Headlines

పొలిటికల్‌ హోం గార్డు డ్యూటీకి రెడీనా!?

`కోమటి రెడ్డి దారికొచ్చారా! దారికి తెచ్చారా!!

`కోమటి రెడ్డి మనసు మార్చుకున్నారా?

` గాంధీ భవన్‌ మెట్లెక్కనన్న వెంకట రెడ్డి వచ్చారు…

` రేవంత్‌ రెడ్డి ని కలిశారు?

`పార్టీ బలోపేతంపై చర్చించారు?

`మళ్ళీ ముసిముసి నవ్వులు కురిపించారు?

` ఇతర సీనియర్లు అవాక్కయ్యారు?

` వెంకట రెడ్డికి మద్దతుగా నిలిచిన వాళ్లు డైలమాలో పడ్డారు?

` కోమటి రెడ్డిపై అదును చూసి కొండా సురేఖ విరుచుకుపడ్డారు?

`వెంకన్నను సస్పెండ్‌ చేయాలని పట్టుబడుతున్నారు?

`వెంకట రెడ్డికి వ్యతిరేక గళం పెరుగుతుందా?

` కోమటి రెడ్డి ఆత్మ రక్షణలో పడ్డారా?

` కేవలం రెడ్డి కావడం వల్లనే వెంకట రెడ్డికి చెల్లుతోందా?

` ఇంతకీ కాంగ్రెస్‌ లో ఏం జరుగుతోంది?

` రెడ్లు తప్పు చేసినా మాఫ్‌ చేస్తారా?

`ఇతర వర్గాల మాటకు విలువలేదా?

`విరుచుకుపడడం…సర్థుకుపోవడం అంతా రెడ్ల ఇష్టమే…నా?

`వెంకట రెడ్డి సారీ చెప్పాల్సిన పని లేదా?

`బంతి తన కోర్టుకొచ్చింది!….రేవంత్‌ రెడ్డి చాలనుకుంటున్నాడా…!!

`కొత్త ఇన్చార్జ్‌ ఎటు వైపు అన్నది కాదు?

`సర్థుబాటు చేయడమా? సరిదిద్దడమా!?

`సీనియర్లు దారికొచ్చినట్లేనా!

`జూనియర్లతో సఖ్యత సాగేనా!!

హైదరాబాద్‌,నేటిధాత్రి: 

 నేనంటే…నేనే…నాకంటే ఎక్కువ ఎవరు? లేరు! నా అంత త్యాగధనలు ఎవరూ కాంగ్రెస్‌ పార్టీలో లేరు…తెలంగాణ ఉద్యమం కోసం మంత్రి పదవికి రాజీనామా చేశాను…పిసిసి ప్రెసిడెంటు కావడానికి అన్నీ అర్హతలున్న నాయకుడిని…నన్ను పిపిసి అధ్యక్షుడిని చేస్తే నా తఢాకా చూపిస్తా….నేనేంటో చూపిస్తా…నా రాజకీయ అనుభవం రంగరిస్తా…తెలంగాణ మొత్తం కదిలిస్తా…పార్టీ శ్రేణులను ఏకం చేస్తా…తెలంగాణలో వున్న కాంగ్రెస్‌ నాయకులందరినీ నేను గుర్తుపడతాను…నన్ను అందరూ ఓన్‌ చేసుకుంటారు…నాకే పిపిసి…నేనే పిపిసి…! ఇలా అనుకోవడం…కలలు గనడం కోమటిరెడ్డి వెంకటరెడ్డికి అలవాటైనట్లుంది…ఆ ఆశలు తీరడం మాట దేవుడెరుగు? మాట మీద నిలబడని నాయకుడౌతున్నాడు…ఎప్పుడు ఏం మాట్లాడుతున్నాడో అర్ధం కాని నాయకుడౌతున్నాడు…అందరి చేత ఒకనాడు శభాష్‌ అనిపించుకున్న వెంకన్న…నిత్యం తిట్లు పడుతున్నాడు…శాపనార్ధాలు పడుతున్నాడు…అవమానాలు ఎదుర్కొంటున్నాడు…కానీ…ఇదంతా స్వయం కృతాపరాధమే…తనుకు తానుగా చేసుకున్నదే…అహం చూపిన దారిలో కోమటిరెడ్డి సోదరులు నడవడమే…తమకు తాము గొప్పగా ఊహించుకోవడమే…తమకంటే ఎవరూ ఎక్కువ కాదన్న అహంభావం ప్రతి క్షణం మదిలో నింపుకోవడమే…ఈ మోసానికి కారణం వ్యక్తిగత స్వార్ధమే…అయినా ఇప్పటికైనా కోమటిరెడ్డి వెంకటరెడ్డి మారిండని ఎవరూ అనుకోవడం లేదు…అసలు గాంధీ భవన్‌ మెట్లు కూడా ఎక్కనని చేసిన శథపం ఏమైంది…ఒట్టు తీసి గట్టున పెట్టేశాడా? మళ్లీ మనసు మార్చుకొని పాత పాటే పాడుతాడా? లేక కాంగ్రెస్‌లోనే కొనసాగుతాడా? అన్న సందేహం మాత్రం అందిరిలోనూ మెదలుతోంది. ఇంతకీ కోమటిరెడ్డిలో వచ్చిన మార్పుపై రకరకాల ఊహాగానాలు వినిపిస్తున్నాయి. బిజేపి దారులు మూసుకున్నాయన్నది కొందరు చెప్పే మాట….ఇంత చేస్తే బిజేపిలో తమ్ముడు రాజగోపాల్‌రెడ్డిని లెక్క చేస్తున్నవారే లేరక్కడ! అన్నది మరో మాట…తాను కూడా బిజేపిలో చేరి వున్న పరువు తీసుకోవడం…రాజకీయ భవిష్యత్తు అంధకారం చేసుకోవడం కన్నా, కాంగ్రెస్‌లో వుండి ఈ మాత్రం పరువు కాపాడుకోవడమే మంచిదన్న అభిప్రాయానికి వచ్చినట్లు చెప్పుకుంటున్నారు. ఏది ఏమైనా ఆవేశం ఎన్ని అనర్ధాలను తెచ్చిపెడుతుందో అర్ధమైనట్లుంది….అయితే ఇప్పటికైనా వెంకటరెడ్డికి తత్వం బోధపడిరదని అనుకోవచ్చో…లేదో మాత్రం ఎవరికీ అర్ధం కావడంలేదు….

 ఓ దశలో పిపిసి ప్రెసిడెంటు రేవంత్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలపై తీవ్రంగా మండిపడ్డ వెంకటరెడ్డి, మేం హోంగార్డులమా అంటూ ఫైర్‌ అయ్యారు. 

కాని ఇప్పుడు అదంతా బుస్సు…బుస్సు..తుస్సు…తుస్సే అని నిరూపించారు. నిజంగా మాటా మీద నిలబడే వ్యక్తిత్వమే వెంకటరెడ్డిది అయితే పదవి కోసం ఇంతలా పాకులాడాల్సిన అవసరం లేదు. తెలంగాణ కోసం మంత్రి పదవే వదలుకున్నానన్నప్పుడు పార్టీ పదవులు అంతకన్నా పెదవి కాదు…పైగా గాంధీ భవన్‌లో ఆయన తాజాగా చేసిన వ్యాఖ్యలు కూడా మరీ విచిత్రంగా వున్నాయి….కాంగ్రెస్‌ పార్టీలో జిల్లా అధ్యక్షులకు పార్టీయే అవసరమైన మేరకు నిధులు సమకూర్చాలని ఉచిత సలహా ఒకటి పడేశారు…ఒక జాతీయ పార్టీకి చెందిన జిల్లా అధ్యక్షులకు పార్టీ నిధులు పంపించే తప్ప పార్టీ నడిచే స్ధితిలో వుందన్న సంకేతాలు పంపడం అంటే అర్ధమేమిటి? పార్టీ దీన స్ధితిలో వుందన్న సత్యాన్ని చెప్పడంలో ఆంతర్యమేమిటి? కనీసం బస్సు కిరాయలు కూడా లేని వారిని డిసిసి అధ్యక్షులు చేయాలని సూచించెందెవరు? సరే పార్టీయే ఆదుకోవాలన్న మాటను ఒప్పుకున్నా…వారికి సాయం చేయడానికి తానెంత సహకరిస్తానో అన్నది మాత్రం వెంకటరెడ్డి చెప్పలేదు. పార్టీమీద తోసేసి, పార్టీని బలోపేతం చేసే బాధ్యత పిపిసిదే అని తప్పుకుంటే సరిపోతందా? సీనియర్‌గా ఆయనకు బాధ్యత లేదా? తనవ ంతు సాయం చేస్తానని చెప్పడం అవరసరం లేదా? ఇంకా కోమటి రెడ్డి మారరా? అని ప్రశ్నిస్తున్నవారు కూడా వున్నారు…

    కోవటిరెడ్డి వెంకటరెడ్డిని పార్టీ నుంచి సస్పెండ్‌ చేయాలని మాజీ మంత్రి కొండాసురేఖ సంచనల వ్యాఖ్యలు చేశారు.

 ఆమె చేసిన డిమాండ్‌లో కూడా న్యాయం వుందనే చెప్పాలి. మునుగోడు ఉప ఎన్నిక తెచ్చిందే ఆ కుటుంబం. కాంగ్రెస్‌లో పదవులు అనుభవించి, బలపడిన తర్వాత రాజగోపాల్‌రెడ్డి చేసిందేమిటో! అందరికీ తెలుసు. అలాంటి నాయకుడికి అన్నగా మద్దతు తెలుపుతూ…కాంగ్రెస్‌ పార్టీకి ద్రోహం చేసిన నాయకుడు వెంకటరెడ్డి. మునుగోడు ఎన్నికల ముందు వెంకటరెడ్డి చేసిన ప్రచారం ఎలాంటిదో చూశాం….అసలు కాంగ్రెస్‌పార్టీకి తెలంగాణలో ఉనికే లేదన్నంతగా వెంకటరెడ్డి కూడా మాట్లాడాడు…నిన్నటిదాకా గోడమీద పిల్లిగా వున్నాడు…ఇప్పుడు తత్వం బోధ పడి దారికొచ్చారు…! అయితే తాను హోంగార్డు డ్యూటీకి సిద్ధమని ఒప్పుకున్నట్లేనా? అన్న ప్రశ్న కూడా ఉత్పన్నమౌతోంది…ఇక్కడ మరో విషయం కూడా చెప్పుకోవాలి. కోమటిరెడ్డి తిరుగుబాటులో గట్టిగా వున్నారన్న నమ్మకంతో పాపం సీనియర్లు ఎంతో మంది ఆయనకు మాట మద్దతునిచ్చారు. కోమటిరెడ్డిని బలపర్చారు. రేవంత్‌ రెడ్డి మీద నిత్య అసమ్మతి వాదులుగా ముద్ర పడ్డారు. అంతే కాదు కోవర్టులుగా కూడా పిలిపించుకుంటున్నారు. మరి అలాంటి నేతల గొంతులో పచ్చివెలక్కాయ పడినట్లైంది. నిజానికి కోమటిరెడ్డి వెంకటరెడ్డికి సపోర్టుగా నిలిచిన వారిలో అనేక మంది సీనియర్లు వున్నారు. వారిలో ఉత్తమ్‌ కుమార్‌రెడ్డి, జానారెడ్డిలుకూడా వున్నారు. మరో సీనియర్‌ నాయకుడు హనుమంత రావు ఎంతో గట్టిగా వెంకటరెడ్డికి మద్దతుగా నిలిచారు. కాని వాళ్లంతా ఇప్పుడు ఒక్కసారిగా అవాక్కయ్యారు. కోమటిరెడ్డి వెంకటరెడ్డి గాంధీ భవన్‌ మెట్లెక్కారు…రేవంత్‌రెడ్డిని కలిశారు… పార్టీ బలోపేతంపై చర్చలు జరిపారు…ఇదంతా నమ్మశక్యంగా వుందా? అంటే నమ్మాలి…నాయకులు,కార్యకర్తలు పిచ్చోళ్లు కావాలి…ఇదేనా కాంగ్రెస్‌ రాజకీయం…!

రెడ్డీలకే ఈ వెసులుబాటు వుంటుందా? 

అన్న పార్టీలో సర్వత్రా వినిపిస్తోంది. ఇతర సామాజిక వర్గాల నేతలకు లేని ప్రాధాన్యత ఒక్క రెడ్డి వర్గానికికే కాంగ్రెస్‌లో ఇంతలా ఎందుకు పెరిగిపోయిందన్న వాదనలు కూడా వినిపిస్తున్నాయి. రెడ్డి…రెడ్డి ఎంత పెద్ద మాటలు అనుకున్నా! కలిసిపోతారు…కలిసి సాగుతారు….ముసి ముసి నవ్వులు నవ్వుకుంటారు…అన్నీ మర్చీపోతారా? పార్టీ కంటే వారికి వ్యక్తిగత సాన్నిహిత్యాలే అవసరమా? అన్న ప్రశ్నలు వినిపిస్తున్నాయి. పిసిసి అధ్యక్షుడు రేవంత్‌రెడ్డిని అవమానిస్తున్నవారిలో ఆయన సామాజిక వర్గానికి చెందిన నేతలే ఎక్కువ. అయినా వారిపై రేవంత్‌రెడ్డికి ప్రేమ ఎక్కువ. ఇంత జరిగినా రేపటి రోజు మనం బరం పురం అన్నట్లు వాళ్లు చెప్పిన నేతలకు పదవుల కోసం అందరూ కలిసి ఒక్కటైనా ఆశ్చర్యపోనక్కర్లేదు…కాని పార్టీ కోసం పనిచేస్న్నువారికి ఇలాంటి నేతలు ఇస్తున్న సందేశం ఏమిటన్నదానిపై కూడా ప్రజలు గమనిస్తారన్నది మర్చిపోయారు…పార్టీ అధికారంలోకి రావాలన్న ఆలోచన అసలు కాంగ్రెస్‌లో ఎవరికీ లేదు. కష్టపడి పనిచేద్దామన్న సోయి లేదు… కలిసికట్టుగా వుందామన్న ఐకమత్యం లేదు…పొరుగున కర్నటకలో పార్టీ బలోపేతంపై అనేక వార్తలు వస్తున్నాయి. అక్కడి నేతలను చూసైనా మారుదామన్న ఆలోచన ఎవరూ చేయడం లేదు…విబేధాలు…సహజం…పైకి రాజకీయాలు అసహజం…అంతా ఆ తాను ముక్కలే…అంతా ఒక్కటే…కాని ఎవరికి వారే…యమునా తీరే…ఇదే కాంగ్రెస్‌ తీరు…ఎవరు మార్చినా మారరు…ఎంత మంది ఇన్‌చార్జిలొచ్చినా..వారు మారాల్సిందే గాని, వీళ్లు మారరు…పార్టీని బతికి బట్ట కట్టనివ్వరు…అందతే…!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *