నిరుద్యోగులను మోసం చేస్తున్న రాష్ట్ర ప్రభుత్వం ప్రేమేందర్ రెడ్డి

గెలిస్తే చేయాల్సిన పనులు బిజెపి చేతిలో ఓడితే చేస్తున్నారు*

*ఎమ్మెల్సీగా గెలిపించి ఒక్క అవకాశం బిజెపికి ఇవ్వండి*

శాయంపేట, నేటిధాత్రి: రాష్ట్రంలో ఉన్న ప్రభుత్వ ఉద్యోగులకు పీఆర్సీ కల్పించకుండా, నిరుద్యోగులకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించకుండా రాష్ట్ర ప్రభుత్వం మోసం చేస్తుందని బిజెపి వరంగల్ ఖమ్మం నల్గొండ ఎమ్మెల్సీ అభ్యర్థి గుజ్జుల ప్రేమేందర్రెడ్డి అన్నారు. శాయంపేట మండల కేంద్రంలోని బిజెపి కార్యాలయాన్ని భూపాలపల్లి ఇంచార్జ్ చందుపట్ల కీర్తిరెడ్డితో కలిసి సందర్శించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో బిజెపి ఎమ్మెల్సీ అభ్యర్థి ప్రేమేందర్ రెడ్డి మాట్లాడుతూ స్వరాష్ట్రం ఏర్పడితే తమ ఉద్యోగాలు తమకు వస్తాయని అని యువతకు ఎన్నో ఆశలు కలిగించిన సీఎం కేసీఆర్ ఏ ఒక్క హామీని నెరవేర్చకుండా ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించకుండా నిరుద్యోగ యువతను మోసం చేస్తూ ఎంతో మందికి ఉపాధి కల్పిస్తూ జిల్లాలో ఉన్న ఏకేక
కమలాపూర్ బెల్ట్ రొయన్ ఫ్యాక్టరీని టిఆర్ఎస్ ప్రభుత్వం కాపాడలేక పోయిందని అన్నారు. ప్రభుత్వ ఉద్యోగులకు పిఆర్సి కల్పించకుండా నిర్లక్ష్యానికి గురి చేస్తున్నారని, ప్రజాసేవ చేస్తామని ఎమ్మెల్సీగా గెలుపొందిన వారు విద్యావ్యవస్థను ప్రతిష్ఠాం చేయకుండా యూనివర్సిటీ మంజూరు చేసుకుని ప్రభుత్వ యూనివర్సిటీలను నిర్లక్ష్యానికి గురి చేస్తున్నారని, 400 మంది స్టాప్
ఉన్న కాకతీయ యూనివర్సిటీలో నేడు 120 మంది మాత్రమే ఉన్నారంటే ప్రభుత్వ విద్యా వ్యవస్థను ఏ రకంగా నిర్లక్ష్యానికి గురి చేశారు అనేది ఇది చూస్తే అర్థమవుతుందని అన్నారు. కరోనా ప్రభావంతో పాఠశాలలు మూతపడగా ఉపాధి కోల్పోయిన ప్రైవేట్ ఉపాధ్యాయులను కాపాడడానికి రాష్ట్రప్రభుత్వం ఏ ఒక్క చర్య చేపట్టకపోవడం బాధాకరమన్నారు. రాష్ట్రంలో
ఖాళీగా ఉన్న ఉద్యోగాలు భర్తీ చేయకపోవడం, కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన స్కిల్ డెవలప్మెంట్ యువతకు అవకాశాలు ఉన్నా పథకాలు రాష్ట్రంలో అమలు చేయకపోవడంతో యువత ఉద్యోగ ఉపాధి అవకాశాలు లేక
ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని
విచారం వ్యక్తం చేశారు.

*గెలిస్తే చేయాల్సిన పనులు బిజెపి చేతిలో ఓడితే చేస్తున్నారు*

ప్రభుత్వం గెలిస్తే చేయాల్సిన పనులు బిజెపి పార్టీ చేతిలో టిఆర్ఎస్ ప్రభుత్వం ఓటమి పాలైతే చేస్తుందని, టిఆర్ఎస్ ప్రభుత్వానికి బుద్ధి చెప్పడానికి ప్రజలు దుబ్బాక హైదరాబాద్ ఎన్నికలలో ఓడిస్తే గెలిచినప్పుడు చేయని పనులు టిఆర్ఎస్ ప్రభుత్వం బీజేపీ చేతిలో ఓటమి బాలయ్యక మొదలు పెట్టిందని ఎద్దేవా చేశారు. వరంగల్ నగరాన్ని వరదల్లో మించిన పాపం టిఆర్ఎస్ ప్రభుత్వ నాయకులదేఅని నాలాలను ఎక్కడికక్కడ కబ్జా చేయడం, నాలలక అడ్డంగా భవనాలు నిర్మించడంతో వరంగల్ నగరం వరద ముప్పుకు గురైందని అన్నారు. వరంగల్ నగర అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం అనేక నిధులు కేటాయిస్తూ ఉంటే రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన ఏ ఒక్క మాట కూడా నిలబెట్టుకోకుండా అవుటర్ రింగ్ రోడ్డు ఎటువంటి అభివృద్ధి పనులు చేపట్టలేదన్నారు. ప్రజాస్వామ్య విధంగా ప్రజలు టీఆర్ఎస్ పార్టీకి తగిన బుద్ధి చెప్పాలని
నిర్ణయించుకున్నారని ఎమ్మెల్సీ ఎన్నికలలో బిజెపి పార్టీకి ఒక అవకాశాన్ని కల్పించి ఎమ్మెల్సీ అభ్యర్థిగా గెలిపించాలని పట్టభద్రులను కోరారు. ఈ కార్యక్రమంలో బిజెపి నాయకులు ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు.

Similar Posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *