పేద్ది కుసుమకు జాషువ విశిష్ట సేవా అవార్డు

వరంగల్ (జనగామ జిల్లా), నేటిధాత్రి: జనగామ పట్టణానికి చెందిన రంగవల్లుల రంగోలి కళాకారిని పెద్ది కుసుమ కు జాతీయ కళారత్న అవార్డు …..ప్రముఖ సామాజిక స్వచ్ఛంద సేవా సంస్థలు *హోప్ స్వచ్ఛంద సంస్థ* మరియు *సింధూ ఆర్ట్స్ అకాడమి* సంయుక్తంగా నవయుగ కవి చక్రవర్తి,కవి కోకిల, పద్మభూషణ్, సామాజిక కవి శ్రీ *గుర్రం.జాషువా* 126 వ జన్మదినోత్సవాన్ని పురస్కరించుకుని ఈ రోజున రవీంద్రభారతిలో నిర్వహిస్తున్న *గుర్రం.జాషువా జాతీయ పురస్కారాలు- 2021* కార్యక్రమం లో రెండు తెలుగు రాష్ట్రాలలోని 14 రంగాలకు చెందిన ప్రతిభావంతులకు


*గుర్రం జాషువా జాతీయ విశిష్ట సేవా అవార్డు*

*గుర్రం జాషువా జాతీయ కళారత్న అవార్డు*

*గుర్రం జాషువా జాతీయ పర్యావరణ మిత్ర అవార్డు*
లను అందజేసింది. ఇందులో భాగంగా చిత్రలేఖనం రంగంలో ఒక విభిన్నమైన ఆలోచనలతో సామాజిక, సందేశాత్మక చిత్రాలు వేస్తూ ముఖ్యంగా కరోనా సమయంలో రంగోళీ ద్వారా మాస్కులు సామాజిక దూరం వ్యక్తిగత శుభ్రత పట్ల అవగాహన కల్పిస్తూ సమాజం పట్ల తన బాధ్యత ను నిర్వహించినందుకు గాను నా రంగోళి కళ *గుర్రం జాషువా జాతీయ కళారత్న అవార్డుకు* ఎంపికైంది.ఈ అవార్డు ను ఈ రోజు రవీంద్రభారతిలో దైవజ్ఞ శర్మ ,
గోరేటి వెంకన్న ,వై యస్ ఆర్ శర్మ , మధుసూదన్ , బిక్కి కృష్ణ , దైద వెంకన్న మరియు ముఖ్య అతిథులకి అందరి చేతుల మీదుగా అందుకున్నాను. ఈ పురస్కారం నా బాధ్యతను మరింత పెంచిందని ,నా ఈ కళను నన్ను గుర్తించి ఈ అవార్డు కి ఎంపిక చేసిన సమస్త సభ్యులకు ధన్యవాదాలు తేలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *