షంగా ఆయన సహకారం కాంగ్రెస్‌ వైపే వుంటుంది. రేవంత్‌కు సహకరించేలా వుంటుంది. రేవంత్‌ను ఉమ్మడి నల్గొండలో హీరోను చేయాలన్నంతగా వుంటుంది. కొమటిరెడ్డి బ్రదర్స్‌ను జీరో చేయాలన్నంత దాకా సాగుతుంది. 

ఇదిలా వుంటే పిపిసి అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి మీడియాతో ఈటెల రాజేందర్‌ సిఎం మీద పోటీ చేస్తానన్నాడే గాని ఏ పార్టీ నుంచో అన్నది చెప్పలేదని సరికొత్త సందేహం ప్రజల మీదకు వదిలేశారు. దీనికి సమాధానం చెప్పాల్సిన ఈటెల రాజేందర్‌ కూడా ఇప్పటి వరకు ఆ వ్యాఖ్యను ఖండిరచలేదు. అవునని కూడా చెప్పలేదు. బిజేపి నాయకుడు ఎక్కడి నుంచి పోటీ చేస్తాడన్నది రేవంత్‌ రెడ్డి ఎలా ప్రకటిస్తాడన్నదానిని అంతర్లీనంగా అర్ధం చేసుకుంటే ఈటెల కూడా బిజేపిలో సంతోషంగా లేడన్నది తేలిపోయినట్లే లెక్క. హుజూరాబాద్‌ ఎన్నికల్లో కౌషిక్‌ రెడ్డి ఓట్లు కూడా ఈటెలకే పడ్డాయి. కౌషిక్‌ టిఆర్‌ఎస్‌లోకి వెళ్లడం వల్ల కాంగ్రెస్‌ సంప్రదాయ ఓటు అన్నది మార్పిడి జరిగిందనేది సుస్పష్టం. అక్కడ కాంగ్రెస్‌ ఓట్లు టిఆర్‌కు పడేలా కౌషిక్‌ రెడ్డి కూడా పూర్తి స్ధాయిలో ప్రచారం చేయనట్లే అనేది స్పష్టం. ఒక్కసారి అక్కడ గెల్లు శ్రీను గెలిస్తే, ఇక కౌషిక్‌కు రాజకీయ భవిష్యత్తు అంధకారమే…! అంటే ఎంతో సానుభూతి పొందిన ఈటెల రాజేందర్‌ హుజూరాబాద్‌ ఉప ఎన్నికల్లో అంత ఆషామాషీగా గెలవలేదు. పెట్టాల్సినంత ఖర్చు పెట్టాడు. టిఆర్‌ఎస్‌లో వున్నా కౌషిక్‌ సహాకారం అందలేదు. కాంగ్రెస్‌ఓట్లు ఆ పార్టీకి ఉపయోపడలేదు. అందరూ కలిసి ఈటెలను గెలిపించే ప్రయత్నం చేశారే గాని, బిజేపి మూలంగా ఈటెల గెలవలేదు. ఈ సంగతి రాజగోపాల్‌కు అర్ధం కానట్లుంది. ఈటెల గెలుపు మాత్రమే రాజగోపాల్‌ చూస్తున్నాడు..అది బిజేపి గెలుపనుకుంటున్నాడు. లోలోన జరిగిన రాజకీయం తెలిసికూడా తన ఆట ఒక వేళ రాజగోపాల్‌ ఆడగినా అది స్వయంకృతాపరాధమే అవుతుందనేది మాత్రం సత్యం. ఇక ఇలాంటి సమయంలో కాంగ్రెస్‌ను కాదని బిజేపికి రాజగోపాల్‌ వెళ్తే కాంగ్రెస్‌ ఊరుకుంటుందా? ముఖ్యంగా రేవంత్‌ తన రాజకీయం చేయకుండా ఊరుకుంటాడా? హుజూరాబాద్‌లో పోయిన పరువు నిలబెట్టుకోవాలని చూడడా? ఒకే దెబ్బకు రెండు పిట్టలన్నట్లు, అటు కోమటిరెడ్డి, ఇటు ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డిల రాజకీయం ఆట కట్టించాలని చూస్తున్న రేవంత్‌కు ఇది మంచి సువర్ణావశం కాదా? మునుగోడులో రాజగోపాల్‌ రాజీనామా చేసి,బిజేపినుంచి పోటీ చేస్తే పోగొట్టుకున్న చోట కాంగ్రెస్‌ సీటు కోసం ఆరాటపడదా? రేవంత్‌ హుజూరాబాద్‌లో చేసిన అస్త్ర సన్యాసం ఇక్కడ చేస్తాడా? రేవంత్‌రెడ్డికి కూడా ఇదిమంచి అవకాశం…తనను తాను నిరూపించుకునేందుకు రాజగోపాల్‌ ఇచ్చే బహుమానం…? రాజగోపాల్‌ సెల్ఫ్‌ గోల్‌తో కాంగ్రెస్‌కు పునరుజ్జీవం…! ఎంతో కొంతనైనా కాంగ్రెస్‌ ఓట్లు సాధించి, రెండో స్ధానంలో నిలిచినా అది సక్సెస్‌ అయినట్లే…మునుగోడు సీటు కారుకు అప్పగిస్తే కారు జోరుకు ఇక ఎవరూ బ్రేకులు వేయలేరు…భవిష్యత్తు కూడా కారుదే అని చెప్పుకోవడానికి అవకాశం ఇచ్చినట్లే చూడు…!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *